Manchu Manoj Adopted Five Children And Trust Launch: తన పుట్టినరోజు సందర్భంగా ‘రా కింగ్’ మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక భూమా మంచు కలిసి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో రక్తదాన శిబిరం, ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగానే తమ కొత్త సామాజిక సేవా సంస్థ “ఐక్య ధైర్య సేన సమితి”ను అధికారికంగా ప్రారంభించారు.
అతిథిగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్

“Unity, Courage, Service, Impact” అనే నినాదంతో ప్రారంభమైన ఈ సంస్థ ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, అభిమానులు, వాలంటీర్లు హాజరయ్యారు. ఈ వేడుకలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సభను ఉద్దేశించి మాట్లాడిన రా కింగ్ స్టార్ మంచు మనోజ్ భావోద్వేగంతో అందరికీ స్వాగతం పలుకుతూ, తాము చిన్నప్పటి నుంచి సేవాభావాన్ని కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకున్నామని తెలిపారు. ఈ సంస్థ ఆలోచన ఎలా వచ్చిందో వివరిస్తూ, సమాజానికి సేవ చేయాలనే ఆలోచన కలిగిన వారందరికీ ఒక వేదికను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ ట్రస్ట్‌ను ప్రారంభించామన్నారు.
పెద్దల నుంచి నేర్చుకున్న విలువలు
“అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. సమాజానికి అండగా నిలబడటం, సేవ చేయడం అనేది నేను, నా భార్య మౌనిక మా పెద్దల నుంచి నేర్చుకున్న విలువలు. ఇంతకుముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. కానీ, అదే ఆలోచన కలిగిన వారందరికీ ఒక వేదిక ఉండాలని భావించి ఈ సంస్థను ప్రారంభిస్తున్నాం. ఈ సంస్థ పేరును మా సోదరుడు, సన్నిహితుడు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రకటిస్తారు” అని మంచు మనోజ్ అన్నారు.
“అయితే ముందుగా ఈ ఆలోచనకు మూలమైన మౌనిక భూమా మంచు కొన్ని మాటలు మాట్లాడాలి. ఈ ఆలోచన నిజంగా ఆమె నుంచే వచ్చింది. రక్తదాన శిబిరంతో పాటు, ఈరోజు నుంచే ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని వారి విద్యకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది ఇక్కడితో ఆగదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామానికి ఈ సేవా కార్యక్రమాలను తీసుకెళ్తాం. ఈ సంస్థ ద్వారా ఎవరికైనా నిజమైన సహాయం అందితే, అదే మా జీవితంలో గొప్ప విజయంగా భావిస్తాం” అని మంచు మనోజ్ పేర్కొన్నారు.
నమస్తే వరల్డ్ సంస్థను కూడా
{{/usCountry}}“అయితే ముందుగా ఈ ఆలోచనకు మూలమైన మౌనిక భూమా మంచు కొన్ని మాటలు మాట్లాడాలి. ఈ ఆలోచన నిజంగా ఆమె నుంచే వచ్చింది. రక్తదాన శిబిరంతో పాటు, ఈరోజు నుంచే ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని వారి విద్యకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది ఇక్కడితో ఆగదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామానికి ఈ సేవా కార్యక్రమాలను తీసుకెళ్తాం. ఈ సంస్థ ద్వారా ఎవరికైనా నిజమైన సహాయం అందితే, అదే మా జీవితంలో గొప్ప విజయంగా భావిస్తాం” అని మంచు మనోజ్ పేర్కొన్నారు.
నమస్తే వరల్డ్ సంస్థను కూడా
{{/usCountry}}ఈ సందర్భంగా మాట్లాడిన మౌనిక భూమా మంచు.. “అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో నేను, మనోజ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది మా తల్లిదండ్రుల ఆశీర్వాదాల వల్లే సాధ్యమైంది. వారు మాకు మాత్రమే కాదు, మా పిల్లలు కూడా అనుసరించాల్సిన మార్గాన్ని చూపించారు” అని తెలిపారు.
“ఈ ట్రస్ట్ కేవలం రక్తదాన కార్యక్రమాలకే పరిమితం కాదు. మహిళా సాధికారత, ఉపాధి కల్పన కోసం కూడా పని చేస్తుంది. ‘నమస్తే వరల్డ్’ అనే సంస్థను కూడా ప్రారంభించాం. దాని ద్వారా టాయ్ మేకింగ్ కోర్సుల సహకారంతో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. సమాజానికి సేవ చేయడానికి ఇంకా ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి. ఇప్పుడు ఈ ట్రస్ట్‌ను ప్రారంభించాల్సిందిగా నవీన్ అన్నను కోరుతున్నాను” అని మంచు మౌనిక భూమా వెల్లడించారు.
30 ఏళ్లకుపైగా అనుబంధం
అనంతరం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అధికారికంగా “ఐక్య ధైర్య సేన సమితి” పేరును ప్రకటించి, సామాజిక సేవ కోసం ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్న మనోజ్, మౌనికలను అభినందించారు. “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మనోజ్ మంచు అన్న అభిమానులకు ప్రత్యేక అభినందనలు. మా కుటుంబం, మనోజ్ అన్న కుటుంబానికి 30 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. చిన్నప్పటి నుంచే ఆయనలో సేవా భావం ఉంది” అని నవీన్ యాదవ్ అన్నారు.
“పుట్టినరోజు సందర్భంగా మౌనిక భూమా మంచు గారి ఆలోచనతో ఈ ట్రస్ట్‌ను ప్రారంభించడం ఎంతో అభినందనీయం. ఈ ట్రస్ట్ పేరు ‘ఐక్య ధైర్య సేన సమితి’ — దీని నినాదం Unity, Courage, Service, Impact. ఆ పేరు వాళ్ల ఆలోచన, సేవా భావాన్ని ప్రతిబింబిస్తుంది. పిల్లలను దత్తత తీసుకోవడం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి నిర్ణయాలు ఎంతో గొప్పవి. ఈ కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల అంతటా తీసుకెళ్లేందుకు మనోజ్ అన్నకు నా పూర్తి సహకారం ఉంటుంది. ఈ సంస్థలో పనిచేసే ప్రతి వాలంటీర్‌కు నా శుభాకాంక్షలు” అని నవీన్ యాదవ్ పేర్కొన్నారు.