మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కలిసి సంబరాల్లో మునిగిపోయారు. సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. చేసుకోకుండా ఎందుకు ఉంటారు మరి? చిరంజీవి హీరోగా అనిల్ దర్శకత్వంలో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. ప్రీమియర్, పెయిడ్ షోలు చూసిన ఆడియన్స్ బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు.
మన శంకర వరప్రసాద్ గారు సెలబ్రేషన్స్

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి ఫస్ట్ టైమ్ చేసిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా సంక్రాంతి 2026 సందర్భంగా ఇవాళ (జనవరి 12) రిలీజైంది. అంతకంటే ముందే రాత్రి ప్రీమియర్, పెయిడ్ షోలు పడ్డాయి. వీటిని చూసిన జనాలు సినిమా అదిరిపోయిందని అంటున్నారు. దీంతో చిరంజీవితో కలిసి అనిల్ రావిపూడి ఈ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు.
మన శంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్
మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. ఇది పండగ సినిమా అని, బాస్ ఈజ్ బ్యాక్ అని, సంక్రాంతి 2026 విన్నర్ అని నెటిజన్లు రివ్యూలు పోస్టులు పెడుతున్నారు. అనిల్ రావిపూడి మరోసారి ఇరగదీశాడని కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రొడ్యూసర్లు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల వెళ్లి చిరంజీవిని కలిశారు. కేక్ కట్ చేసి సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రీమియర్స్ రెస్సాన్స్ తో
‘‘మెగా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ను సెలబ్రేట్ చేసుకున్న బ్యూటీఫుల్ మూమెంట్ ఇది. మన శంకర వరప్రసాద్ గారు ప్రీమియర్స్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత, ఈ సంతోషాన్ని పంచుకోవడానికి మెగాస్టార్ చిరంజీవిని హిట్ మెషిన్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రొడ్యూసర్లు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కలిశారు. ఈ రోజు మన శంకర వరప్రసాద్ గారు గ్రాండ్ గా రిలీజైంది’’ అని గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ ఎక్స్ లో పోస్టు చేసింది.
{{/usCountry}}‘‘మెగా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ను సెలబ్రేట్ చేసుకున్న బ్యూటీఫుల్ మూమెంట్ ఇది. మన శంకర వరప్రసాద్ గారు ప్రీమియర్స్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత, ఈ సంతోషాన్ని పంచుకోవడానికి మెగాస్టార్ చిరంజీవిని హిట్ మెషిన్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రొడ్యూసర్లు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కలిశారు. ఈ రోజు మన శంకర వరప్రసాద్ గారు గ్రాండ్ గా రిలీజైంది’’ అని గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ ఎక్స్ లో పోస్టు చేసింది.
{{/usCountry}}సంక్రాంతి 2026 విన్నర్
మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి 2026 విన్నర్ అనే కామెంట్లు వస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి, నయనతార జంటగా నటించారు. విక్టరీ వెంకటేశ్ స్పెషల్ క్యారెక్టర్ చేశారు. కేథరిన్, హర్షవర్ధన్ తదితరులు కూడా యాక్ట్ చేశారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కలిసి నిర్మించారు.