...
...
Next Story

Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న ఫ్యామిలీ డ్రామా- మనసుకు హత్తుకునేలా తండ్రీకూతుళ్ల బంధం- నవ్విస్తూ, ఏడిపిస్తూ!

Matargashti OTT Trending On Netflix: తండ్రీకూతుళ్ల మధ్య ఉండే భావోద్వేగాలు, జనరేషన్ గ్యాప్ వల్ల వచ్చే ఘర్షణను నవ్విస్తూ, ఏడిపించేలా తీసిన ఓటీటీ సిరీస్ మటర్ గస్తీ. 7.3 ఐఎమ్‌డీబీ రేటింగ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 1గా ఓటీటీ ట్రెండ్ అవుతున్న ఈ 5 ఎపిసోడ్ల మిని సిరీస్‌ను ఎందుకు చూడాలో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Oct 25, 2026, 21:29:56 IST
Advertisement

Matargashti OTT Trending On Netflix: ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో రొటీన్ క్రైమ్ థ్రిల్లర్లు, యాక్షన్ సినిమాల హోరు ఎక్కువైంది. ఇలాంటి సమయంలో మనసుకు హత్తుకునే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. సరిగ్గా అలాంటి అనుభూతినే అందిస్తోంది ఓటీటీలోని క్లీన్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్.

ఎలాంటి లక్ష్యం లేకుండా

నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న ఫ్యామిలీ డ్రామా- మనసుకు హత్తుకునేలా తండ్రీకూతుళ్ల బంధం- నవ్విస్తూ, ఏడిపిస్తూ!
నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న ఫ్యామిలీ డ్రామా- మనసుకు హత్తుకునేలా తండ్రీకూతుళ్ల బంధం- నవ్విస్తూ, ఏడిపిస్తూ!

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలైన వెబ్ సిరీసే 'మటర్ గస్తీ' (Matargashti). మటర్ గస్తీ అంటే ఎలాంటి లక్ష్యం లేకుండా అటు ఇటు తిరగడం అనే అర్థం వస్తుంది. ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఇది భారత్‌లోని టాప్-10 ట్రెండింగ్ లిస్ట్‌లోకి దూసుకొచ్చింది.

టాప్ 1 ఓటీటీ ట్రెండింగ్‌లో

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 1 స్థానంలో మటర్ గస్తీ ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. అక్టోబర్ 21న ఓటీటీ రిలీజ్ అయిన మటర్ గస్తీ నాలుగైదు రోజుల్లోనే ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతుందన్నమాట. కేవలం 5 ఎపిసోడ్లతో రూపుదిద్దుకున్న ఈ ఓటీటీ ఫ్యామిలీ సిరీస్‌కు ఐఎమ్‌డీబీ (IMDb)లో 7.3 రేటింగ్ రావడం విశేషం.

కథా నేపథ్యం: తండ్రీకూతుళ్ల అనుబంధం - సవాళ్లు

సాధారణంగా ఏ ఇంట్లోనైనా కూతురికి తండ్రే మొదటి హీరో. తండ్రికి కూడా కూతురంటే ప్రాణం. అయితే టీనేజ్ దాటి యువతిగా మారే క్రమంలో కూతురి స్వేచ్ఛకు, తండ్రి పెంపకానికి మధ్య కొద్దిపాటి ఘర్షణ రావడం సహజం. ఈ పాయింట్‌నే దర్శకుడు సిద్ధాంత్ చౌహాన్ చాలా సహజంగా తెరకెక్కించారు.

వ్యక్తిగత జీవితాన్ని, ఆలోచనలను

అయితే ఒంటరిగా ధారను పెంచుతున్న తండ్రిగా ప్రకాష్ తన కూతురి భద్రత విషయంలో అత్యంత కఠినంగా ఉంటాడు. ఒకే ఇంట్లో ఉంటూ కూడా వారిద్దరి మధ్య సంభాషణలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో ధార ఆలోచనలు తండ్రికి తెలిసినప్పుడు వారి బంధం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేదే అసలు కథ.

సమాజానికి ఒక చక్కటి సందేశం

మన సమాజంలో విడాకులు తీసుకున్న మహిళలను లేదా స్వేచ్ఛగా బతకాలనే అమ్మాయిలను చూసే దృక్పథం ఎలా ఉంటుందో ఈ సిరీస్‌లో ఆవిష్కరించారు. సమాజపు ఆంక్షలను పక్కనపెట్టి, ఇంట్లో వారి మద్దతు ఉంటే అమ్మాయిలు ఎంత ధైర్యంగా ముందుకు సాగగలరో ఇందులో చూపించారు. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా, అత్యంత నాగరికంగా, కుటుంబ సమేతంగా చూడదగ్గ రీతిలో సన్నివేశాలను తీర్చిదిద్దారు.

ఆకట్టుకునే నటన, బింజ్ వాచ్ మేకింగ్

తండ్రి పాత్రలో జీవించిన రాజేష్ కుమార్ నటన సిరీస్‌కు ప్రధాన బలం. కూతురి భవిష్యత్తు గురించి తాపత్రయపడే పక్కా మధ్యతరగతి తండ్రిగా ఆయన ఒదిగిపోయారు. ధారగా నటించిన అద్రిజా సిన్హా, ఆమె స్నేహితురాలిగా చేసిన సౌమ్య ఉనియాల్ తమ నటనతో ఆకట్టుకున్నారు.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

స్నేహితురాళ్ల మధ్య జరిగే సంభాషణలు మన ఇంట్లో లేదా పక్కింట్లో జరిగే సన్నివేశాల్లా అనిపిస్తాయి. ప్రథమార్ధంలో వచ్చే కామెడీ సీన్లు నవ్విస్తే, చివర్లో వచ్చే ఎమోషనల్ సీన్లు కంటతడి పెట్టిస్తాయి. వారాంతంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా, హాయిగా ఇంట్లో కుటుంబంతో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో చూసేయడానికి ఈ 5 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ ఒక చక్కటి ఆప్షన్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks