మెట్రోలో హీరో స్టంట్స్‌- సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చిన మెట్రో కార్పోరేష‌న్- వీడియో వైర‌ల్‌

ముంబై మెట్రోలో పుల్-అప్స్ చేసిన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌కు మెట్రో అధికారులు భద్రతాపరమైన సీరియస్ హెచ్చరిక జారీ చేశారు. ఇలాంటి చర్యలు చట్టరీత్యా శిక్షార్హమని గుర్తు చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

Published on: Jan 27, 2026, 06:10:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ హీరో వరున్ ధావన్ తన లేటెస్ట్ మూవీ బోర్డర్ 2 విజయంతో మంచి జోష్ మీదున్నాడు. కానీ అతని ఉత్సాహానికి ఎండ్ కార్డు వేస్తూ ముంబై మెట్రో సీరియస్ వార్నింగ్ జారీ చేసింది. మెట్రో ట్రైన్ లో బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించింది. రైల్లో వరుణ్ ధావన్ స్టంట్స్ చేయడమే ఇందుకు కారణం.

మెట్రో రైల్లో వరుణ్ ధావన్ స్టంట్స్ (Instagram/official_mmmocl)
మెట్రో రైల్లో వరుణ్ ధావన్ స్టంట్స్ (Instagram/official_mmmocl)

మెట్రోలో వరుణ్ ధావన్

వరుణ్ ధావన్ ముంబై ట్రాఫిక్‌ను తప్పించుకుని, అభిమానులను ఆశ్చర్యపరిచేందుకు సినిమా హాల్‌కు మెట్రోలో ప్రయాణించాలని అనుకున్నాడు. ధావన్ ఇంతకుముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పర్యటనను టీజ్ చేశాడు. మెట్రో లోపలి నుండి ఒక స్టోరీని పోస్ట్ చేసి, ఏ థియేటర్‌కు వెళ్తున్నాడో ఊహించమని అడిగాడు. వెంటనే అతను రైల్లో పైనున్న మెటల్ రాడ్‌కు వేలాడుతూ తోటి ప్రయాణికులు సమీపంలో నిలబడి ఉండగా పుల్-అప్స్ చేశాడు.

మెట్రో కార్పోరేషన్ సీరియస్

మెట్రో రైల్లో వరుణ్ ధావన్ స్టంట్స్ వీడియోలు వైరల్ గా మారాయి. దీనిపై ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMMOCL) సీరియస్ అయింది. ఈ వీడియోను తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో రీషేర్ చేసింది. దానికి పాయింట్‌డ్ అడ్వైజరీని జతచేసింది. నటుడిని ఉద్దేశించి రాసిన క్యాప్షన్‌లో యాక్షన్ సినిమాలలో కనిపించే డిస్‌క్లైమర్‌ల మాదిరిగానే ఈ వీడియో కూడా ఉండాలని, మెట్రోలో అలాంటి ప్రవర్తనను అనుకరించవద్దని ప్రయాణికులను కోరాలని ఆ సంస్థ వ్యాఖ్యానించింది.

స్టంట్స్ కోసం కాదు

‘‘మెట్రో కోచ్‌లలో గ్రేబ్ హ్యాండిల్స్ వంటి ఫిక్చర్‌లు ప్రయాణికుల మద్దతు కోసం మాత్రమే ఉన్నాయి. ఫిజికల్ స్టంట్స్ కోసం కాదు. ది మెట్రో రైల్వేస్ (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) యాక్ట్, 2002లోని నిబంధనల ప్రకారం, ఇబ్బంది కలిగించే లేదా ప్రజా ఆస్తికి నష్టం కలిగించే చర్యలు శిక్షార్హం. తీవ్రతను బట్టి ఇలాంటి ఉల్లంఘనలు జరిమానాలు లేదా జైలు శిక్షకు కూడా దారితీయవచ్చు. హ్యాంగ్ అవుట్ చేయండి, కానీ అక్కడ వేలాడకండి’’ అని తన పోస్టులో వార్నింగ్ ఇచ్చింది ముంబై మెట్రో.

బోర్డర్ 2 గురించి

బోర్డర్ 2 సినిమాలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహన్ శెట్టి, మోనా సింగ్, సోనమ్ బజ్వా, ఆన్య సింగ్ తదితరులు నటించారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. జె.పి. దత్తా 1997 క్లాసిక్ మూవీ 'బోర్డర్'కి సీక్వెల్. ఇది 1971 ఇండో-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కింది. సక్నిల్క్ ప్రకారం బోర్డర్ 2 ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద రూ.158.61 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More