Mohan Babu About Srikanth Odela Nani The Paradise: బాక్సాఫీస్ వద్ద తాండవం చేస్తున్న నేచురల్ స్టార్ నాని సినిమా ‘ది ప్యారడైజ్’. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
ది ప్యారడైజ్ సక్సెస్ మీట్

ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ భారీ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అదిరిపోయే కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. మొదటి నుంచి వచ్చిన నెగెటివిటీ పోయి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ది ప్యారడైజ్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
మీడియా ములాఖాత్‌లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడుతూ.. "అందరికీ హృదయపూర్వక వందనాలు, ఆశీస్సులు. నిర్మాత సుధాకర్ గారు ఎక్కడా కూడా డబ్బుకి వెనకాడకుండా ఈ సినిమా చేశారు. ఆ భగవంతుడు ఆయనకు విజయాన్ని ఇచ్చాడు" అని అన్నారు.
దాసరిపై ఇలాగే నమ్మకం పెట్టుకునేవారు
"దర్శకుడిపై భారం వేసి, సినిమాను నిర్మించిన వాళ్లలో ఒకరిద్దరినే చూశా. మా గురువుగారు దాసరి గారు కూడా ఇలాగే నిర్మాతలు నమ్మకం పెట్టుకునేవారు. ఇప్పుడు శ్రీకాంత్‌పై సుధాకర్ చెరుకూరి అదే నమ్మకం ఉంచారు. సుధాకర్ లాంటి నిర్మాత సినిమా పరిశ్రమకు కావాలి. నిర్మాత ఆయన పదికాలాలపాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను" అని మోహన్ బాబు కోరారు.
"దర్శకుడు శ్రీకాంత్ ఈ కథని నాకు చాలా ధైర్యంగా చెప్పాడు. చాలా సులువుగా అర్థమయ్యేలాగా అద్భుతంగా చెప్పాడు. నా సుదీర్ఘ సినీ కెరీర్‌లో 500లకు పైగా చిత్రాల్లో నటించాను కానీ, సికంజా మాలిక్‌లాంటి భయంకరమైన పాత్ర చేయడం నా లైఫ్‌లో ఫస్ట్ టైం. నన్ను ఇంత భయంకరంగా చూపిస్తాడని అనుకోలేదు" అని మోహన్ బాబు తెలిపారు.
ఎక్కువ టేకులు తీసుకున్న డైరెక్టర్ ఇతనే
"నా లైఫ్‌లో ఎక్కువ టేకులు తీసుకున్న దర్శకుడు శ్రీకాంత్. మా గురువుగారు దాసరి నారాయణరావు గారు కూడా చాలా టేకులు తీసుకునేవారు. “నువ్వు చేసినవన్నీ బాగున్నాయి. కానీ ఇంకా అద్భుతంగా వస్తుందని” చెప్పేవారు. శ్రీకాంత్‌తో పనిచేస్తున్నప్పుడు నాకు మా గురువుగారు గుర్తొచ్చారు" అని మోహన్ బాబు తన గురువును గుర్తు చేసుకున్నారు.
{{/usCountry}}"నా లైఫ్‌లో ఎక్కువ టేకులు తీసుకున్న దర్శకుడు శ్రీకాంత్. మా గురువుగారు దాసరి నారాయణరావు గారు కూడా చాలా టేకులు తీసుకునేవారు. “నువ్వు చేసినవన్నీ బాగున్నాయి. కానీ ఇంకా అద్భుతంగా వస్తుందని” చెప్పేవారు. శ్రీకాంత్‌తో పనిచేస్తున్నప్పుడు నాకు మా గురువుగారు గుర్తొచ్చారు" అని మోహన్ బాబు తన గురువును గుర్తు చేసుకున్నారు.
{{/usCountry}}"శ్రీకాంత్ ఎక్స్‌ట్రార్డినరీ డైరెక్టర్. పాత్రని ఆ పాత్రగానే చూశాడు. ఒక నటుడిగా తనలో ఉన్న టాలెంట్‌ని చూసి గర్వించాను. తను దర్శకుడిగా ఇప్పటికే నిరూపించుకున్నాడు. తను దేశంలోనే టాప్ డైరెక్టర్ అవుతాడు. సినిమా పరిశ్రమ అందరిదీ. ఎవరికి ప్రతిభ ఉంటే వాళ్లని ముందుకు తీసుకెళుతుంది. శ్రీకాంత్‌ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను" అని మంచు మోహన్ బాబు పేర్కొన్నారు.
నాని పడిన కష్టం భగవంతుడికే తెలుసు
"ఈ సినిమాలో నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ అద్భుతంగా చేశారు. నానిని నేను ఎంతో అభిమానిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. ఒక నటుడిగా గౌరవిస్తున్నాను. ఈ సినిమాలో నాని పడిన కష్టం ఆ భగవంతుడికే తెలుసు. ప్రజలు ఆశీర్వదించారు. ‘ప్యారడైజ్’ సూపర్ డూపర్ హిట్ అయింది" అని మోహన్ బాబు అన్నారు.
"నాని గొప్ప కళాకారుడు. ‘దసరా’లో ఒక రకంగా చేశాడు. ‘ప్యారడైజ్’లో అందుకు పూర్తి భిన్నంగా చేశాడు. జడలు వేసుకోవడం మామూలు విషయం కాదు. తనతో ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఆ జడలు పట్టుకున్నప్పుడు తనకు ఎంతో బాధ కలిగింది. అది నాకు తెలుసు" అని మోహన్ బాబు వెల్లడించారు.
ప్రతి షాట్ అద్భుతంగా చేశాడు
"నాని ఇంకా ఎన్నో గొప్ప విజయాలు సాధించాలని మనసా వాచా కోరుకుంటున్నాను, ఈ స్నేహం కలకాలం ఉండాలి. తను ప్రతి షాట్‌ని అద్భుతంగా చేశాడు. టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్" అని మోహన్ బాబు తన స్పీచ్ ముగించారు.