...
...
Next Story

Top OTT Releases: ఈ వారం ఓటీటీలో రచ్చ చేస్తున్న 6 క్రేజీ మలయాళ, తమిళ సినిమాలు.. మస్ట్ వాచ్.. ఎక్కడ చూడొచ్చంటే?

Top OTT Releases: ఓటీటీలో కంటెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేసే మలయాళ, తమిళ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఈ వారం ఏకంగా ఆరు డిఫరెంట్ జానర్లకు చెందిన తమిళ, మలయాళ సినిమాలు, సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో రచ్చ చేస్తున్నాయి. ఈ సినిమాలపై ఓ లుక్కేయండి.

Published on: Nov 8, 2026, 14:30:55 IST
Advertisement

Top OTT Releases: ఓటీటీలో మలయాళం, తమిళ్ కంటెంట్ ను తెలుగు ఆడియన్స్ ఆదరిస్తూనే ఉంటారు. ఈ వారం కూడా కోలీవుడ్, మాలీవుడ్ నుంచి డిఫరెంట్ సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వీటిల్లో ఈ వారం స్ట్రీమింగ్ లో రచ్చ చేస్తున్న టాప్ 6 రిలీజ్ లు ఇవే.

నూరు కోడి వానవిల్ (Nooru Kodi Vaanavil)

ఈ వారం ఓటీటీలో రచ్చ చేస్తున్న 6 క్రేజీ మలయాళ, తమిళ సినిమాలు.. మస్ట్ వాచ్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఈ వారం ఓటీటీలో రచ్చ చేస్తున్న 6 క్రేజీ మలయాళ, తమిళ సినిమాలు.. మస్ట్ వాచ్.. ఎక్కడ చూడొచ్చంటే?

ఎక్కడ చూడొచ్చు: ZEE5

స్ట్రీమింగ్ తేదీ: నవంబర్ 6, 2026

హరీష్ కళ్యాణ్, సిద్ధి ఇదాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ డ్రామాకు శశి దర్శకత్వం వహించారు. వినో అనే టెలివిజన్ బ్రాడ్ కాస్టర్ తన షో కోసం కొత్త ముఖాన్ని వెతుక్కుంటూ గోవా వెళ్తాడు. అక్కడ స్వేచ్ఛగా జీవించే ఫెన్నీని కలుస్తాడు. వీరి ప్రొఫెషనల్ రిలేషన్ కాస్తా ప్రేమగా ఎలా మారింది? వారి విభిన్న మనస్తత్వాలు ఈ ప్రేమకథను ఎలా మలుపు తిప్పాయి అన్నదే ఈ సినిమా కథ.

ఐసీయూ (ICU)

ఎక్కడ చూడొచ్చు: Sun NXT

స్ట్రీమింగ్ తేదీ: నవంబర్ 6, 2026

బిబిన్ జార్జ్, బాబురాజ్, మీరా వాసుదేవన్ నటించిన ఈ థ్రిల్లర్ డ్రామాకు జార్జ్ వర్గీస్ దర్శకుడు. ఒక దారుణమైన సంఘటన, ఊహించని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా బద్ధ శత్రువులు, మాజీ ప్రేమికులు ఒక ఆసుపత్రిలోని ఐసీయూలో కలుసుకుంటారు. అక్కడ వారి మధ్య దాగిన రహస్యాలు, నిజాలు ఒక్కొక్కటిగా ఎలా బయటకు వచ్చాయన్నది ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. ఓటీటీలో ఇది అదరగొడుతోంది.

మీసయ మురుక్కు 2 (Meesaya Murukku 2)

స్ట్రీమింగ్ తేదీ: నవంబర్ 6, 2026

హిప్ హాప్ తమిజా ఆది, కేతికా శర్మ జంటగా నటించిన మ్యూజికల్ కామెడీ డ్రామా ఇది. ఆది స్వయంగా దర్శకత్వం వహించారు. నార్త్ చెన్నైకి చెందిన ఒక కుటుంబం మూడు తరాలుగా గాన (Gaana) మ్యూజిక్ ను గ్లోబల్ రేంజ్ కు తీసుకెళ్లాలని పడే ఆరాటం ఈ సినిమా కథ. ఎన్నో కష్టాలు దాటి తమ మ్యూజికల్ కలను ఎలా నిజం చేసుకున్నారన్నది ఇందులో ఎమోషనల్ గా చూపించారు.

ది గ్రాండ్ మాస్టర్ (The Grand Master)

ఎక్కడ చూడొచ్చు: Sun NXT

స్ట్రీమింగ్ తేదీ: నవంబర్ 6, 2026

అబర్నతి, లింగేష్ ప్రధాన పాత్రల్లో వెట్రి చెళియన్ తెరకెక్కించిన డ్రామా చిత్రం ఇది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చిన 10 ఏళ్ల బాలుడు నందన్.. చెస్ ఛాంపియన్ కావాలని కలలు కంటాడు. పేదరికాన్ని, అవమానాలను ఎదిరించి తల్లి అండతో తన కలను ఎలా సాకారం చేసుకున్నాడు అనేది ఈ క్యూట్ అండ్ ఎమోషనల్ మూవీలో చూడొచ్చు.

7 స్టార్ బాయ్స్ (7 Star Boys)

ఎక్కడ చూడొచ్చు: Aha Video

స్ట్రీమింగ్ తేదీ: నవంబర్ 6, 2026

ఆంటోనీ వర్గీస్ పెపే, బాలు వర్గీస్ నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామాకు నిఖిల్ ప్రేమ్ రాజ్ దర్శకుడు. కేరళలోని ఒక గ్రామానికి చెందిన ఏడుగురు కుర్రాళ్లు ఫుట్‌బాల్ క్రీడలో రాణించాలని కలలు కంటారు. ఒక పాడుబడ్డ మైదానాన్ని ప్రాక్టీస్ గ్రౌండ్ గా మార్చుకుని, పెద్ద టోర్నమెంట్ కు ఎలా సిద్ధమయ్యారు అన్నదే ఈ సినిమా కాన్సెప్ట్.

ఐ యామ్ గేమ్ (I’m Game)

ఎక్కడ చూడొచ్చు: JioHotstar

స్ట్రీమింగ్ తేదీ: నవంబర్ 6, 2026

దుల్కర్ సల్మాన్, ఆంటోనీ వర్గీస్ పెపే, మిస్కిన్ తదితరులు నటించిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ 'ఐ యామ్ గేమ్'. నహాస్ హిదాయత్ ఈ చిత్రానికి దర్శకుడు. డాన్ అనే యువకుడికి హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ జరుగుతుంది. ఆ చేతికి ఒక మరణించిన క్రికెటర్ స్పృహ తోడవుతుంది. ఆ తర్వాత డాన్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఆ క్రికెట్ నెట్ వర్క్ లోని చీకటి కోణాలను ఎలా ఎదుర్కొన్నాడు అనేది యాక్షన్ ప్యాక్డ్ గా చూపించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks