Mrunal Thakur: ఆ సీన్లు థ్రిల్లింగ్‌గా ఉంటాయి.. చాలా ఎంజాయ్ చేశాను.. నా ఇమేజ్ పూర్తిగా మార్చేసే మూవీ: డెకాయిట్‌పై మృణాల్
Mrunal Thakur: అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్' ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా తన పాత్ర గురించి, షూటింగ్ విశేషాల గురించి మృణాల్ పంచుకున్న ఆసక్తికర విషయాలు మీకోసం.
మృణాల్ ఠాకూర్ ఇప్పుడు రూటు మార్చింది. సున్నితమైన భావోద్వేగాల నుంచి పవర్‌ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి మారిపోయింది. అడివి శేష్ హీరోగా.. షానీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన 'డెకాయిట్' (Dacoit) మూవీ ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో మృణాల్.. 'సరస్వతి' అనే డెకాయిట్ పాత్రలో నటించింది. ఈ సందర్భంగా ఆమె జర్నలిస్టులతో ముచ్చటించి, సినిమా విశేషాలను పంచుకుంది.
'సరస్వతి' పాత్రను ఎంచుకోవడానికి కారణం ఏమిటి?
ఈ కథలో నన్ను బాగా ఆకట్టుకుంది అందులోని ఎమోషనల్ జర్నీ. సరస్వతి పాత్ర చాలా లోతైనది. సాధారణ మనుషులు డెకాయిట్లుగా ఎందుకు మారాల్సి వచ్చింది అనే కోణాన్ని ఈ డెకాయిట్ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు.. దీని వెనుక ఒక విభిన్నమైన ప్రేమకథ ఉంది. అదే నన్ను ఈ ప్రాజెక్ట్ వైపు నడిపించింది.
మీ గత పాత్రలతో పోలిస్తే ఇది ఎంత భిన్నంగా ఉండబోతోంది?
నిజం చెప్పాలంటే సరస్వతి పాత్ర నా కెరీర్‌లోనే అత్యంత సవాలుతో కూడుకున్నది. ఇప్పటి వరకు ప్రేక్షకులు నన్ను ఎమోషనల్ రోల్స్ లో చూశారు. కానీ ఇందులో యాక్షన్ తో పాటు ఒక రకమైన ఇంటెన్సిటీ ఉంటుంది. ఒక నటిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఈ సినిమా గొప్ప అవకాశం ఇచ్చింది.
యాక్షన్ సీక్వెన్స్ చేసిన అనుభవం ఎలా ఉంది?
నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ సినిమాలో ఛేజింగ్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. అయితే కొన్ని సీన్లు చాలా రిస్క్‌తో కూడుకున్నవి. ముఖ్యంగా హై-ప్రెషర్ ఉన్న సమయంలో ఒక అంబులెన్స్‌ను డ్రైవ్ చేస్తూ చేసే యాక్షన్ సీన్లు థ్రిల్లింగ్‌గా అనిపించాయి.
సీతారామం 'సీత'కు, ఇందులోని 'సరస్వతి'కి పోలిక ఉందా?
అస్సలు లేదు. 'సీతారామం'లో చూసిన మృణాల్‌కు, 'డెకాయిట్'లో చూసే మృణాల్‌కు చాలా చాలా తేడా ఉంటుంది. ప్రేక్షకులు నన్ను ఒక ఇమేజ్‌లో చూస్తూ వస్తున్నారు. కానీ ఈ సినిమా ఆ ఇమేజ్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ఆ సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని నా నమ్మకం.
అడివి శేష్, అనురాగ్ కశ్యప్‌లతో పని చేయడం ఎలా అనిపించింది?
శేష్ సినిమా పట్ల ఎంతో అంకితభావం ఉన్న వ్యక్తి. మేకింగ్‌లో ప్రతి విషయాన్ని ఆయన దగ్గరుండి చూసుకుంటారు. ఆయనతో కలిసి నటించడం నాకు ఒక స్ఫూర్తిని ఇచ్చింది. ఇది శేష్ కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాగే అనురాగ్ కశ్యప్ గారు చాలా వెర్సటైల్ నటుడు. సినిమాలో ఆయన పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుంది.
రెండు భాషల్లో (తెలుగు, హిందీ) షూటింగ్ చేయడం కష్టంగా అనిపించిందా?
ఒకేసారి రెండు భాషల్లో నటించడం కాస్త కష్టమే. కానీ అది ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. ప్రతి సీన్‌ను రెండుసార్లు చేయాల్సి వచ్చినప్పుడు ఏకాగ్రత ఎక్కువగా ఉండాలి. అందుకే ఈ ప్రయాణం నాకు మరింత ప్రత్యేకం. ఇక సంగీతం విషయానికొస్తే.. ఇప్పటికే విడుదలైన 'రూబారూ' (Rubaroo) సాంగ్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. విజువల్ గా కూడా సినిమా చాలా ఫ్రెష్‌గా ఉండబోతోంది. డెకాయిట్ ఒక కంప్లీట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని నా నమ్మకం.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper












