రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీ ‘మాస్ జాతర’. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ కు రంగం సిద్ధమైంది. మాస్ జాతర మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్, రిలీజ్ డేట్ వివరాలు మీ కోసం.
మాస్ జాతర ఓటీటీ డేట్

రవితేజ 75వ సినిమాగా తెరకెక్కిన మాస్ జాతర ఓటీటీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. వచ్చే శుక్రవారం అంటే నవంబర్ 28 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ లో అందుబాటులో ఉండనుంది ఈ మూవీ. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో కమింగ్ ఫ్రైడే అని మాస్ జాతర అప్ డేట్ ఉంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ మాస్ జాతర ఓటీటీ ప్లే అవనుంది.
75వ సినిమా
రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా వచ్చిన మాస్ జాతర.. ఆయన కెరీర్ లోనే దారుణమైన కలెక్షన్లు సాధించిన మూవీగా చెత్త రికార్డు మూటగట్టుకుంది. అక్టోబర్ 31, 2025న మాస్ జాతర మూవీ రిలీజైంది. దీనికి భాను భోగవరపు డైరెక్టర్. ఈ మూవీని రూ.90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. చివరకు ఈ సినిమా రూ.20 కోట్లు మాత్రమే ఖాతాలో వేసుకుంది. మాస్ జాతర సినిమాను సితారా ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
మాస్ జాతర సినిమాలో రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, ప్రవీణ్, సముద్రఖని, వీటీవీ గణేష్, హైపర్ ఆది, మురళీ శర్మ తదితరులు నటించారు.
మాస్ జాతర కథ
{{/usCountry}}మాస్ జాతర సినిమాలో రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, ప్రవీణ్, సముద్రఖని, వీటీవీ గణేష్, హైపర్ ఆది, మురళీ శర్మ తదితరులు నటించారు.
మాస్ జాతర కథ
{{/usCountry}}మాస్ జాతర మూవీ ఓ నిజాయతీ కలిగిన రైల్వే పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. లక్ష్మణ్ భేరి (రవితేజ) ఓ సిన్సియర్ రైల్వే పోలీస్. అన్యాయం జరుగుతుంటే తన లిమిట్స్ లో ఉందా? లేదా? అని ఆలోచించకుండా రంగంలోకి దూకేస్తుంటాడు. వరంగల్ లో ఇలాగే ఓ మంత్రి కొడుక్కి తగిన బుద్ధి చెప్తాడు. ఆ తర్వాత అడవివరం రైల్వే స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ అవుతాడు.
గంజాయి స్మగ్లింగ్
ట్రాన్స్ ఫర్ అయిన లక్ష్మణ్ భేరి అక్కడి గంజాయి స్మగ్లింగ్ గ్యాంగ్ ను టార్గెట్ చేసుకుంటాడు. ఆ ప్రాంతాన్ని శివుడు (నవీన్ చంద్ర) గుప్పిట్లో పెట్టుకుని రైతులతో గంజాయి పండించి, కోల్ కతాకు స్మగ్లింగ్ చేస్తుంటాడు. మరి శివుడును లక్ష్మణ్ ఎలా ఆపాడు? మధ్యలో తులసి (శ్రీలీల)తో లవ్ స్టోరీ ఏంటీ? అన్నది సినిమాలో చూడాల్సిందే.