...
...
Next Story

Chiranjeevi Drink: మందు తాగితేనే ఛాన్సులు అన్నారు, బీర్ తాగమనేవారు- చిరంజీవి కామెంట్స్-గుర్రానికి గంతలు కట్టినట్లి అంటూ!

Chiranjeevi Recalls Drinking Pressure: సినిమా అవకాశాల కోసం మద్యం తాగాలని, పార్టీలు ఇవ్వాలని తన కెరీర్ ఆరంభంలో తోటి వారు ఒత్తిడి చేశారని మెగాస్టార్ చిరంజీవి గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన నశా ముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, చెన్నై రోజుల్లో నివసించిన రోజుల గురించి చెప్పారు.

Published on: Nov 29, 2026, 13:55:26 IST
Advertisement

Chiranjeevi Recalls Drinking Pressure: తెలుగు చిత్రసీమలో స్వయంకృషితో ఎదిగి 'మెగాస్టార్' స్థాయికి చేరుకున్న చిరంజీవి, తన కెరీర్ ఆరంభ రోజుల్లో ఎదురైన చేదు అనుభవాలను, వాటిని అధిగమించిన తీరును పంచుకున్నారు.

నశా ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం

మందు తాగితేనే ఛాన్సులు అన్నారు, బీర్ తాగమనేవారు- చిరంజీవి కామెంట్స్-గుర్రానికి గంతలు కట్టినట్లి అంటూ!
మందు తాగితేనే ఛాన్సులు అన్నారు, బీర్ తాగమనేవారు- చిరంజీవి కామెంట్స్-గుర్రానికి గంతలు కట్టినట్లి అంటూ!

హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన 'నశా ముక్త్ భారత్' అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి సినీ రంగంలో అవకాశాల కోసం తాను ఎదుర్కొన్న ఒత్తిళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువత మత్తుపదార్థాలు, వ్యసనాలకు దూరంగా ఉండి కెరీర్‌పై దృష్టి పెట్టాలని పిలుపునిస్తూ, 48 ఏళ్ల నాటి తన చెన్నై జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

పాండీ బజార్‌లో ఎదురైన చేదు అనుభవం

1970వ దశకం చివరలో మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకుంటున్న రోజులను చిరంజీవి వేదికపై నుంచి వివరించారు. "48 ఏళ్ల క్రితం ప్రసాద్ అనే 22 ఏళ్ల యువకుడు హీరో కావాలనే కలతో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు" అంటూ తన ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. ఒకరోజు సాయంత్రం తన స్నేహితుడితో కలిసి చెన్నైలోని పాండీ బజార్‌కు టీ తాగడానికి వెళ్లినప్పుడు అక్కడ కొందరు జూనియర్ ఆర్టిస్టులు తారసపడ్డారని చెప్పారు.

"సినిమా నటులు, సిబ్బంది చాలామంది అక్కడ సమయం గడిపేవారు. నన్ను చూసి కాస్త కంగారుగా ఉన్నానని భావించి, రిలాక్స్ అవ్వడానికి బీర్ తాగమని అడిగారు" అని చిరంజీవి వెల్లడించారు. తనకు మద్యం అలవాటు లేదని చెప్పగా, ఇండస్ట్రీలో ఇవన్నీ చాలా సాధారణమని వారు అన్నట్లు తెలిపారు.

ఆ సంభాషణ సాగిన తీరు తనకు ఎంతో ఇబ్బంది కలిగించిందని, దాంతో వెంటనే పాండీ బజార్ నుంచి బయటకు వచ్చేశానని చిరంజీవి చెప్పారు. ఆ తర్వాత సినీ పరిశ్రమకు చెందిన ఒక పెద్దాయన తనకు విలువైన సలహా ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.

"అలాంటి ప్రదేశాలకు తరచూ వెళ్లడం, తోటి వారి ఒత్తిడికి లొంగడం వల్ల మద్యానికి లేదా అంతకంటే చెడు అలవాట్లకు బానిసయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అనుకున్నది సాధించాలంటే గుర్రానికి గంతలు కట్టినట్లు కేవలం పని మీద, నటుడిగా ఎదగడం మీద మాత్రమే దృష్టి పెట్టాలని సూచించారు. ఆ మాటలు నాలో స్ఫూర్తి నింపాయి. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ పాండీ బజార్ వైపు వెళ్లలేదు. నా దృష్టంతా నా భవిష్యత్తు మీదే నిలిపాను. అందుకే ఇన్నేళ్ల తర్వాత ఈ రోజు మీ ముందు మెగాస్టార్‌గా నిలబడ్డాను" అని చిరంజీవి చెప్పగానే సభ అంతా కరతాళ ధ్వనులతో మారుమోగింది.

చిరంజీవి సినీ ప్రస్థానం.. రాబోయే ప్రాజెక్టులు

కొణిదెల శివశంకర వరప్రసాద్ రావుగా జన్మించిన చిరంజీవి చెన్నైలోని మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో మెళకువలు నేర్చుకున్నారు. 1978లో కె. వాసు దర్శకత్వంలో వచ్చిన 'ప్రాణం ఖరీదు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆయన, 1981లో కె. బాలచందర్ తెరకెక్కించిన '47 నాట్కల్' ద్వారా తమిళ ప్రేక్షకులను పలకరించారు.

1980లో ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు. వీరికి సుష్మిత, శ్రీజ అనే ఇద్దరు కుమార్తెలు, అగ్ర కథానాయకుడు రామ్ చరణ్ సంతానం. ఇటీవల 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంతో అలరించిన చిరంజీవి, ప్రస్తుతం 'విశ్వంభర', 'కాకా' సినిమాలతో బిజీగా ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా 'మెగావర్స్' అనే టాక్ షోకు కూడా చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks