...
...
Next Story

Mayookha Review: మయూఖ రివ్యూ-విడుదలకు ముందే అవార్డులు- పాయల్ వన్ వుమెన్ షో- బిగ్ బాస్ అమన్ మిస్టరీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Mayookha Review And Rating In Telugu: విడుదలకు ముందే అంతర్జాతీయ గుర్తింపు పొందిన మిస్టరీ థ్రిల్లర్ మయూఖ ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. పాయల్ చెంగప్ప నటన, డైరెక్టర్ శ్రీ తేజ్ ఎస్‌కే టేకింగ్, బిగ్ బాస్ అమన్ డెబ్యూ, ఉత్కంఠ రేకెత్తించే సీన్లు ప్రేక్షకులను ఏమేరకు మెప్పించాయో నేటి మయూఖ రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Oct 9, 2026, 11:20:00 IST
Advertisement

Mayookha Movie Review And Rating In Telugu: బ్యూటిఫుల్ పాయల్ చెంగప్ప, దేవ్ డి, మురళీధర్ గౌడ్, బిగ్ బాస్ తెలుగు 10 అమన్ మసూద్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మయూఖ'. శ్రీ తేజ్ ఎస్కే (శ్రీకాంత్ కండ్రేగుల) దర్శకత్వంలో శశిధర్ నల్ల నిర్మించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ అక్టోబర్ 09న అంటే ఇవాళ థియేటర్లలోకి వచ్చింది.

విడుదలకు ముందే అవార్డులు

మయూఖ రివ్యూ-విడుదలకు ముందే అవార్డులు- పాయల్ వన్ వుమెన్ షో- బిగ్ బాస్ అమన్ మిస్టరీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
మయూఖ రివ్యూ-విడుదలకు ముందే అవార్డులు- పాయల్ వన్ వుమెన్ షో- బిగ్ బాస్ అమన్ మిస్టరీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

విడుదలకు ముందే ప్రతిష్టాత్మక 'న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్' (NYIFA) వేదికపై ఉత్తమ మిస్టరీ చిత్రం పురస్కారం సొంతం చేసుకుని సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తించింది. ఒక భారతీయ సస్పెన్స్ సినిమా విడుదలకు ముందే విదేశీ గడ్డపై అవార్డు గెలుచుకోవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇలాంటి ఈ సినిమా ఎలా ఉందో నేటి మయూఖ రివ్యూలో తెలుసుకుందాం.

ట్విస్టుల వేట.. అసలు కథేంటంటే?

దివ్య అనే యువతి హత్యతో సినిమా కథ ప్రారంభమవుతుంది. ఆ ఘటన తర్వాత మయూఖ (పాయల్ చెంగప్ప) ఉండే ఫ్లాట్‌లో ఎవరో తిరుగుతున్నారనే భయంకరమైన అనుభూతి ఆమెకు కలుగుతుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఆధారాలు దొరక్కపోవడంతో అధికారులు ఆమెను హెచ్చరించి వెళ్లిపోతారు.

ప్రతిక్షణం భయంతో గడిపే మయూఖ, సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించగా తన మాజీ సహద్యోగి ఆ ఇంటికి వచ్చి వెళ్లినట్లు తెలుస్తుంది. సరిగ్గా అదే సమయంలో అతను వచ్చి తలుపు తడతాడు. అనుమానంతో అతనిని ఇంట్లోనే బంధించి బయట లాక్ వేసి పోలీసులకు సమాచారం అందిస్తుంది మయూఖ. అధికారులు వచ్చి తలుపు తెరిచి చూడగా ఆ వ్యక్తి శవమై కనిపిస్తాడు. ఈ హత్య వెనుక మయూఖ ఉందనే అనుమానంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారు.

మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు ప్రధాన బలం ప్రేక్షకుడిని ప్రతి సన్నివేశంలోనూ ఉత్కంఠకు గురిచేయడమే. గతంలో అడవి శేష్ నటించిన 'ఎవరు' చిత్రం తరహాలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ఊహకు అందని మలుపులతో సాగుతుంది. మొదటి భాగం అంతా అసలు ఇంట్లో నిజంగానే ఎవరైనా ఉన్నారా లేదా అంతా మయూఖ మానసిక భ్రమా అనే సందేహంలోనే కథ నడుస్తుంది.

సెకండాఫ్‌లో దర్శకుడు అసలు చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుతూ వెళ్లారు. ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా కథనాన్ని నడిపించారు. చివరి అరగంట ముందు అసలు విషయం వెలుగులోకి వస్తుంది. కొన్ని సీన్లు ముందే ఊహించేలా సాగినా, కథనం ఎక్కడా వేగం తగ్గకుండా రేసీగా నడుస్తుంది. అంతేకాకుండా రెండవ భాగానికి బలమైన లీడ్ ఇస్తూ సినిమాను ముగించారు.

పాయల్ వన్ వుమెన్ షో.. మెప్పించిన సాంకేతిక బృందం

మయూఖ పాత్రలో పాయల్ చెంగప్ప పూర్తిస్థాయిలో జీవించింది. భయం, ఆందోళన, అనుమానం వంటి హావభావాలను అద్భుతంగా పండించి సినిమాను తన భుజాలపై నడిపించింది. బిగ్ బాస్ ఫేమ్ అమన్, అభిలాష్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అభిలాష్ పాత్రలోని వైవిధ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మురళీధర్ గౌడ్, లావణ్య రాణి తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు శ్రీతేజ్ ఎస్‌కె ఎంచుకున్న కథాంశం, దానిని తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. సినిమాలో ప్రత్యేకంగా పాటలు లేనప్పటికీ, సీబి మాథ్యూ అలెక్స్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాల తీవ్రతను పెంచింది. శరత్ జె ఎడిటింగ్ వర్క్, శశిధర్ నల్ల నిర్మాణ విలువలు సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి.

మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్

ఫస్టాఫ్ కంటే సెకండాఫ్‌లో వచ్చే సస్పెన్స్ ఎలిమెంట్స్ థ్రిల్లర్ ఫ్యాన్స్‌కు మంచి థ్రిల్ పంచుతాయి. ఫైనల్‌గా చెప్పాలంటే మిస్టరీ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే సినిమా మయూఖ. కాబట్టి థియేటర్లలో మయూఖపై ఓసారి కచ్చితంగా లుక్కేయవచ్చు.

రేటింగ్: 3/5

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks