చిరు మేనియాతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. మెగాస్టార్ క్రేజ్ తో బాక్సాఫీస్ షేక్ అవుతోంది. చిరంజీవి సంక్రాంతి 2026 సినిమా మన శంకర వర ప్రసాద్ గారు కలెక్షన్ల జోరు కొనసాగిస్తోంది. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం 10 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూసేద్దాం.
మన శంకర వర ప్రసాద్ గారు కలెక్షన్లు

బాక్సాఫీస్ దగ్గర మన శంకర వర ప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ రన్ కొనసాగుతోంది. సంక్రాంతి సెలవులు ముగియడం, వీక్ డేస్ కావడంతో కాస్త జోరు తగ్గినా ఈ మూవీ నిలకడ ప్రదర్శిస్తోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా పదో రోజు (జనవరి 21) ఇండియాలో రూ.4 కోట్ల నెట్ వసూళ్లు దక్కించుకుంది. బుధవారం రూ.4 కోట్ల కలెక్షన్లను ఖాతాలో వేసుకుంది.
10 రోజుల రిపోర్టు
రికార్డులు బద్దలు కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం ఇండియాలో మంచిగా ఆడుతోంది. సక్నిల్క్ ప్రకారం చిరంజీవి, నయనతార జంటగా నటించిన ఈ మూవీ 10 రోజుల్లో ఇండియాలో రూ.175.65 కోట్ల నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. చిరంజీవి కెరీర్ లో ఇదే హైయ్యస్ట్.
అదే జోరు
మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం ప్రీమియర్ల నుండి రూ.9.35 కోట్లు సంపాదించింది. ఈ చిత్రం మొదటి రోజు రూ.32.25 కోట్లు, రెండవ రోజు రూ.18.75 కోట్లు, మూడో రోజు రూ.19.5 కోట్లు, నాలుగో రోజు రూ.22 కోట్లు, అయిదో రోజు రూ.19.5 కోట్లు సంపాదించింది. 6వ రోజు రూ.18.9 కోట్లు, 7వ రోజు రూ.17.65 కోట్లు, 8 వ రోజు రూ.8 కోట్లు, 9వ రోజు రూ.5.75 కోట్లు ఖాతాలో వేసుకుంది.
హైయ్యస్ట్ కలెక్షన్లు
చిరంజీవి కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా మన శంకర వర ప్రసాద్ గారు రికార్డు నెలకొల్పింది. చిరంజీవి గత చిత్రాల జీవిత కలెక్షన్లను ఈ సినిమా అధిగమించింది. భోళా శంకర్ భారతదేశంలో రూ.30.63 కోట్లు, ఆచార్య రూ.56.14 కోట్లు, గాడ్ ఫాదర్ రూ.74.03 కోట్లు, వాల్తేర్ వీరయ్య రూ.161.06 కోట్లు కొల్లగొట్టాయి. మన శంకర వర ప్రసాద్ గారు మూవీ సంక్రాంతి 2026 సందర్భంగా జనవరి 12న రిలీజైంది.
{{/usCountry}}చిరంజీవి కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా మన శంకర వర ప్రసాద్ గారు రికార్డు నెలకొల్పింది. చిరంజీవి గత చిత్రాల జీవిత కలెక్షన్లను ఈ సినిమా అధిగమించింది. భోళా శంకర్ భారతదేశంలో రూ.30.63 కోట్లు, ఆచార్య రూ.56.14 కోట్లు, గాడ్ ఫాదర్ రూ.74.03 కోట్లు, వాల్తేర్ వీరయ్య రూ.161.06 కోట్లు కొల్లగొట్టాయి. మన శంకర వర ప్రసాద్ గారు మూవీ సంక్రాంతి 2026 సందర్భంగా జనవరి 12న రిలీజైంది.
{{/usCountry}}అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి, నయనతార, వెంకటేష్, కేథరిన్ తదితరులు నటించారు. ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు.