...
...
Next Story

OTT: బడ్జెట్‌కి 3 రెట్లకుపైగా మయూఖ కలెక్షన్స్- 2 ఓటీటీల్లో ట్రెండింగ్‌లో ఉంటూనే ఇంకోవైపు థియేటర్‌లో 50 రోజులు పూర్తి!

Mayookha 50 Days Run And OTT Trending: ఒకవైపు ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతూనే ఇంకోవైపు థియేటర్‌లో ఏకంగా 50 రోజులు పూర్తి చేసుకున్న తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా మయూఖ. పాయల్ చెంగప్ప హీరోయిన్‌గా చేసిన మయూఖ కలెక్షన్స్, ఓటీటీ ట్రెండింగ్, థియేట్రికల్ రిలీజ్, బడ్జెట్ వివరాలపై లుక్కేద్దాం.

Published on: Nov 27, 2026, 16:05:54 IST
Advertisement

Mayookha 50 Days Run And OTT Trending: చిన్న సినిమాలకు థియేటర్లలో మూడు రోజులు ప్రదర్శన కొనసాగడమే కష్టంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో.. తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’ అరుదైన విజయాన్ని అందుకుంది. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఐనాక్స్ ఓడియన్ థియేటర్‌లో 50 రోజుల ప్రదర్శనను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

3 కోట్లకుపైగా బిజినెస్

బడ్జెట్‌కి 3 రెట్లకుపైగా మయూఖ కలెక్షన్స్- 2 ఓటీటీల్లో ట్రెండింగ్‌లో ఉంటూనే ఇంకోవైపు థియేటర్‌లో 50 రోజులు పూర్తి!
బడ్జెట్‌కి 3 రెట్లకుపైగా మయూఖ కలెక్షన్స్- 2 ఓటీటీల్లో ట్రెండింగ్‌లో ఉంటూనే ఇంకోవైపు థియేటర్‌లో 50 రోజులు పూర్తి!

శ్రీ తేజ్ ఎస్‌కే దర్శకత్వంలో, శశిధర్ నల్ల నిర్మాణంలో ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘మయూఖ’ థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ మంచి ఆదరణను సొంతం చేసుకుంది. జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి 2 ఓటీటీల్లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

థియేట్రికల్, ఓటీటీ కలెక్షన్లు కలిపి మయూఖ సినిమా రూ.3 కోట్లకు పైగా బిజినెస్ సాధించినట్లు అంచనా. ఇది సినిమా నిర్మాణ బడ్జెట్ కంటే మూడు రెట్లకు పైగా ఉండటం విశేషం. థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్‌ను గణేష్ భారి నిర్వహించగా, ఓటీటీ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను బాలాజీ వీడియోస్‌కు చెందిన నిరంజన్ పన్సారి నిర్వహించారు. రెండు వేదికలపై లభించిన ఈ స్పందనతో చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తొలి సినిమాతోనే సరికొత్త ప్రయోగం!

దర్శకుడు శ్రీ తేజ్ ఎస్‌కే తన తొలి చిత్రంతోనే సాంప్రదాయ కమర్షియల్ సినిమా ఫార్మాట్‌కు భిన్నంగా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కథకు అనుగుణంగా మోనోక్రోమాటిక్ కలర్ ప్యాటర్న్‌ను ఎంచుకోవడంతో పాటు, విభిన్నమైన విజువల్ ట్రీట్‌మెంట్‌తో సినిమాను రూపొందించారు.

మయూఖ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన పాయల్ చెంగప్ప తన నటనతో ఆకట్టుకున్నారు. పాత్రలోని భావోద్వేగాలను, మానసిక సంఘర్షణలను తెరపై చక్కగా ఆవిష్కరించి తనదైన ముద్ర వేశారు.

నిర్మాత శశిధర్ నల్ల ఆనందం

విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిన్న సినిమాను నమ్మి నిర్మించిన నిర్మాత శశిధర్ నల్లకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ ఆనందాన్ని కలిగిస్తోంది. పెద్ద సినిమాల మధ్య ఒక చిన్న సినిమా తన కంటెంట్‌తో థియేటర్లలోనూ, ఓటీటీలోనూ గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.

చిన్న సినిమాకు పెద్ద విజయం!

ప్రస్తుతం సినిమాల థియేట్రికల్ రన్ చాలా పరిమితంగా మారిన నేపథ్యంలో, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వంటి ప్రముఖ ప్రాంతంలోని థియేటర్‌లో 50 రోజులు ప్రదర్శన కొనసాగించడం ‘మయూఖ’ సాధించిన ప్రత్యేక విజయంగా చెప్పుకోవచ్చు.

ఒకవైపు థియేటర్లలో 50 రోజుల ప్రదర్శన, మరోవైపు జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ ఓటీటీ ట్రెండింగ్, మొత్తంగా రూ.3 కోట్లకు పైగా అంచనా కలెక్షన్లు.. ఇవన్నీ ఈ చిన్న సినిమాకు దక్కిన విజయానికి నిదర్శనాలు.

థియేటర్ల నుంచి ఓటీటీ వరకు

భిన్నమైన కథను నమ్మి, కొత్త తరహా చిత్రీకరణతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు శ్రీ తేజ్ ఎస్‌కే ప్రయోగం విజయవంతమైంది. చిన్న సినిమా అయినా సరైన కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని ‘మయూఖ’ మరోసారి నిరూపించింది. థియేటర్ల నుంచి ఓటీటీ వరకు విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ‘మయూఖ’ తన టీమ్‌కు ఒక గ్రాండ్ సక్సెస్‌ను అందించింది.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks