ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ది రాజాసాబ్ మూవీపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఇది రాజాసాబ్ కాదు డూప్ సాబ్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇందులో హీరోకు, హీరోయిన్ కు బాడీ డబుల్ వాడారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ మాళవిక మోహనన్ రియాక్టయింది.
మాళవిక మోహనన్ యాక్షన్

ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ది రాజాసాబ్ సినిమాలో మాళవిక మోహనన్ ఓ యాక్షన్ సీక్వెన్స్ లో నటించింది. హీరో నానమ్మను హింసించిన రౌడీలను మాళవిక చితక్కొడుతుంది. అయితే ఈ యాక్షన్ సీన్స్ మాళవిక చేయలేదని ఆమె డూప్ చేసిందనే ట్రోల్స్ వస్తున్నాయి. రాజాసాబ్ షూటింగ్ సమయంలోని మాళవిక డూప్ ఫొటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడమే కారణం.
వీడియో ప్రూఫ్స్
రాజాసాబ్ సినిమాలో యాక్షన్ సీన్స్ మాళవిక చేయలేదని, బాడీ డబుల్ యూజ్ చేశారనే కామెంట్లు వస్తున్నాయి. వీటిపై రియాక్టయిన మాళవిక తానే యాక్షన్ సీన్స్ చేశానంటూ, ప్రూఫ్స్ గా కొన్ని వీడియోలు కూడా పోస్టు చేసింది.
‘‘ది రాజాసాబ్ సినిమాలో నేను సొంతంగా స్టంట్స్ చేశాననే ట్వీట్స్, ఆర్టికల్స్ చూశా. కానీ సినిమాలో నా స్టంట్ డబుల్ అయిన ఓ అమ్మాయి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక ఇవన్నీ నా బాడీ డబుల్ చేసిందనే వార్తలూ చూశా’’ అని మాళవిక మోహనన్ ఎక్స్ లో రాసుకొచ్చింది.
నాకు యాక్షన్ అంటే ఇష్టం
‘‘ముందుగా నాకు యాక్షన్ అంటే ఇష్టం. యాక్షన్ సీన్లు చేయడాన్ని ఎంజాయ్ చేస్తా. చిన్నప్పటి నుంచే నేను స్పోర్టీ గర్ల్ ను. నా బాడీకి ఫిజికల్ ఛాలెంజ్ ఇవ్వడాన్ని, కొత్త విషయాలు నేర్చుకోవడాన్ని ఎంజాయ్ చేస్తా’’ అని మాళవిక పోస్టులో పేర్కొంది.
స్టంట్ డబుల్
{{/usCountry}}‘‘ముందుగా నాకు యాక్షన్ అంటే ఇష్టం. యాక్షన్ సీన్లు చేయడాన్ని ఎంజాయ్ చేస్తా. చిన్నప్పటి నుంచే నేను స్పోర్టీ గర్ల్ ను. నా బాడీకి ఫిజికల్ ఛాలెంజ్ ఇవ్వడాన్ని, కొత్త విషయాలు నేర్చుకోవడాన్ని ఎంజాయ్ చేస్తా’’ అని మాళవిక పోస్టులో పేర్కొంది.
స్టంట్ డబుల్
{{/usCountry}}‘‘నటీనటులే సొంతంగా యాక్షన్ సీన్లు చేస్తున్నా సెట్స్ లో స్టంట్ డబుల్ కచ్చితంగా ఉంటారు. ఎందుకంటే రిహార్సల్స్ చేయడానికి యాక్షన్ డైరెక్టర్లు వాళ్లను రప్పిస్తారు. అలాగే కొన్ని ప్రమాదకరమైన సీన్లలోనే స్టంట్ డబుల్ ను యూజ్ చేస్తారు. ఇక్కడ నేను యాక్షన్ సీన్స్ చేస్తున్న కొన్ని వీడియోలు ఉన్నాయి’’ అని మాళవిక పోస్ట్ ఎండ్ చేసింది.
రాజాసాబ్ గురించి
ప్రభాస్ తన కెరీర్ లో చేసిన ఫస్ట్ హారర్ మూవీ ది రాజాసాబ్. సంక్రాంతి 2026 సందర్భంగా ఈ మూవీ జనవరి 9న థియేటర్లలో రిలీజైంది. కానీ అంచనాలు అందుకోలేకపోయింది. రూ.400 కోట్ల బడ్జెట్ తో తీస్తే రూ.205 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ మూవీలో ప్రభాస్, జరీనా వహాబ్, సంజయ్ దత్, మాళవిక, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ తదితరులు నటించారు. ఈ సినిమా ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.