...
...
Next Story

Mandaadi OTT: సుహాస్ పీక్ విలనిజం-ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న 150 కోట్ల తమిళ బ్లాక్ బస్టర్ మూవీ-అఫీషియల్ డేట్!

Mandaadi OTT: టాలీవుడ్ లో తన నేచురల్ యాక్టింగ్ తో ఫ్యాన్స్ ను సంపాదించుకున్న సుహాస్ తమిళంలో విలన్ గా చేసిన మూవీ ‘మండాడి’. ఇందులో పీక్ విలనిజంతో నెగెటివ్ రోల్ లో అదరగొట్టాడు సుహాస్. ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.

Published on: Oct 5, 2026, 13:04:05 IST
Advertisement

Mandaadi OTT: తమిళ నటుడు సూరి, టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సుహాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తమిళ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'మండాడి' (Mandaadi). ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ బ్లాక్‌బస్టర్ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

మండాడి ఓటీటీ

సుహాస్ పీక్ విలనిజం.. ఓటీటీలోకి వచ్చేస్తున్న 150 కోట్ల తమిళ బ్లాక్ బస్టర్ మూవీ..అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్! (x/sooriofficial)
సుహాస్ పీక్ విలనిజం.. ఓటీటీలోకి వచ్చేస్తున్న 150 కోట్ల తమిళ బ్లాక్ బస్టర్ మూవీ..అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్! (x/sooriofficial)

థియేటర్లలో సంచలన విజయం సాధించి ఏకంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన 'మండాడి' డిజిటల్ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. అక్టోబర్ 8, 2026 నుంచి ఈ చిత్రాన్ని తమ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఇవాళ (అక్టోబర్ 5) ప్రకటించింది.

తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మండాడి మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కు ఇది గుడ్ న్యూస్. అయితే మండాడి మూవీ అక్టోబర్ 9న ఓటీటీలోకి వస్తుందనే ప్రచారం సాగింది. ఇప్పుడీ సినిమా ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్ కు రానుంది.

'సర్దార్ 2'కి పోటీగా వచ్చి

కార్తి హీరోగా వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం 'సర్దార్ 2' (Sardar 2) తో పాటే థియేటర్లలోకి విడుదలైనప్పటికీ, 'మండాడి' బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచింది. పక్కా లోకల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్, సాంప్రదాయ పడవల పోటీ నేపథ్యంలో సాగే మైండ్ గేమ్‌లు, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. కార్తి సినిమా పోటీని తట్టుకుని రూ.150 కోట్ల మైలురాయిని దాటడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

సుహాస్ తమిళ డెబ్యూ

కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి 'విడుదలై' చిత్రంతో సీరియస్ హీరోగా మారిన సూరి, 'మండాడి' విజయంతో తన మాస్, కంటెంట్-డ్రివెన్ మార్కెట్‌ను మరింత విస్తరించుకున్నారు. మరోవైపు, తెలుగులో హీరోగా వైవిధ్యమైన పాత్రలు చేస్తున్న సుహాస్.. తమిళంలో పీక్ విలనిజంతో అదరగొట్టారు. థియేటర్లో సత్తాచాటిన మండాడి మూవీ ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమనే టాక్ ఉంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks