...
...
Next Story

OTT: రిపబ్లిక్ డే స్పెషల్- ఓటీటీలో గూస్ బంప్స్ తెప్పించే దేశభక్తి సినిమాలు- తప్పక చూడాల్సిన 5 మూవీస్- ఓ లుక్కేయండి

రిపబ్లిక్ డే వచ్చేస్తోంది. దేశమంతా సంబరాలకు సిద్ధమైంది. మరి ఈ నేపథ్యంలో ఈ లాంగ్ వీకెండ్ లో ఓటీటీలో గూస్ బంప్స్ తెప్పించే ఈ సినిమాలపై ఓ లుక్కేయండి. తప్పకుండా చూడాల్సిన దేశభక్తి చిత్రాలివి.

Published on: Jan 24, 2026, 15:19:27 IST
Advertisement

రిపబ్లిక్ డే సంబరాలకు దేశం సిద్ధమవుతోంది. జనవరి 26న ఇండియా మొత్తం ఈ జాతీయ పండగను జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఓటీటీ లవర్స్ తప్పకుండా చూడాల్సిన ఈ 5 దేశభక్తి సినిమాలపై ఓ లుక్కేయండి. లాంగ్ వీకెండ్ లో ఈ గూస్ బంప్స్ తెప్పించే మూవీస్ ను డిజిటల్ స్ట్రీమింగ్ చేసేయండి.

లగాన్

ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన దేశభక్తి సినిమాలు
ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన దేశభక్తి సినిమాలు

అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో 2001లో వచ్చిన చారిత్రాత్మక స్పోర్ట్స్ డ్రామా లగాన్ మూవీ ఇండియాలో దేశభక్తి సినిమాలకు ఓ స్టాండర్డ్ క్రియేట్ చేసింది. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ప్రస్థానాన్ని ఈ సినిమా ప్రారంభించింది. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ వాళ్లు విధించిన భారీ 'లగాన్' (పన్నులు)కు వ్యతిరేకంగా మొత్తం సమాజాన్ని ఏకం చేసిన ఒక గ్రామ యువకుడిగా ఆమిర్ ఖాన్ లగాన్ లో నటించారు.

పన్నును మాఫీ చేసే ఒప్పందంలో భాగంగా అనుభవజ్ఞులైన బ్రిటిష్ క్రికెట్ జట్టుతో తలపడేందుకు అతను ఒక క్రికెట్ టీమ్ ను ఏర్పాడు చేసి మ్యాచ్ ఆడతాడు. లగాన్ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఇప్పటికీ ఈ మూవీ అదరగొడుతూనే ఉంది.

రంగ్ దే బసంతి

మరో ఆమిర్ ఖాన్ మూవీ రంగ్ దే బసంతి. రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ కల్ట్ చిత్రం ఇప్పటికీ అభిమానుల ఆదరణ పొందుతోంది. అవినీతి కారణంగా భారత వైమానిక దళ పైలట్ అయిన తమ స్నేహితుడు విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత న్యాయం కోసం పోరాడే గ్యాంగ్ కథతో ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రంలో ఆమిర్, సిద్ధార్థ్, కునాల్ కపూర్, అతుల్ కులకర్ణి, షర్మాన్ జోషి, సోహా అలీ ఖాన్, వహీదా రెహమాన్, ఆర్.మాధవన్ తదితరులు నటించారు. ఇది కూడా నెట్‌ఫ్లిక్స్ లో ఉంది.

చక్ దే ఇండియా

మెఘనా గుల్జార్ దర్శకత్వంలో 2018లో వచ్చిన ఈ ఎస్పియోనేజ్ (గూఢచారి) థ్రిల్లర్ దేశభక్తి సినిమాలకు మరో చిరునామాగా మారింది. కశ్మీరీ గూఢచారి కుమార్తె అయిన సీమత్ పాత్రలో అలియా భట్ నటించారు. పాకిస్తానీ సైన్యం భారతదేశానికి వ్యతిరేకంగా ప్లాన్ చేస్తున్న సైనిక కుట్రను గూఢచర్యం చేయడానికి ఆమె ఒక పాకిస్తానీ సైనికుడిని వివాహం చేసుకుంటుంది. విక్కీ కౌశల్, జైదీప్ అహ్లావత్, సోని రజ్దాన్ తదితరులు నటించిన రాజీ మూవవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

షేర్షా

విష్ణువర్ధన్ దర్శకత్వంలో 2021లో నేరుగా ప్రైమ్ వీడియోలో రిలీజైన్ దేశభక్తి మూవీ షేర్షా. ఈ బయోగ్రాఫికల్ డ్రామా డైరెక్టర్ గా విష్ణువర్ధన్ కు ఫస్ట్ సినిమా. ధర్మా ప్రొడక్షన్స్ సమర్పించిన ఈ చిత్రంలో కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్రలో సిద్ధార్థ్ మల్హోత్రా, అతని భార్య పాత్రలో కియారా అద్వానీ నటించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks