టాలీవుడ్ ప్రేక్షకులకు 'సీతా రామం' సినిమాతో చేరువైన బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. దానికి కారణం ఆమె సినిమాలు కాదు.. ఆమె పెళ్లి గురించి వస్తున్న పుకార్లు అని తెలిసిందే.
ధనుష్‌తో వివాహం

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14న) మృణాల్ ఠాకూర్ వివాహం చేసుకోనుందంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే ఆ రోజు గడిచిపోయినా మృణాల్ ఠాకూర్ మాత్రం ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నారు. దీంతో అవి రూమర్స్‌గా మిగిలిపోయాయి.
వదంతులు చూసి నవ్వుకున్నా!
అయితే, వాలంటైన్స్ డే రోజున ధనుష్‌తో తన పెళ్లి అనే పుకార్లపై ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మనసు విప్పి మాట్లాడారు. "అవును, వాళ్ల (సోషల్ మీడియా) ప్రకారం నా పెళ్లి జరిగిపోతోంది. ఇలాంటి వార్తలు చూసినప్పుడు నాకు నవ్వొస్తుంది" అని మృణాల్ ఠాకూర్ తెలిపారు.
కోట్లు ఖర్చు పెట్టిన ఇంత రాదు
"నా వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారం చూసి నేను అస్సలు విసుగు చెందను. నిజానికి, నేను కోట్లు ఖర్చు పెట్టి పీఆర్ (PR) టీమ్‌ను పెట్టుకున్నా నాకు ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు. అందుకే నా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారందరికీ పెద్ద థాంక్స్" అని చమత్కరించారు మృణాల్ ఠాకూర్.
పెళ్లి ఒత్తిడిపై మృణాల్
తన జీవితంలో ఏదైనా విశేషం ఉంటే తానే స్వయంగా బయటపెడతానని మృణాల్ స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల నుంచి పెళ్లి ఒత్తిడి ఉందా? అని అడిగినప్పుడు మృణాల్ ఠాకూర్ ఇచ్చిన సమాధానం ఇంట్రెస్టింగ్గా ఉంది.
సన్యాసిలా బతకడం లాంటిదే
{{/usCountry}}తన జీవితంలో ఏదైనా విశేషం ఉంటే తానే స్వయంగా బయటపెడతానని మృణాల్ స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల నుంచి పెళ్లి ఒత్తిడి ఉందా? అని అడిగినప్పుడు మృణాల్ ఠాకూర్ ఇచ్చిన సమాధానం ఇంట్రెస్టింగ్గా ఉంది.
సన్యాసిలా బతకడం లాంటిదే
{{/usCountry}}"సెటిల్ అయిపోమని వాళ్లు అడుగుతూనే ఉంటారు. కానీ, ఒక నటిగా కెరీర్‌ను బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టమో నా కుటుంబానికి తెలుసు. ముఖ్యంగా సౌత్ సినిమాలతో పాటు హిందీ సినిమాల్లో నటించడం తేలికైన విషయం కాదు. తిండి, నిద్ర వదిలేసి పని మీదే శ్రద్ధ పెట్టాలి. అది ఒక రకంగా సన్యాసిలా బతకడం లాంటిదే" అని మృణాల్ తన వృత్తిలోని కష్టాలను వివరించారు.
మృణాల్ ఠాకూర్ మూవీ
ప్రస్తుతం కెమెరాతోనే తన ప్రేమాయణం సాగుతోందని మృణాల్ ఠాకూర్ చమత్కరించారు. ఇకపోతే మృణాల్ ఠాకూర్ నటించిన తాజా చిత్రం ‘దో దీవానే షెహర్ మే’ (Do Deewane Seher Mein) ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల కానుంది.
అరేంజ్‌డ్ మ్యారేజ్ కోసం
ఇందులో ఆమె సిద్ధాంత్ చతుర్వేది సరసన నటించారు. సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన ఈ చిత్రానికి రవి ఉద్యావర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ అరేంజ్‌డ్ మ్యారేజ్ కోసం ప్రయత్నించే ఒక ఆధునిక యువతి పాత్రలో కనిపించనున్నారు.