Manchu Manoj Shivathmika Rajashekar In Aasmaan Teaser Launch: టాలీవుడ్ రియల్ స్టార్ శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా ఎంట్రీ ఇస్తున్న లేటెస్ట్ మూవీ ఆస్మాన్. శ్రీమతి. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ మీద ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆస్మాన్ టీజర్ లాంచ్

ఆస్మాన్ సినిమాకు రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీహరి జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన ఆస్మాన్ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. మేఘాంశ్ శ్రీహరి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 16) నాడు ఆస్మాన్ టీజర్‌ను విడుదల చేశారు.
ఈ మేరకు నిర్వహించిన ఆస్మాన్ టీజర్ లాంచ్ ఈవెంట్‌కి రాకింగ్ స్టార్ మంచు మనోజ్, హీరోయన్ శివాత్మిక రాజశేఖర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్, శివాత్మిక రాజశేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
సినిమా ఉన్నంతకాలం శ్రీహరి ఉంటారు
రాకింగ్ మంచు మనోజ్ మాట్లాడుతూ.. "నా తమ్ముడు మేఘాంశ్ ‘ఆస్మాన్’ కోసం రావడం ఆనందంగా ఉంది. శ్రీహరి అంకుల్ మమ్మల్ని ఎత్తుకుని పెంచారు. నేను మేఘాంశ్‌ని ఎత్తుకున్నాను (నవ్వుతూ). సినిమా ఉన్నంత కాలం రియల్ స్టార్ శ్రీహరి గారు ఉంటారు" అని అన్నారు.
"మేఘాంశ్‌ని నేను ఎలా చూడాలని అనుకున్నానో ఆస్మాన్ టీజర్‌లో అలా కనిపించాడు. టీజర్ నాకు చాలా నచ్చింది. ప్రశాంత్ గారి బీజీఎమ్ అదిరిపోయింది. అరబిక్‌లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ‘ఆస్మాన్’ గొప్ప హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా తమ్ముడు మేఘాంశ్‌ను అందరూ ఆదరించి మంచి విజయాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను" అని మంచు మనోజ్ కోరారు.
మేఘాంశ్ నా స్కూల్‌లో సీనియర్
శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ .. "‘ఆస్మాన్’ టీజర్ అద్భుతంగా ఉంది. విజువల్స్, మేఘాంశ్ డైలాగ్స్ బాగున్నాయి. రాయంచ ముద్దుగా కనిపిస్తున్నారు. ప్రశాంత్ గారి మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. మేఘాంశ్ నా స్కూల్‌లో సీనియర్. ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలి. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని ఆకాంక్షించారు.
{{/usCountry}}శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ .. "‘ఆస్మాన్’ టీజర్ అద్భుతంగా ఉంది. విజువల్స్, మేఘాంశ్ డైలాగ్స్ బాగున్నాయి. రాయంచ ముద్దుగా కనిపిస్తున్నారు. ప్రశాంత్ గారి మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. మేఘాంశ్ నా స్కూల్‌లో సీనియర్. ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలి. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని ఆకాంక్షించారు.
{{/usCountry}}హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ .. "‘ఆస్మాన్’ కోసం వచ్చిన మనోజ్ అన్నకి, శివాత్మికకు థాంక్స్. ‘ఆస్మాన్’ మూవీని ఎంజాయ్ చేస్తూ చేశాను. షోయబ్ గారితో ఆల్రెడీ ఓ మూవీ చూస్తున్నాను. షోయబ్ గారి వల్లే ఈ చిత్రం ఈ స్థాయిలో వచ్చింది" అని అన్నారు.
రాయంచ అద్భుతంగా నటించారు
"హీరోయిన్ రాయంచ అద్భుతంగా నటించారు. రామ్ నందన్ ఈ సినిమాని గొప్ప స్థాయిలో తెరకెక్కించారు. ఈ చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అది నా ప్రామీస్" అని దివంగత శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి చెప్పుకొచ్చారు.
దర్శకుడు రామ్ నందన్ మాట్లాడుతూ .. "‘ఆస్మాన్’ టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. చాలా వరకు రివీల్ చేశామనే చెప్పొచ్చు. మోషన్ పోస్టర్ నుంచి మొదలైన సస్పెన్స్‌ను టీజర్‌తో పెంచాం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకటేష్, శ్రీకాంత్ గారికి థాంక్స్" అని అన్నారు.
ఏదో ఒక మిస్టరీ ఇస్తూనే ఉంటాం
"మా హీరో మేఘాంశ్‌కి టాలెంట్‌తో పాటు డెడికేషన్ ఉంది. షోయబ్ గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ప్రశాంత్ గారి మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటుంది. రాయంచ అద్భుతంగా నటించారు. సినిమా రిలీజ్ వరకు ఏదో ఒక మిస్టరీ ఇస్తూనే ఉంటాం" అని డైరెక్టర్ రామ్ నందన్ పేర్కొన్నారు.