...
...
Next Story

హీరోయిన్ శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు బిగుసుకున్న ఉచ్చు- 60 కోట్ల ఫ్రాడ్ కేసులో అదనపు సెక్షన్- ఏడేళ్ల శిక్ష?

రూ. 60.4 కోట్ల మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన ఆర్థిక నేరాల విభాగం (EOW), తాజాగా వీరిపై ‘చీటింగ్’ సెక్షన్‌ను అదనంగా చేర్చింది.

Published on: Dec 18, 2025, 08:53:44 IST
Advertisement

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా దంపతులకు న్యాయపరమైన కష్టాలు మరింత పెరిగాయి. ముంబైలో నమోదైన రూ. 60 కోట్ల మనీ లాండరింగ్ (ఆర్థిక నేరం) కేసులో ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.

హీరోయిన్ శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు బిగుసుకున్న ఉచ్చు- 60 కోట్ల ఫ్రాడ్ కేసులో అదనపు సెక్షన్- ఏడేళ్ల శిక్ష?
హీరోయిన్ శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు బిగుసుకున్న ఉచ్చు- 60 కోట్ల ఫ్రాడ్ కేసులో అదనపు సెక్షన్- ఏడేళ్ల శిక్ష?

ఇప్పటివరకు ఉన్న సెక్షన్లకు తోడుగా, తాజాగా ఈ దంపతులపై 'చీటింగ్' (మోసం) అభియోగాలను కూడా మోపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు మరింత కష్టాలు తోడైనట్లు అయింది.

అసలేం జరిగింది? కొత్తగా చేర్చిన సెక్షన్లు ఏమిటి?

పోలీసు అధికారుల సమాచారం ప్రకారం.. ఈ హై ప్రొఫైల్ దంపతులపై గతంలో భారత శిక్షాస్మృతి (IPC) లోని సెక్షన్ 406 (నమ్మక ద్రోహం) కింద కేసు నమోదైంది. అయితే, ఈ కేసు దర్యాప్తులో వెలుగుచూసిన కీలక అంశాల ఆధారంగా ఇప్పుడు సెక్షన్ 420 (చీటింగ్ - ఆస్తుల విషయంలో నమ్మించి వంచించడం) కింద అదనపు చార్జీలను చేర్చారు.

దేశంలో కొత్త చట్టాలు (భారతీయ న్యాయ సంహిత - BNS) 2024, జూలై 1 నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ, ఈ కేసు అంతకంటే ముందే ఫైల్ కావడంతో పాత ఐపీసీ సెక్షన్ల ప్రకారమే విచారణ కొనసాగుతోంది. ఐపీసీ సెక్షన్ 420 కింద అభియోగాలు రుజువైతే, గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా పడే అవకాశం ఉంది.

కేసు నేపథ్యం ఇదే..

తమపై వస్తున్న తాజా అభియోగాలను రాజ్ కుంద్రా తీవ్రంగా ఖండించారు. తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ఈ విషయంపై ఆయన స్పందిస్తూ.. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేశారు.

"మాపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. కేవలం దురుద్దేశంతోనే ఇవి ప్రచారం చేయబడుతున్నాయి. ఎలాంటి చట్టబద్ధమైన ఆధారం లేకపోయినా, ఒక పౌర వివాదాన్ని క్రిమినల్ కేసుగా రంగు పులుముతున్నారు. దీనిపై ఇప్పటికే మేము గౌరవనీయ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశాము" అని రాజ్ కుంద్రా తెలిపారు.

సంయమనం పాటించాలి

"మేము దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నాము. న్యాయవ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది. కోర్టు పరిధిలో కేసు ఉన్నందున మీడియా సంయమనం పాటించాలని కోరుతున్నాను" అని రాజ్ కుంద్రా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతానికి ఈ వ్యవహారం ముంబై వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కోర్టు తీర్పు వెలువడే వరకు ఈ సెలబ్రిటీ దంపతులు ఊపిరి పీల్చుకునే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది.

కాగా, శిల్పా శెట్టి తెలుగులో మోహన్ బాబు, వెంకటేష్‌లతో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks