...
...
Next Story

OTT Today: ఓటీటీలో మెగా బ్లాక్ బస్టర్.. ఇవాళ స్ట్రీమింగ్ కు వచ్చేసిన మన శంకర వరప్రసాద్ గారు.. ఏకంగా 7 భాషల్లో

ఓటీటీ లవర్స్ అత్యంత ఆత్రుతగా ఎదురు చూసిన రోజు వచ్చేసింది. సంక్రాంతి 2026 విన్నర్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ రోజు నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. మెగాస్టార్ బాక్సాఫీస్ ఊచకోతకు నిదర్శనం ఈ మూవీ.

Published on: Feb 11, 2026, 05:39:54 IST
Advertisement

చాలా ఏళ్ల తర్వాత మెగా ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు. వింటేజీ లుక్, యాక్టింగ్ తో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో అదరగొట్టారు. దీంతో కుటుంబాలకు కుటుంబాలు థియేటర్లకు వరుస కట్టాయి. ఇప్పుడు ఆ ఫ్యామిలీలు ఇంట్లోనే కూర్చుని మన శంకర వరప్రసాద్ గారు సినిమాను చూసే రోజు వచ్చేసింది. ఇవాళ (ఫిబ్రవరి 11) మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్ అయింది.

మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ

మన శంకర వరప్రసాద్ గారు మూవీ పోస్టర్ లో చిరంజీవి (X/KChiruTweets)
మన శంకర వరప్రసాద్ గారు మూవీ పోస్టర్ లో చిరంజీవి (X/KChiruTweets)

రీసెంట్ టైమ్స్ లో ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూసిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు. చిరంజీవి హీరోగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ బాక్సాఫీస్ మోత మోగించింది. ఇప్పుడు ఓటీటీని షేక్ చేసేందుకు బుధవారం స్ట్రీమింగ్ కు వచ్చేసింది. జీ5 ఓటీటీలో మన శంకర వరప్రసాద్ గారు రిలీజైంది.

ఏడు భాషల్లో

మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఓటీటీలోకి ఏకంగా ఏడు భాషల్లో రిలీజైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో తెలుగులో మాత్రమే విడుదలైన ఈ సినిమా రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు.

సంక్రాంతి విన్నర్

సంక్రాంతి 2026కు తెలుగులో అయిదు సినిమాలు థియేటర్లలో రిలీజైంది. ఇందులో మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. జనవరి 12న రిలీజైన ఈ మూవీ రూ.380 కోట్ల కలెక్షన్లతో సంక్రాంతి రేసులో దూసుకెళ్లింది. ఈ మూవీలో చిరంజీవి, నయనతార, వెంకటేష్ తదితరులు నటించారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు.

మన శంకర వరప్రసాద్ గారు స్టోరీ

కట్ చేస్తే కేంద్రమంత్రి శర్మ (శరత్ సక్సేనా) సెక్యూరిటీని వరప్రసాద్ చూసుకుంటాడు. శర్మకు వరప్రసాద్ చాలా క్లోజ్ అవుతాడు. ఈ క్రమంలోనే విడిపోయిన భార్య, పిల్లలకు వరప్రసాద్ ను దగ్గర చేయాలని శర్మ అనుకుంటాడు.

ఈ క్రమంలో తన పిల్లలు చదువుతున్న స్కూల్లో పీఈటీగా వెళ్తాడు వరప్రసాద్. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలు శశిరేఖ, వరప్రసాద్ ఎందుకు విడిపోయారు? ఇందులో వెంకీ గౌడ (వెంకటేశ్) పాత్రకు ఉన్న సంబంధం ఏమిటన్నదే మన శంకర వరప్రసాద్ గారు మూవీ స్టోరీ.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe