ఓటీటీలో మలయాళం సినిమాలకు ఉండే క్రేజే వేరు. తెలుగు ఆడియన్స్ కూడా ఈ మూవీస్ ను బాగా ఆదరిస్తారు. ఇక అందులోనూ మలయాళం థ్రిల్లర్లు అంటే పడిపడి చూస్తారు. ఈ రోజు (మార్చి 27) అలాంటి రెండు మలయాళం థ్రిల్లర్లు ఓటీటీలోకి వచ్చాయి. ఇందులో ఒకటి క్రైమ్ థ్రిల్లర్ కాగా, మరొకటి సైన్స్ ఫిక్షన్ మూవీ.
వలతు వశతే కల్లన్

జీతూ జోసెఫ్.. ఈ మలయాళ డైరెక్టర్ పేరు తెలియని మూవీ లవర్ ఉండడనే చెప్పొచ్చు. దృశ్యం లాంటి థ్రిల్లర్ ను అందించింది అతనే. ఇప్పుడీ డైరెక్టర్ తెరకెక్కించిన లేటెస్ట్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘వలతు వశతే కల్లన్’ ఓటీటీలోకి వచ్చేసింది.
మూడు ఓటీటీల్లో
‘వలతు వశతే కల్లన్’ మూవీ ఏకంగా మూడు ఓటీటీల్లో అడుగుపెట్టింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమా మ్యాక్స్, సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఈ మూవీ రిలీజైంది. ఇందులో బిజు మీనన్, జోజు జార్జ్ ప్రధాన పాత్రలు పోషించారు.
వలతు వశతే కల్లన్ స్టోరీ
జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ‘వలతు వశతే కల్లన్’ జనవరి 30, 2026న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇన్ స్పెక్టర్ ఆంటోనీ జేవియర్ (బిజు మీనన్) ఇరీన్ అనే అమ్మాయి మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఇరీన్ తండ్రి సామ్ (జోజు జార్జ్) జేవియర్ కొడుకు ఫిలిప్ ను కిడ్నాప్ చేస్తాడు.
ఇరీన్ ను హత్య చేశానని ఒప్పుకోవాలని జేవియర్ ను సామ్ డిమాండ్ చేస్తాడు. మరి ఈ హత్య ఎవరు చేశారు? ఫిలిప్ ను సామ్ విడిచి పెట్టాడా? లేదా అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
మస్తిష్క మరణం
{{/usCountry}}ఇరీన్ ను హత్య చేశానని ఒప్పుకోవాలని జేవియర్ ను సామ్ డిమాండ్ చేస్తాడు. మరి ఈ హత్య ఎవరు చేశారు? ఫిలిప్ ను సామ్ విడిచి పెట్టాడా? లేదా అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
మస్తిష్క మరణం
{{/usCountry}}ఇవాళ ఓటీటీలోకి వచ్చిన మరో క్రేజీ మలయాళం సినిమా ‘మస్తిష్క మరణం’. వర్చువల్ రియాలిటీకి, రియాలిటీకి తేడా ఏదో తెలియకుండా కన్ఫ్యూజ్ చేసే సినిమా ఇది. ఈ చిత్రం పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ
మస్తిష్క మరణం సినిమాలో రజిష విజయన్, నిరంజ్, దివ్య, శాంతి తదితరులు నటించారు. ఈ మూవీకి క్రిషంద్ డైరెక్టర్. ఈ కథ రెండు భాగాలుగా సాగుతుంది. ఒక ఫీమేల్ సెలబ్రిటీ పెద్ద స్కాండల్ లో చిక్కుకుంటుంది. ఆమెపై మీడియాలో రకరకాల కథనాలు వస్తాయి.
మరోవైపు కోల్పోయిన తన బిడ్డను వర్చువల్ రియాలిటీ ద్వారా కలవాలని ఓ తండ్రి ఆశపడుతుంటాడు. అసలు ఏది నిజం? ఏది వర్చువల్ రియాలిటీ? అనేది కూడా తేల్చుకోలేని స్థితికి వెళ్లిపోతాడు. మరి చివరకు ఏం జరిగిందో తెలియాలంటే మస్తిష్క మరణం చూడాల్సిందే.