బాలీవుడ్ ఫిట్‌నెస్ బ్యూటీ మలైకా అరోరా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. అర్బాజ్ ఖాన్‌తో విడాకులు, ఆ తర్వాత యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో సుదీర్ఘ కాలం డేటింగ్.. ఇలా ఆమె లైఫ్ ఓపెన్ బుక్ అని తెలిసిందే.

అయితే, ఇటీవల అర్జున్ కపూర్‌తో బ్రేకప్ తర్వాత మలైకా అరోరా ఎవరితో కనిపించినా ‘మిస్టరీ మ్యాన్’ ఎవరూ అంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఓ మిస్టరీ మ్యాన్‌తో మలైకా అరోరా డేటింగ్ చేస్తోందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఆ క్రమంలో ఈ పుకార్లపై మలైకా అరోరా తాజాగా ‘ది నమ్రత జకారియా షో’లో క్లారిటీ ఇచ్చారు.
అర్జున్ నా జీవితంలో భాగమే..
మాజీ ప్రియుడు అర్జున్ కపూర్ గురించి మలైకా అరోరా మాట్లాడుతూ ఎంతో హుందాగా స్పందించారు. "అర్జున్ నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి. అతడు ఎప్పటికీ నా లైఫ్‌లో అంతర్భాగమే. మా గతం గురించి లేదా భవిష్యత్తు గురించి నేను ఎక్కువగా మాట్లాడాలని అనుకోవడం లేదు. ఇప్పటికే మా ఇద్దరి గురించి మీడియాలో చాలా రాశారు. కావాల్సినంత చర్చ జరిగింది. దానికి ఇంకా మసాలా జోడించడం నాకు ఇష్టం లేదు" అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది మలైకా అరోరా.
ఆ మిస్టరీ మ్యాన్ కథేంటంటే?
ఇక తనతో పాటు కనిపిస్తున్న కొత్త వ్యక్తి (మిస్టరీ మ్యాన్) గురించి వస్తున్న వార్తలపై మలైకా అరోరా నవ్వుతూ సమాధానమిచ్చారు. "ప్రజలకు మాట్లాడటం అంటే ఇష్టం. నేను బయటకు వెళ్లినప్పుడు నా పక్కన ఎవరైనా కనిపిస్తే చాలు, అది పెద్ద చర్చకు దారితీస్తుంది. అనవసరమైన ఈ పుకార్లకు నేను ఆజ్యం పోయదలుచుకోలేదు" అని మలైకా అరోరా అన్నారు.
"నిజం చెప్పాలంటే.. నేను బయట అడుగుపెట్టిన ప్రతిసారి నా పాత స్నేహితుడు కావచ్చు, పెళ్లయిన ఫ్రెండ్ కావచ్చు, నా మేనేజర్ కావచ్చు.. చివరకు నా గే ఫ్రెండ్స్‌తో కనిపించినా సరే, వారితో నాకు ముడిపెట్టేస్తున్నారు (సంబంధం)" అని ఆవేదన వ్యక్తం చేశారు మలోకా అరోరా.
{{/usCountry}}"నిజం చెప్పాలంటే.. నేను బయట అడుగుపెట్టిన ప్రతిసారి నా పాత స్నేహితుడు కావచ్చు, పెళ్లయిన ఫ్రెండ్ కావచ్చు, నా మేనేజర్ కావచ్చు.. చివరకు నా గే ఫ్రెండ్స్‌తో కనిపించినా సరే, వారితో నాకు ముడిపెట్టేస్తున్నారు (సంబంధం)" అని ఆవేదన వ్యక్తం చేశారు మలోకా అరోరా.
{{/usCountry}}ఈ వార్తలు చూసి తన తల్లి కూడా ఆశ్చర్యపోతారని మలైకా అరోరా తెలిపారు. "నా తల్లి ఫోన్ చేసి.. ‘ఎవరు బేబీ వీళ్లు? ఇప్పుడు మళ్లీ ఎవరి గురించి మాట్లాడుతున్నారు?’ అని అడుగుతుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వింటే నాకు కేవలం నవ్వు మాత్రమే వస్తోంది" అని మలైకా అరోరా పేర్కొన్నారు.
మలైకా ప్రయాణం..
కాగా, 52 ఏళ్ల మలైకా అరోరా 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. 2017లో వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నారు. వీరికి అర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు.
2016 నుంచి అర్జున్ కపూర్‌తో ప్రేమలో ఉన్న మలైకా అరోరా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇటీవల హీరోతో విడిపోయారు. ప్రస్తుతం మలైకా అరోరా తన కెరీర్, ఫిట్‌నెస్, వ్యక్తిగత ప్రశాంతతపై దృష్టి పెట్టారు.