Mohanlal Declares 10 Elephant 13 Tusks Ivory Idols: మలయాళ చిత్ర పరిశ్రమలో 'కంప్లీట్ యాక్టర్'గా గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ మోహన్ లాల్ చుట్టూ ఏనుగు దంతాల వివాదం మరోసారి ముదిరింది. చట్టవిరుద్ధంగా ఏనుగు దంతాలు ఇంట్లో ఉంచుకున్నారనే ఆరోపణలపై ఆయన ఇప్పటికే కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు.
10 ఏనుగు దంతాలు

ఇలాంటి ఉత్కంఠభరిత సమయంలో కేరళ అటవీ శాఖకు మోహన్ లాల్ ఒక కీలక నివేదిక ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వైల్డ్‌లైఫ్ అమ్నెస్టీ (స్వచ్ఛంద వెల్లడి) పథకం కింద తన వద్ద మొత్తం 10 ఏనుగు దంతాలు, 13 ఐవరీ (ఏనుగు దంతాలతో చేసిన) విగ్రహాలు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పరిణామం ఇటు సినీ పరిశ్రమతో పాటు అటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది.
సాధారణంగా వన్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం ఏనుగు దంతాలను గానీ, వాటితో చేసిన వస్తువులను గానీ సరైన లైసెన్స్ లేకుండా ఇంట్లో ఉంచుకోవడం నేరం. సౌత్ ఇండియాలోనే కాకుండా దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులున్న మోహన్ లాల్ లాంటి పెద్ద నటుడు ఈ వివాదంలో చిక్కుకోవడం తీవ్ర సంచలనం రేపుతోంది.
మలయాట్టూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో మోహన్ లాల్ కేవలం నాలుగు ఏనుగు దంతాల వివరాలను మాత్రమే వెల్లడించారు. తాజాగా మరో ఆరు దంతాలతో పాటు భారీగా విగ్రహాల వివరాలను కూడా అటవీ శాఖకు సమర్పించారు.
46 కిలోల బరువున్న దేవతా విగ్రహాలు
ఈ కొత్త డిక్లరేషన్‌లో మోహన్ లాల్ ఇచ్చిన వివరాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఏనుగు దంతాలతో తయారు చేసిన 13 విగ్రహాలు తన ఇంట్లో ఉన్నట్లు ఆయన ఒప్పుకున్నారు. ఇందులో శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, తిరుపతి వేంకటేశ్వరస్వామి వంటి హిందూ దేవతల ప్రతిమలు ఉన్నాయి.
{{/usCountry}}ఈ కొత్త డిక్లరేషన్‌లో మోహన్ లాల్ ఇచ్చిన వివరాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఏనుగు దంతాలతో తయారు చేసిన 13 విగ్రహాలు తన ఇంట్లో ఉన్నట్లు ఆయన ఒప్పుకున్నారు. ఇందులో శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, తిరుపతి వేంకటేశ్వరస్వామి వంటి హిందూ దేవతల ప్రతిమలు ఉన్నాయి.
{{/usCountry}}ఈ విగ్రహాల మొత్తం బరువు దాదాపు 46 కిలోల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ దంతాలు, విగ్రహాలు తనకు వారసత్వంగా వచ్చాయని, మరికొన్నింటిని ఇతరులు బహుమతులుగా ఇచ్చారని మోహన్ లాల్ మొదటి నుంచి వాదిస్తున్నారు.
డీఎన్ఏ టెస్టులు
"ఈ దంతాలు, విగ్రహాల నిజ స్వరూపాన్ని, అవి ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాన్ని తేల్చడానికి వీటికి డీఎన్ఏ (DNA) పరీక్షలు నిర్వహిస్తాం" అని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్నెస్టీ స్కీమ్ ప్రకారం.. అనుమతులు లేని వన్యప్రాణుల వస్తువులను కలిగి ఉన్నవారు వాటిని స్వచ్ఛందంగా అధికారుల ముందు వెల్లడిస్తే, ఎలాంటి క్రిమినల్ చర్యలు లేకుండా క్రమబద్ధీకరించుకునే అవకాశం లభిస్తుంది.
2011 నాటి ఐటీ రైడ్‌తో మొదలైన వివాదం
ఈ వివాదానికి దారితీసిన నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 2011లో ఐటీ అధికారులు మోహన్‌లాల్ నివాసాలపై అకస్మాత్తుగా దాడులు చేశారు. ఆ సమయంలోనే ఆయన ఇంట్లో ఎలాంటి అనుమతులు లేని ఏనుగు దంతాలు, విలువైన కళాఖండాలు బయటపడ్డాయి. దీంతో అటవీ శాఖ రంగంలోకి దిగి చట్టపరమైన అనుమతులు లేకుండా రెండు జతల ఏనుగు దంతాలను దాచారనే నెపంతో మోహన్ లాల్‌పై కేసు నమోదు చేసింది. ఆనాటి నుంచి ఈ కేసు నలుగుతూనే ఉంది.
వెనక్కి తగ్గేదే లేదన్న హైకోర్టు
ఈ కేసు నుంచి మోహన్ లాల్‌కు ఊరటనిచ్చేందుకు కేరళ ప్రభుత్వం గతంలో గట్టిగానే ప్రయత్నించింది. ఆయనపై ఉన్న ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకోవాలని కోర్టును కోరింది. కానీ, ట్రయల్ కోర్ట్ ప్రభుత్వ అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఆ తర్వాత ఈ వివాదం కేరళ హైకోర్టుకు చేరింది.
ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు కూడా సంచలన తీర్పునిచ్చింది. మోహన్ లాల్‌పై క్రిమినల్ విచారణ కొనసాగాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాదు, గతంలో ప్రభుత్వం ఆయనకు ఇచ్చిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్లను (యాజమాన్య హక్కులు) కూడా ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది.
కఠిన శిక్షల నుంచి తప్పించుకోడానికి
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్నెస్టీ పథకం ద్వారా పెనాల్టీలు, కఠిన శిక్షల నుంచి తప్పించుకోవడానికి మోహన్ లాల్ ఈ సరికొత్త డిక్లరేషన్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది.