...
...
Next Story

OTT: అఫీషియ‌ల్‌.. ఓటీటీలో డబుల్ ట్రీట్.. ఒకే రోజు మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు, అన‌గ‌న‌గా ఒక రాజు..స్ట్రీమింగ్ ఎక్క‌డంటే?

సంక్రాంతి 2026కు థియేటర్లలో ఆడియన్స్ కు ఎంటర్ టైన్మెంట్ అందించిన రెండు సినిమాలు ఒకే రోజు ఓటీటీలోకి రాబోతున్నాయి. మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు చిత్రాలు ఒకే రోజు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి.

Published on: Feb 8, 2026, 15:36:25 IST
Advertisement

ఓటీటీ లవర్స్ కు డబుల్ ట్రీట్. సంక్రాంతి 2026కు థియేటర్లలో అదరగొట్టిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు ఒకే రోజు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇందులో ఒకటేమో మెగాస్టార్ చిరంజీవి నటించిన రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ మన శంకర వరప్రసాద్ గారు కాగా, మరొకటేమో నవీన్ పొలిశెట్టి మూవీ అనగనగా ఒక రాజు.

ఒకే రోజు రెండు

ఓటీటీలోకి సంక్రాంతి సినిమాలు (x/netflix, zee5telugu)
ఓటీటీలోకి సంక్రాంతి సినిమాలు (x/netflix, zee5telugu)

ఇవాళ (ఫిబ్రవరి 8) అనగనగా ఒక రాజు ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ గా అప్ డేట్ వచ్చింది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఫిబ్రవరి 11న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆదివారం ప్రకటించింది. అంతకంటే ముందే చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇది జీ5 ఓటీటీలోకి రానుంది.

అనగనగా ఒక రాజు ఓటీటీ

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అనగనగా ఒక రాజు. ఇది ఫిబ్రవరి 11న ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో అనగనగా ఒక రాజు స్ట్రీమింగ్ కానుంది. నవీన్ పొలిశెట్టి కెరీర్ లోనే ఫస్ట్ రూ.100 కోట్లు వసూలు చేసిన మూవీ ఇది.

మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ

సంక్రాంతి 2026 సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. మన శంకర వరప్రసాద్ గారు సినిమా జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. దీనికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.

అనగనగా ఒక రాజు మూవీ జనవరి 14న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి మారి డైరెక్టర్. సంక్రాంతికి రిలీజైన ఇతర చిత్రాలు.. వా వాతియార్, నారీ నారీ నడుమ మురారి, పరాశక్తి, ది రాజాసాబ్ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు ఒకే రోజు అనగనగా ఒక రాజు, మన శంకర వరప్రసాద్ గారు రాబోతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe