...
...
Next Story

ప్రతి మహిళకు ఏదో ఒక రూపంలో వేధింపులు- అత్యాచార బాధితురాలిగా నటించడమే సులభం- మలయాళ నటి కని కుస్రుతి కామెంట్స్

తాప్సీ పన్ను, కని కుస్రుతి ప్రధాన పాత్రల్లో నటించిన కోర్ట్‌ రూమ్ డ్రామా ‘అస్సీ’ ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఇందులో అత్యాచార బాధితురాలిగా నటించిన మలయాళ నటి కని కుస్రుతి తన పాత్ర గురించి, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Published on: Feb 19, 2026, 11:46:09 IST
Advertisement

బలమైన సామాజిక అంశాలను వెండితెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు అనుభవ్ సిన్హా శైలే వేరు. ‘ముల్క్’, ‘ఆర్టికల్ 15’, ‘థప్పడ్’ వంటి చిత్రాల తర్వాత ఆయన నుంచి వస్తున్న మరో మూవీ ‘అస్సీ’ (Assi). ఒక దారుణమైన అత్యాచార కేసులో న్యాయం కోసం ఇద్దరు మహిళలు వ్యవస్థతో చేసే పోరాటమే ఈ సినిమా.

నిజ జీవితం కంటే నటనే సులభం

ప్రతి మహిళకు ఏదో ఒక రూపంలో వేధింపులు- అత్యాచార బాధితురాలిగా నటించడమే సులభం- మలయాళ నటి కని కుస్రుతి కామెంట్స్
ప్రతి మహిళకు ఏదో ఒక రూపంలో వేధింపులు- అత్యాచార బాధితురాలిగా నటించడమే సులభం- మలయాళ నటి కని కుస్రుతి కామెంట్స్

ఇందులో న్యాయవాదిగా హీరోయిన్ తాప్సీ పన్ను నటించగా, అత్యాచార బాధితురాలిగా జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ నటి కని కుస్రుతి కీలక పాత్ర పోషించారు. సినిమా విడుదలకు ముందు ఒక జాతీయ మీడియాతో మాట్లాడిన కని కుస్రుతి తన పాత్ర తాలూకు మానసిక స్థితిని వివరించారు. సాధారణంగా ఇలాంటి సున్నితమైన పాత్రలు చేస్తున్నప్పుడు నటీనటులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. కానీ, కని కుస్రుతి మాత్రం భిన్నంగా స్పందించారు.

"నిజం చెప్పాలంటే, భారతదేశంలో దాదాపు ప్రతి మహిళ తన జీవితంలో ఏదో ఒక దశలో ఏదో ఒక రూపంలో వేధింపులను ఎదుర్కొనే ఉంటుంది. అలాంటప్పుడు, ఒక నటిగా ఆ పాత్రలో నటించడం కంటే, ఈ సమాజంలో ఒక మహిళగా రోజువారీ సవాళ్లను ఎదుర్కోవడమే నాకు ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది. జరగని దానిని కెమెరా ముందు చేయడం కంటే, ఇక్కడ జీవించడమే పెద్ద పోరాటం" అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు కని కుస్రుతి.

షూటింగ్ సమయంలో భయపడిన తోటి నటులు

అస్సీ సినిమాలోని అత్యంత కఠినమైన అత్యాచార సన్నివేశాల చిత్రీకరణ గురించి కని కుస్రుతి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. "ఆ సన్నివేశంలో విలన్లుగా నటించిన నా తోటి నటులు ఆ సీన్ చేయాలంటేనే ఎంతో భయపడిపోయారు. వారి భయాన్ని చూసినప్పుడు వారు నిజంగానే నటిస్తున్నారని నాకు అర్థమైంది. నిజానికి, బయటి సమాజంలో ఒంటరిగా నడుస్తున్నప్పుడు ఎదురయ్యే భయం కంటే, ఇలాంటి సమస్యల గురించి మాట్లాడుతున్న ఒక సినిమాలో భాగమవ్వడం నాకు చాలా ఉపశమనాన్ని ఇచ్చింది" అని కని కుస్రుతి వివరించారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

దీనికి తోడు నసీరుద్దీన్ షా, దివ్య దత్తా అతిథి పాత్రల్లో ఈ చిత్రంలో మెరవనున్నారు. గౌరవ్ సోలంకి ఈ చిత్రానికి కథను అందించగా, టీ-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మించారు. అస్సీ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe