...
...
Next Story

ఓటీటీలో రికార్డులు తిరగ రాస్తున్న మన శంకరవరప్రసాద్ గారు.. ఆర్ఆర్ఆర్, బాహుబలి రికార్డు బ్రేక్.. తొలి వారం రికార్డు వ్యూస్

మన శంకరవరప్రసాద్ గారు జోరు ఓటీటీలోనూ ఓ రేంజ్ లో కొనసాగుతోంది. ఈ సినిమా ఏకంగా ఆర్ఆర్ఆర్, బాహుబలిలాంటి సినిమాల రికార్డులనే తిరగ రాయడం విశేషం. జీ5లో తొలివారం ఎక్కువ మంది చూసిన తెలుగు మూవీగా నిలిచింది.

Published on: Feb 17, 2026, 21:38:37 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' (MSG) సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, ఇప్పుడు ఓటీటీలోనూ సునామీ సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జీ5 (ZEE5)లో విడుదలైన మొదటి వారంలోనే రికార్డు స్థాయి వ్యూస్ సాధించింది. కలెక్షన్స్, స్ట్రీమింగ్ రికార్డుల వివరాలు ఇక్కడ చూడండి.

ఓటీటీలోనూ రికార్డుల వేట..

ఓటీటీలో రికార్డులు తిరగ రాస్తున్న మన శంకరవరప్రసాద్ గారు.. ఆర్ఆర్ఆర్, బాహుబలి రికార్డు బ్రేక్.. తొలి వారం రికార్డు వ్యూస్
ఓటీటీలో రికార్డులు తిరగ రాస్తున్న మన శంకరవరప్రసాద్ గారు.. ఆర్ఆర్ఆర్, బాహుబలి రికార్డు బ్రేక్.. తొలి వారం రికార్డు వ్యూస్

మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో మరోసారి నిరూపితమైంది. అతడు నటించిన తాజా సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు' అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో రికార్డుల వేట కొనసాగిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా అదే జోరు కొనసాగిస్తోంది.

ఫిబ్రవరి 11న జీ5లో విడుదలైన ఈ సినిమా.. కేవలం వారం రోజుల్లోనే 300 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్కును దాటేందుకు సిద్ధంగా ఉంది. జీ5లో విడుదలైన మొదటి వారంలో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు సినిమాగా ఇది చరిత్ర సృష్టించిందని సమాచారం. ఈ క్రమంలోనే గతంలో 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి: ది కంక్లూజన్' పేరిట ఉన్న ఫస్ట్ వీక్ వ్యూస్ రికార్డులను కూడా ఈ సినిమా బద్దలు కొట్టినట్లు ఓటీటీప్లే రిపోర్టు తెలిపింది.

బాక్సాఫీస్ కలెక్షన్స్.. రూ. 380 కోట్లు

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో ఈ సినిమా ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 380 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఒక్క అమెరికాలోనే దాదాపు 5 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది.

ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తన భార్య ప్రేమను మళ్ళీ ఎలా గెలుచుకున్నాడనేదే ఈ సినిమా కథ. క్లీన్ ఫ్యామిలీ కంటెంట్ కావడంతో కుటుంబ ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్లలో చూడలేకపోయిన వారు ఇప్పుడు జీ5 ఓటీటీలో మూవీని చూడొచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks