...
...
Next Story

Mamitha Baiju: తమిళ సినిమాల్లో మలయాళ, కన్నడ హీరోయిన్ల వివాదం- మమితా బైజు రియాక్షన్ ఇదే- కరలో ధనుష్‌పై ప్రశంసలు!

Mamitha Baiju On Malayalam Kannada Actress In Kollywood: తమిళ స్టార్ హీరో ధనుష్ సరసన 'కర' చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు, స్థానిక నటీమణుల వివాదంపై నోరు విప్పారు. తన కాస్టింగ్ పట్ల వస్తున్న విమర్శలకు ఆమె తనదైన శైలిలో సమాధానమిచ్చారు. మమిత కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Apr 25, 2026, 17:02:09 IST
Advertisement

Mamitha Baiju On Malayalam Kannada Actress In Tamil: గత కొన్నాళ్లుగా తమిళ చిత్ర పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. హీరోయిన్ల విషయంలో స్థానిక నటీమణులకే ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు తమిళ ప్రేక్షకులు. హీరోయిన్స్ విషయంలో మాత్రం ఇతర భాషల (ముఖ్యంగా మలయాళ, కన్నడ) భామలను తీసుకోవడాన్ని ప్రశ్నిస్తున్నారు తమిళులు.

ధనుష్ పక్కన హీరోయిన్‌గా

తమిళ సినిమాల్లో మలయాళ, కన్నడ హీరోయిన్ల వివాదం- మమితా బైజు రియాక్షన్ ఇదే- కరలో ధనుష్‌పై ప్రశంసలు!
తమిళ సినిమాల్లో మలయాళ, కన్నడ హీరోయిన్ల వివాదం- మమితా బైజు రియాక్షన్ ఇదే- కరలో ధనుష్‌పై ప్రశంసలు!

'కర' చిత్రంలో మలయాళ బ్యూటీ మమితా బైజును ధనుష్ పక్కన హీరోయిన్‌గా ఎంపిక చేయడంపై దర్శకుడు విగ్నేష్ రాజా ఇప్పటికే విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆమెను 'బ్రౌన్‌ ఫేసింగ్‌' (మేకప్ ద్వారా చర్మం రంగు మార్చడం) చేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ వివాదంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించిన ప్రేమలు హీరోయిన్ మమితా బైజు, తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

ఇది అన్యాయం కాదు.. ఒక అవకాశం!

"తమిళ సినిమాల్లో పరభాషా నటీమణులను తీసుకోవడం అన్యాయమని నేను అనుకోవడం లేదు. ఒక నటిగా నాకు వచ్చిన అవకాశాన్ని నేను అందిపుచ్చుకున్నాను. వైవిధ్యమైన పాత్రలు చేయాలన్నదే నా తపన. ఒక దర్శకుడు నాలో ఆ పాత్రకు కావాల్సిన లక్షణాలు చూసినప్పుడు, నేను వద్దని ఎలా చెప్పగలను? నా పని ద్వారా, నా నటన ద్వారా ఆ స్థానాన్ని సంపాదించుకోవాలని నేను కోరుకుంటున్నాను" అని మమిత బైజు స్పష్టం చేశారు.

గ్రామీణ యువతి పాత్రలో

కేవలం భాషా పరమైన హద్దులకే పరిమితం కాకుండా, ఒక గ్రామీణ యువతి పాత్రలో తాను ఎంతవరకు మెప్పించగలననేదే తనకు ముఖ్యమని మమితా బైజు చెప్పుకొచ్చారు. "ఒక రూరల్ క్యారెక్టర్‌లో నేను నటిస్తున్నప్పుడు, ఆ పాత్రకు నేను న్యాయం చేశానని ప్రేక్షకులు గుర్తిస్తే అదే నాకు అతిపెద్ద అవార్డు. నా వృత్తిలో భాగంగా కొత్త సవాళ్లను స్వీకరించడం నా బాధ్యత" అని మమిత పేర్కొన్నారు.

ధనుష్ కష్టాన్ని చూసి ఆశ్చర్యపోయా!

విగ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన కర చిత్రంలో జయరామ్, కరుణాస్, లాల్, సూరజ్ వెంజారమూడు వంటి భారీ తారాగణం ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాను వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది. తేని ఈశ్వర్ కెమెరా పనితనం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది. ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కానున్న కర సినిమాతో మమితా బైజు కోలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe