...
...
Next Story

Chiranjeevi: మురళీ మోహన్‌ను ఇంత అగ్రెసివ్‌గా నేనెప్పుడు చూడలేదు.. అనన్య నాగళ్ల మూవీపై మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్

Megastar Chiranjeevi About Murali Mohan The Breaking News: నటుడు మురళి మోహన్ పాత్రపై మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ది బ్రేకింగ్ న్యూస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిరంజీవి విడుదల చేశారు. ఈ సినిమాలో మురళీ మోహన్‌తోపాటు తెలుగు బ్యూటిపుల్ హీరోయిన్ అనన్య నాగళ్ల నటిస్తోంది.

Published on: Apr 18, 2026, 12:02:15 IST
Advertisement

Chiranjeevi On Murali Mohan The Breaking News: మీడియా నేపథ్యంతో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “ది బ్రేకింగ్ న్యూస్”. తాజాగా ది బ్రేకింగ్ న్యూస్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్‌మెంట్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ప్రముఖ నటుడు మురళీ మోహన్, బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్య నాగళ్ల, వాసుదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా

మురళీ మోహన్‌ను ఇంత అగ్రెసివ్‌గా నేనెప్పుడు చూడలేదు.. అనన్య నాగళ్ల మూవీపై మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్
మురళీ మోహన్‌ను ఇంత అగ్రెసివ్‌గా నేనెప్పుడు చూడలేదు.. అనన్య నాగళ్ల మూవీపై మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్

ది బ్రేకింగ్ న్యూస్ చిత్రానికి పవన్ కడియాల రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి, ఉమ గుటూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే, ది బ్రేకింగ్ న్యూస్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం (ఏప్రిల్ 17) టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. “ఈ సినిమాను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మురళీ మోహన్ గారిని ఇంత అగ్రెసివ్‌గా, ఆగ్రహభరితమైన పాత్రలో నేను ఎప్పుడూ చూడలేదు” అని తెలిపారు. అలాగే అనన్య నాగళ్ల నటనను కూడా మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. దర్శకుడు పవన్ కడియాల ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తికరంగా, విభిన్నంగా తెరకెక్కించినట్లు చిరు పేర్కొన్నారు.

మీడియా నేపథ్యంతో కూడిన థ్రిల్లర్

చిత్ర బృందం తెలిపిన వివరాల ప్రకారం, “ది బ్రేకింగ్ న్యూస్” ఒక మీడియా నేపథ్యంతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ది బ్రేకింగ్ న్యూస్ సినిమాను 2026 మే నెలలో థియేటర్లలో విడుదల చేయాలని యోచిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపం చూపించడానికి సిద్ధమవుతున్నారు. భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, మెగా అభిమానుల్లో అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

చిరంజీవి కెరీర్‌లో 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'అంజి' వంటి సోషియో ఫాంటసీ చిత్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత దర్శకుడు వశిష్ట ('బింబిసార' ఫేమ్) చిరును అద్భుతమైన ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి భీమవరం కుర్రాడిగా కనిపిస్తూనే, మరోవైపు అద్భుత శక్తులతో కూడిన లోకంలో పోరాడే యోధుడిగా అలరించనున్నారు.

ఆస్కార్ స్థాయి సాంకేతిక నిపుణులు

ఈ చిత్రానికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కోసం ఆస్కార్ స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం కానుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత చిరంజీవి సరసన త్రిష నటిస్తుండటం ఈ సినిమాపై క్రేజ్ పెరగడానికి మరో కారణం. వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై ఎలా ఉండబోతోందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన విశ్వంభర ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాను ఊపేశాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ విశ్వంభర చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe