Mrigaya 1.5 The Hunt Continues OTT Teaser Released: బెంగాలీ సినిమా ఇండస్ట్రీలో విలక్షణమైన క్రైమ్ థ్రిల్లర్లతో గుర్తింపు తెచ్చుకున్న 'మృగయ' ఫ్రాంచైజీ నుంచి కొత్త చాప్టర్ సిద్ధమైంది. సస్పెన్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఘట్టాలతో తెరకెక్కిన 'మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్' టీజర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు.
పూర్తిస్థాయి రియలిస్టిక్ యాక్షన్ విజువల్స్

ప్రఖ్యాత దర్శకుడు అభిరూప్ ఘోష్ మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్ చిత్రాన్ని పూర్తిస్థాయి రియలిస్టిక్ యాక్షన్ విజువల్స్‌తో తీర్చిదిద్దారు. అక్టోబర్ 30న విడుదలైన మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్ టీజర్ ఇప్పుడు ఆకట్టుకుంటోంది.
నయా నేరాలు.. నగరంలో విధ్వంసం
కోల్‌కతా వీధుల్లో జరిగే దారుణమైన నేరం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నగరంలో ఒక ఘోరమైన హత్య జరగడంతో ఆ కేసును ఛేదించే బాధ్యతను ఆఫీసర్ డెబాంజన్ దత్తా భుజస్కంధాలపై వేసుకుంటారు. విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ తప్పుదోవ పట్టించే ఆధారాలు, ఊహించని మలుపులు పోలీసులకు సవాలుగా మారతాయి.
ఈ నేరం వెనుక ఒక భయంకరమైన గ్యాంగ్ ప్రమేయం ఉందని గ్రహించిన పోలీసు బృందం, వారిని పట్టుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడుతుంది. ఈ క్రమంలో కోల్‌కతా మహానగరం మొత్తం గ్యాంగ్స్టర్లు, పోలీసుల మధ్య జరుగుతున్న రణరంగంగా మారుతుంది.
గూస్బంప్స్ యాక్షన్ సీక్వెన్స్, నయా స్టార్ కాస్టింగ్
2025లో వచ్చి విశేష ఆదరణ పొందిన 'మృగయ: ది హంట్' చిత్రానికి స్పిన్-ఆఫ్‌గా ఈ 1.5 వెర్షన్ రాబోతోంది. మొదటి భాగంలో సోనాగాచి ప్రాంతంలో జరిగిన హత్య కేసు ఇన్వెస్టిగేషన్‌ను చూపించగా, ఈసారి పరిధిని మరింత పెంచారు.
రిత్విక్ చక్రవర్తి ఆఫీసర్ డెబాంజన్ దత్తాగా తిరిగి వస్తుండగా, ఏసీపీ అగ్నీశ్వర్ ఛటర్జీ పాత్రలో మీర్ అఫ్సర్ అలీ, జయితా సేన్ పాత్రలో కౌషానీ ముఖర్జీ కొత్తగా టీమ్‌లోకి చేరారు. అనన్య భట్టాచార్య, అర్పణ్ ఘోషాల్, అరిత్ర దత్తా బనిక్, సోహిణి గుహ రాయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఫొరెన్సిక్ ట్విస్టులు
{{/usCountry}}రిత్విక్ చక్రవర్తి ఆఫీసర్ డెబాంజన్ దత్తాగా తిరిగి వస్తుండగా, ఏసీపీ అగ్నీశ్వర్ ఛటర్జీ పాత్రలో మీర్ అఫ్సర్ అలీ, జయితా సేన్ పాత్రలో కౌషానీ ముఖర్జీ కొత్తగా టీమ్‌లోకి చేరారు. అనన్య భట్టాచార్య, అర్పణ్ ఘోషాల్, అరిత్ర దత్తా బనిక్, సోహిణి గుహ రాయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఫొరెన్సిక్ ట్విస్టులు
{{/usCountry}}"మొదటి భాగం కంటే ఈ చిత్రంలో విజువల్స్, ఫొరెన్సిక్ ట్విస్టులు, గూస్బంప్స్ తెప్పించే యాక్షన్ సన్నివేశాలు వేగంగా సాగుతాయి" అని మేకర్స్ వెల్లడించారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ కంటే ప్రాక్టికల్ యాక్షన్‌కే ఈ చిత్రంలో ప్రాధాన్యతనిచ్చారు.
థియేటర్ కాకుండా నేరుగా ఓటీటీలోకి
ముందుగా మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, తాజాగా మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం 'జీ5' (ZEE5) మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది.
ఈ లెక్కన జీ5లో మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్ ఓటీటీ రిలీజ్ కానుందన్నమాట. నవంబర్ 13 నుంచి నేరుగా జీ5లో మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
జీ5 ఓటీటీలో
అయితే, ఈ కొత్త కథలోకి వెళ్లేముందు మొదటి భాగాన్ని చూడాలనుకునే ప్రేక్షకుల కోసం 2025లో వచ్చిన 'మృగయ: ది హంట్' కూడా ప్రస్తుతం జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్, మిస్టరీ థ్రిల్లర్లను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు 'మృగయ 1.5' సరికొత్త అనుభూతిని అందించనుంది.