...
...
Next Story

Mamitha Baiju: తెలుగులో అడుగుపెడుతున్న మమితా బైజు .. జై హనుమాన్ మూవీలో సెన్సేషనల్ బ్యూటీ.. ప్రశాంత్ వర్మ ప్లాన్!

Mamitha Baiju: ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ హీరోయిన్ మమితా బైజు క్రేజ్ మామూలుగా లేదు. తమిళ, మలయాళం సినిమాలతో ఆమె వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంది. ఓటీటీలోనూ ట్రెండింగ్ లో దుమ్మురేపుతోంది. ఈ భామ ఇప్పుడు తెలుగు సినిమాలో అడుగుపెడుతుందని తెలిసింది.

Published on: Oct 11, 2026, 14:39:23 IST
Advertisement

Mamitha Baiju: ఇటీవల వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్', 'బెత్లెహెం కుటుంబ యూనిట్' లాంటి వరుస బాక్సాఫీస్ హిట్లతో దూసుకుపోతోంది యంగ్ అండ్ టాలెంటెడ్ నటి మమితా బైజు (Mamitha Baiju). ఈ సెన్సేషనల్ బ్యూటీ ఎట్టకేలకు టాలీవుడ్ లో అడుగుపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) లో భాగమైన మోస్ట్ అవైటెడ్ సూపర్ హీరో ప్రాజెక్ట్ 'జై హనుమాన్' (Jai Hanuman) లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

మమితా క్రేజ్

తెలుగులో అడుగుపెడుతున్న మమితా బైజు .. జై హనుమాన్ మూవీలో సెన్సేషనల్ బ్యూటీ.. ప్రశాంత్ వర్మ ప్లాన్!
తెలుగులో అడుగుపెడుతున్న మమితా బైజు .. జై హనుమాన్ మూవీలో సెన్సేషనల్ బ్యూటీ.. ప్రశాంత్ వర్మ ప్లాన్!

'ప్రేమలు' (Premalu) చిత్రంతో సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న మమితా బైజు క్రేజ్ మామూలుగా లేదు. ‘మాతా పితా మమితా’ అంటూ నెట్టింట ఆమె ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. ‘జన నాయగన్’, 'విశ్వనాథ్ అండ్ సన్స్', 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' వంటి చిత్రాల విజయాలతో మమితా బైజు క్రేజ్ పెరిగింది. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసే మమితా.. ప్రస్తుతం సౌత్ ఇండియాలో బిజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా మారింది.

తెలుగు డెబ్యూ

తెలుగులో గతంలో డబ్బింగ్ సినిమాల ద్వారా సందడి చేసిన ఈ మలయాళ కుట్టి మమితా బైజు ఇప్పుడు 'జై హనుమాన్' మూవీతో డైరెక్ట్ గా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుందని తెలిసింది. 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న ‘జై హనుమాన్’ మూవీ తాజా షెడ్యూల్‌లో మమితా బైజు ఇప్పటికే జాయిన్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

అధికారికంగా మేకర్స్ లేదా మమితా బైజు దీనిపై స్పందించనప్పటికీ, సోషల్ మీడియాలో ఈ లీక్ కాస్తా వైరల్‌గా మారింది. ఆమె పాత్రకు సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్రబృందం త్వరలోనే ప్రత్యేక పోస్టర్ ద్వారా విడుదల చేసే అవకాశం ఉంది.

ప్రశాంత్ వర్మ ప్లాన్

ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU) ను గ్లోబల్ స్థాయిలో విస్తరించే క్రమంలో అవలంబిస్తున్న ‘క్రాస్-ఇండస్ట్రీ కాస్టింగ్ వ్యూహం’ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మొదటి భాగం 'హను-మాన్' లో తేజ సజ్జాతో ప్రాంతీయంగా పెద్ద విజయాన్ని అందుకున్న ప్రశాంత్, సీక్వెల్ 'జై హనుమాన్' కోసం కన్నడ స్టార్ రిషబ్ శెట్టిని హీరోగా తీసుకున్నారు. ఇప్పుడు క్రేజ్ ఉన్న మమితాను ఎంచుకున్నారు.

మలయాళ భామలు

సాయి పల్లవి, నజ్రియా, సంయుక్త మీనన్, మాళవికా మోహనన్ సరసన ఇప్పుడు మమితా బైజు కూడా చేరబోతుంది. తెలుగు సినిమాలో యాక్ట్ చేయడంతో ఇక్కడి ఆడియన్స్ కు ఆమె మరింత చేరువయ్యే అవకాశముంది. 'ప్రేమలు' తర్వాత సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న మమితా తెలుగు ఆడియన్స్ కు ఇప్పటికే కనెక్ట్ అయిందని చెప్పొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks