...
...
Next Story

ఓవ‌ర్సీస్‌లోనూ మ‌న శంక‌ర వ‌రప్ర‌సాద్ గారు క‌లెక్ష‌న్ల మోత‌- చిరంజీవి మూవీ అదుర్స్‌- అనిల్ రావిపూడి కొత్త రికార్డు

మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో చిరంజీవి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. ఓవర్సీస్ లోనూ ఈ మూవీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. తన కెరీర్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ గారు మూవీతో కొత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.

Published on: Jan 29, 2026, 11:10:11 IST
Advertisement

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా కలెక్షన్లతో బాక్సాఫీస్ బాస్ గా నిలుస్తున్నారు. సంక్రాంతి 2026 సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఓవర్సీస్ లోనూ అదరగొడుతోంది. తాజాగా ఈ సినిమా విదేశాల్లో 4.5 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ సాధించిందని మేకర్స్ ప్రకటించారు.

మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్లు

మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి (x/GoldBoxEnt)
మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి (x/GoldBoxEnt)

చిరంజీవి, నయనతార జంటగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. సంక్రాంతి 2026 సందర్భంగా ఈ మూవీ జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మూవీ గ్రాస్ వసూళ్లు రూ.350 కోట్లు దాటాయి.

ఓవర్సీస్ వసూళ్లు

విదేశాల్లో కూడా మన శంకర వరప్రసాద్ గారు మూవీ అదరగొడుతోంది. ఈ సినిమా విదేశాల్లో 4.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.41 కోట్లు)కు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘‘మన శంకర వరప్రసాద్ గారు ఓవర్సీస్ కలెక్షన్లు 4.5 మిలియన్ డాలర్లు దాటాయి. ఆల్ టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కోసం టికెట్లు బుక్ చేసుకోండి’’ అని గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ ట్వీట్ చేసింది.

అనిల్ రావిపూడి రికార్డు

ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా మన శంకర వరప్రసాద్ గారు మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇందులో చిరంజీవి, నయనతార, వెంకటేశ్, కేథరీన్ తదితరులు నటించారు. ఈ మూవీ జనవరి 12న రిలీజైంది. బ్లాక్ బస్టర్ టాక్ తో మన శంకర వరప్రసాద్ గారు దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు.

మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నటించారు. ఓ కేంద్ర మంత్రి రక్షణ బాధ్యతలను ఆయన చూసుకుంటారు. అయితే తన భార్య, పిల్లలకు అతను దూరమవుతాడు. తిరిగి వాళ్లను చేరుకోవాలని ప్రయత్నిస్తాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks