సోషల్ మీడియాలో గత కొన్ని నెలలుగా కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే తన లేటస్ట్ మూవీ 'దో దీవానే సెహెర్ మే' (Do Deewane Seher Mein) ప్రమోషన్స్‌లో భాగంగా ‘మిర్చి ప్లస్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మృణాల్ ఈ రూమర్లకు చెక్ పెడుతూ అసలు నిజం ఏంటో బయటపెట్టింది.
డేటింగ్ పుకార్లు ఇలా మొదలు

గతేడాది జులైలో ఆనంద్ ఎల్ రాయ్, కృతి సనన్ తో కలిసి ధనుష్ నటిస్తున్న 'తేరే ఇష్క్ మే' సినిమా రాపప్ పార్టీకి మృణాల్ ఠాకూర్ హాజరైంది. ఆ తర్వాత ఆగస్టులో మృణాల్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' (Son of Sardaar 2) మూవీ ప్రీమియర్‌కు ధనుష్ ముఖ్య అతిథిగా వచ్చాడు. వీరిద్దరూ ఇలా ఒకరి ఈవెంట్లకు ఒకరు హాజరుకావడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఇవి కాస్తా ముదిరిపోయి ఏకంగా ఈ ఏడాది వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) రోజున ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది.
ఆ ప్రీమియర్‌కు ధనుష్ ఎందుకొచ్చాడంటే?
ధనుష్ తన ప్రీమియర్‌కు ఎందుకు వచ్చాడో వివరిస్తూ మృణాల్ అతనిపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. "నేను ధనుష్ సార్‌కి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన నటించిన రాయన్, మారి, రాంఝనా, కెప్టెన్ మిల్లర్ సినిమాలు చూశాను. ముఖ్యంగా 'అసురన్' సినిమాను ఎన్నిసార్లైనా చూడొచ్చు. ఆయన నటన అద్భుతం. ఇతర నటుల నుంచి కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ రాబట్టగల సత్తా ఆయన సొంతం" అని ప్రశంసించింది.
కేవలం నటుడిగానే కాకుండా ఒక ఫెంటాస్టిక్ లిరిసిస్ట్, సింగర్, డాన్సర్, డైరెక్టర్‌గా ధనుష్‌ను మృణాల్ కొనియాడింది. "'తేరే ఇష్క్ మే' షూటింగ్ సమయంలో నేను సరదాగా.. సార్, మా 'సన్ ఆఫ్ సర్దార్ 2' స్క్రీనింగ్‌కు రాగలరా? అని అడిగాను. ఆయన వస్తారని నేను అస్సలు అనుకోలేదు. కానీ నిజంగానే ఆయన రావడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. భవిష్యత్తులో ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను" అని మృణాల్ వివరించింది.
ఫిబ్రవరి 14న పెళ్లి వార్తలపై స్పందన
{{/usCountry}}కేవలం నటుడిగానే కాకుండా ఒక ఫెంటాస్టిక్ లిరిసిస్ట్, సింగర్, డాన్సర్, డైరెక్టర్‌గా ధనుష్‌ను మృణాల్ కొనియాడింది. "'తేరే ఇష్క్ మే' షూటింగ్ సమయంలో నేను సరదాగా.. సార్, మా 'సన్ ఆఫ్ సర్దార్ 2' స్క్రీనింగ్‌కు రాగలరా? అని అడిగాను. ఆయన వస్తారని నేను అస్సలు అనుకోలేదు. కానీ నిజంగానే ఆయన రావడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. భవిష్యత్తులో ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను" అని మృణాల్ వివరించింది.
ఫిబ్రవరి 14న పెళ్లి వార్తలపై స్పందన
{{/usCountry}}గతంలోనే గలాటా ప్లస్ కి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో తన పెళ్లి వార్తలపై స్పందించిన మృణాల్.. పుకార్లను పూర్తిగా కొట్టిపారేసింది. "నేనా? లేదు. వాళ్లు చెప్పేది చూస్తుంటే ఫిబ్రవరి 14 కాస్త ఏప్రిల్ 1లా అనిపిస్తోంది. అసలు ఇదంతా ఎవరు మొదలుపెట్టారో నాకు తెలియదు. నేను ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వకపోయినా నా పేరు మీద ఏవేవో రాసేశారు. అది చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. ఇది భయంగా కూడా ఉంది" అని పేర్కొంది.
తనకు ఇష్టమైతే వచ్చే ఏడాది వివాహం చేసుకుంటానని, కానీ ఆలోపు తాను నెరవేర్చుకోవాల్సిన ఒక బకెట్ లిస్ట్ ఉందని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేసింది. సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి మృణాల్ నటించిన 'దో దీవానే సెహెర్ మే' సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలైంది.