Mayookha 25 Days Success Celebrations: బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా "మయూఖ" (Mayookha Movie). ఈ చిత్రాన్ని ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై శశిధర్ నల్ల నిర్మించారు. శ్రీ తేజ్ ఎస్కె దర్శకత్వం వహించారు.
మయూఖ 25 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్

ఇటీవలే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన "మయూఖ" సినిమా ట్రెండ్ సెట్టింగ్ థ్రిల్లర్‌గా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 25 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్ తాజాగా ఈ రోజు (నవంబర్ 3) హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పొలిటికల్ లీడర్ చిన్న శ్రీశైలం యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలువురు మీడియా మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని "మయూఖ" సినిమా టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
పెద్ద బడ్జెట్ ఇస్తే మిరాకిల్స్ చేస్తారు
ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ డి.గిరీష్ రెడ్డి మాట్లాడుతూ.. "మా సినిమాకు ఉన్న బడ్జెట్లో ఇంత క్వాలిటీగా సినిమా చేసి, గ్రాండ్‌గా రిలీజ్ చేసుకున్నాం అంటే అందుకు మా డైరెక్టర్ విజన్ కారణం. ఆయనకు పెద్ద బడ్జెట్ ఇచ్చి సినిమా చేయమంటే మిరాకిల్స్ చేస్తారు. మా సినిమాను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్" అని అన్నారు.
యాక్టర్ రఘు వాసిరెడ్డి మాట్లాడుతూ.. "మా సినిమా సక్సెస్ షీల్డ్ అందుకోవడం నా కెరీర్లో ఎంతో స్పెషల్ మూవ్‌మెంట్‌గా భావిస్తున్నా. ఈ షీల్డ్ నేను అందుకున్నానంటే కారణం మా డైరెక్టర్ శ్రీతేజ్. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని చెప్పారు.
వారం రోజులు ఆడితేనే గొప్ప విషయం
యాక్టర్ అభిలాష్ అడ్డ మాట్లాడుతూ.. "ఈ రోజున సినిమాలు ఒక వారం రోజులు ఆదరణ పొందితేనే గొప్ప విషయం. అలాంటిది మా సినిమాకు పాతిక రోజుల రన్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాం. చిన్న సినిమాల విషయంలో బాక్సాఫీస్ వద్ద ఇది అరుదుగా దక్కే విజయం. ఈ సినిమా సక్సెస్ మా డైరెక్టర్ విజన్, కన్విక్షన్‌ను చూపిస్తోంది" అని పేర్కొన్నారు.
{{/usCountry}}యాక్టర్ అభిలాష్ అడ్డ మాట్లాడుతూ.. "ఈ రోజున సినిమాలు ఒక వారం రోజులు ఆదరణ పొందితేనే గొప్ప విషయం. అలాంటిది మా సినిమాకు పాతిక రోజుల రన్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాం. చిన్న సినిమాల విషయంలో బాక్సాఫీస్ వద్ద ఇది అరుదుగా దక్కే విజయం. ఈ సినిమా సక్సెస్ మా డైరెక్టర్ విజన్, కన్విక్షన్‌ను చూపిస్తోంది" అని పేర్కొన్నారు.
{{/usCountry}}ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ.. "ఒక సినిమా రిలీజై నెక్ట్స్ ఫ్రైడే చూడటం అనేది అరుదు. అలాంటిది 25 రోజులు థియేటర్స్‌లో సినిమా రన్ కావడం అంటే ఈజీ కాదు. అలాంటి ఘనత సాధించిన "మయూఖ" టీమ్‌ను అభినందిస్తున్నా. ఈ రోజు చిన్న చిత్రాలు థియేటర్స్‌లో ఆడటం ఎంత కష్టమైందో మనం చూస్తున్నాం. ఈ టీమ్ ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా" అని ఆకాంక్షించారు.
మైండ్ బెండింగ్ బ్లాక్ బస్టర్‌కు మించి పెట్టినా
"మయూఖ సినిమా ప్రీమియర్స్ వేశారు. అప్పుడు సినిమా చూసి ఈ మూవీ పెద్ద సక్సెస్ అవుతుందని చెప్పాను. మేము ఆశించినట్లే మయూఖ సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్" అని వీ5 ఎండీ వెంకటేష్ చెప్పారు.
"మా సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌కు మైండ్ బెండింగ్ బ్లాక్ బస్టర్ అని పేరు పెట్టారు. ఇంతకంటే పెద్ద పేరు పెట్టినా మాకు సంతోషమే. కొత్త టీమ్‌తో ఇలాంటి డిఫరెంట్ థ్రిల్లర్ నిర్మించిన మా ప్రొడ్యూసర్ గారికి, సినిమాను రూపొందించిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్" అని యాక్టర్ దేవ్ డి అన్నారు.
సక్సెస్ షీల్డ్స్ బహుకరణ
అలాగే, ఈ సక్సెస్ సెలబ్రేషన్స్సో పొలిటికల్ లీడర్ చిన్న శ్రీశైలం యాదవ్, వీ5 ఎండీ వెంకటేష్, ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ కూండ్ల మయూఖ మూవీ టీమ్‌కు సక్సెస్ షీల్డ్‌లు అందించారు.