...
...
Next Story

స్టేజీపై హీరో శివాజీ బూతులు, సామాన్లు అంటూ మాటలు- క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్- 14, 15, 21 సెక్షన్స్ ఉల్లంఘించడమంటూ!

హైదరాబాద్‌లో జరిగిన దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహిళళ వస్త్రధారణపై హీరో శివాజీ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. అయితే, స్టేజీపై బూతులు, సామాన్లు అంటూ వాడిన పదజాలంపై తాజాగా మంచు మనోజ్‌, ఇతర సెలబ్రిటీలు విమర్శిస్తున్నారు.

Published on: Dec 23, 2025, 15:22:36 IST
Advertisement

బిగ్ బాస్ కంటెస్టెంట్, హీరో శివాజీ నటించిన లేటెస్ట్ మూవీ దండోరా. హైదరాబాద్‌లో సోమవారం (డిసెంబర్ 22) సాయంత్రం జరిగిన దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

స్టేజీపై హీరో శివాజీ బూతులు, సామాన్లు అంటూ మాటలు- క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్- 14, 15, 21 సెక్షన్స్ ఉల్లంఘించడమంటూ!
స్టేజీపై హీరో శివాజీ బూతులు, సామాన్లు అంటూ మాటలు- క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్- 14, 15, 21 సెక్షన్స్ ఉల్లంఘించడమంటూ!

ముఖ్యంగా మహిళల శరీర భాగాలను ఉద్దేశించి 'సామాన్లు' అని, పద్ధతిగా లేని వారిని 'దరిద్రపు XXX' అనుకుంటారు అంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలను మంచు మనోజ్‌తోపాటు సింగర్ చిన్మయి, నెటిజన్స్ విమర్శిస్తున్నారు.

శివాజీ వ్యాఖ్యలపై హీరో మంచు మనోజ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. "గత రాత్రి నటుడి వ్యాఖ్యలు నిరాశపరిచాయి. మహిళల హక్కులను పరిరక్షించాలి. కానీ, వారి ఛాయిస్‌లను కాదు. మహిళల దుస్తులపై ఆంక్షలు విధించడం లేదా వారిపై నైతిక బాధ్యత మోపడం అనేది చాలా పాతకాలపు ఆలోచన. అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు" అని లేఖలో మంచు మనోజ్ రాసుకొచ్చారు.

"గౌరవం అనేది ఒకరి ప్రవర్తనలో ఉండాలి తప్ప, వారు వేసుకునే బట్టల మీద కాదు. పబ్లిక్ ఫిగర్స్‌గా ఉన్నవారు సమాజంపై తమ మాటల ప్రభావం ఉంటుందని గుర్తుంచుకుని బాధ్యతగా మాట్లాడాలి. ఆయన చేసిన వ్యాఖ్యలు భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 14, 15, 21లను ఉల్లంఘించేలా ఉన్నాయి" అని మనోజ్ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.

"సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ అనేవి చర్చించలేని అంశాలు. మహిళల బట్టలపై తీర్పు ఇచ్చే అధికారం ఎవరికీ లేదు. మహిళలను కించపరిచేలా వస్తువులుగా చూస్తూ మాట్లాడిన ఆ సీనియర్ నటుడి తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను. అలాంటి మాటలు పురుషులందరి అభిప్రాయం కాదు" అని మంచు మనోజ్ చెప్పారు.

కాగా దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాంకర్ స్రవంతి చొక్కారపు చీర కట్టుకుని పద్ధతిగా ఉందని శివాజీ ప్రశంసించారు. ఆ సమయంలో 'కోర్ట్'లోని విలన్ పాత్రను గుర్తు చేస్తూ 'మంగపతి' అని కేకలు వేశారు. ఆ పాత్ర ప్రభావంతోనేమో గానీ, శివాజీ ఒక్కసారిగా సీరియస్ అయిపోయి హీరోయిన్లకు హితబోధ చేయడం మొదలుపెట్టారు.

"హీరోయిన్లకు ఒకటే చెబుతున్నాను.. బయటకు వెళ్లినప్పుడు మీకు నచ్చిన దుస్తులు వేసుకోకండి. దానివల్ల వచ్చే పరిణామాలను మీరే అనుభవించాల్సి ఉంటుంది. మీరు ఏమనుకున్నా నాకు పోయేదేమీ లేదు.. లాగి పీకుతాము మేము, అది వేరే విషయం" అంటూ శివాజీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

"సామాన్లు కనబడేలా బట్టలు వేసుకుంటే అందులో ఏమీ ఉండదు. మీరు సామాన్లు కనిపించేలా దుస్తులు వేసుకున్నప్పుడు జనం చూసి నవ్వుతారు గానీ, లోపల మాత్రం మిమ్మల్ని దరిద్రపు XXX అనుకుంటారు. ఆ మాట అంటే మళ్లీ మీరు మహిళా స్వేచ్ఛ అంటారు. గ్లామర్‌కు ఒక హద్దు ఉండాలి, మీ స్వేచ్ఛ అనేది ఒక వరం, దాన్ని పోగొట్టుకోకండి" అని శివాజీ అన్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks