...
...
Next Story

Manchu Lakshmi: ప్రభుత్వ పాఠశాలల కోసం మంచు లక్ష్మీ టీచ్ ఫర్ చేంజ్- ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య - 3 లక్షల మందికిపైగా!

Manchu Lakshmi Teach For Change Annual Fundraiser 2026: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు నటి మంచు లక్ష్మీ నిర్వహించిన టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ హీరో హీరోయిన్లు ర్యాంప్ వాక్ చేసి పాల్గొన్నారు. ఈవెంట్ పూర్తి వివరాల్లోకి వెళితే..!

Published on: Mar 28, 2026, 19:26:28 IST
Advertisement

ప్రీమియర్ ఎనర్జీస్ సమర్పణలో, నటి, సామాజిక సేవకురాలు మంచు లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన టీచ్ ఫర్ ఛేంజ్ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం 2026 హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం, కార్పొరేట్, విద్యా రంగం, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై, ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న పిల్లల నాణ్యమైన విద్యకు మద్దతు తెలిపారు.

స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తుల మధ్య

ప్రభుత్వ పాఠశాలల కోసం మంచు లక్ష్మీ టీచ్ ఫర్ చేంజ్- ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య - 3 లక్షల మందికిపైగా!
ప్రభుత్వ పాఠశాలల కోసం మంచు లక్ష్మీ టీచ్ ఫర్ చేంజ్- ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య - 3 లక్షల మందికిపైగా!

ఈ వార్షిక కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, వెనుకబడిన వర్గాల పిల్లల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం వంటి ప్రాముఖ్యతను ప్రస్తావించారు. ప్రతి చిన్నారికి వారి సామాజిక-ఆర్థిక పరిస్థితులు ఏవైనా సరే, నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం, కార్పొరేట్లు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తుల మధ్య భాగస్వామ్యం అవసరమని ఈ వేదిక నొక్కి చెప్పింది.

ఈ వేడుకలో భాగంగా భారత సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు విద్యా సేవకు మద్దతుగా ర్యాంప్ వాక్ చేశారు. ప్రముఖ డిజైనర్ రామ్‌జ్ రూపొందించిన ప్రత్యేక కలెక్షన్స్‌తో పాటు సాఖీ హెరిటేజ్ దుస్తులు, రోజ్ జ్యువెలరీ ఆభరణాలను ప్రదర్శించారు. ఈ ఫ్యాషన్ ప్రదర్శన సినిమా, ఫ్యాషన్, సేవ భావనల సమ్మేళనంగా నిలిచింది.

లక్ష్మీ మంచుతో పాటు హీరోయిన్లు

ఈ కార్యక్రమంలో లక్ష్మీ మంచుతో పాటు హీరోయిన్లు సీరత్ కపూర్, అక్షర గౌడ, పాయల్ రాజ్‌పుత్, హెబ్బా పటేల్, తేజస్వి మదివాడ, ఫరియా అబ్దుల్లా, మాన్విత కామత్, తేజు అశ్విని, రాశి సింగ్, శివాని నాగరం, దక్ష నగర్కర్, అభిజ్ఞ వుత్తలూరు, పావని, నందిత శ్వేత ర్యాంప్ వాక్ చేశారు.

అలాగే, హీరోలు ప్రియదర్శి, శివ కందుకూరి, రోషన్, అరవింద్ కృష్ణ, ప్రిన్స్, విరాజ్ అశ్విన్, సౌరభ్ ధింగ్రా, విశ్వంత్, ఆదిత్, రోషన్ కె, అర్జున్ జాండర్ లామా, నందు, నిఖిల్ విజయేంద్ర సింహ, ప్రియతమ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థను 2014లో మంచు లక్ష్మి స్థాపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూమ్స్, ఐసీటీ ఆధారిత అభ్యాసం, ఉపాధ్యాయుల శిక్షణ, వాలంటీర్ కార్యక్రమాలు, ప్రాథమిక చదువు-లెక్కల నైపుణ్యాల అభివృద్ధిపై ఈ సంస్థ పనిచేస్తోంది.

3 లక్షల మందికిపైగా

ఇప్పటి వరకు ఈ సంస్థ దేశవ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా విద్యార్థులపై ప్రభావం చూపింది. అలాగే, 1,549 ప్రభుత్వ పాఠశాలలకు మద్దతుగా నిలిచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ సంస్థ పలు కార్యక్రమాలు చేపడుతోంది.

టీచ్ ఫర్ ఛేంజ్ చైర్‌పర్సన్, మేనేజింగ్ ట్రస్టీ మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. "ప్రతి చిన్నారికి, వారి నేపథ్యం ఏదైనా సరే, నాణ్యమైన విద్య అందాలి అనే నమ్మకంతోనే టీచ్ ఫర్ ఛేంజ్ ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రధాన ఆధారం. వాటిని బలోపేతం చేయడం ద్వారా దీర్ఘకాలిక సామాజిక మార్పు సాధ్యమవుతుంది" అని అన్నారు.

ఇలా భాగస్వామ్యం కావాలంటూ

"ఈ నిధుల సేకరణ కార్యక్రమం కేవలం ఒక ఈవెంట్ మాత్రమే కాదు, భాగస్వాములు, దాతలు, వాలంటీర్లు కలిసి పిల్లల భవిష్యత్తును మార్చే ఉద్యమం. కలిసి మనం లక్షలాది పిల్లల భవిష్యత్తును వెలుగులోకి తీసుకురాగలం" అని మంచు లక్ష్మి తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలనుకునే వ్యక్తులు, సంస్థలు, వాలంటీర్లు www.teachforchange.in ద్వారా భాగస్వామ్యం కావాలని టీచ్ ఫర్ ఛేంజ్ ఆహ్వానించింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks