...
...
Next Story

Thriller Web Series: ఈ వీకెండ్ మిస్ కాకూడని 2 కొత్త తమిళ వెబ్ సిరీస్‌లు.. ఒకటి హారర్, మరొకటి సస్పెన్స్ థ్రిల్లర్!

Thriller Web Series: ఈ వీకెండ్లో ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెండు తమిళ వెబ్ సిరీస్ లు రెడీగా ఉన్నాయి. ఇందులో ఒకటి హారర్ ఆంథాలజీ థ్రిల్లర్ కాగా.. మరొకటి సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సిరీస్ లు ఏంటీ? వాటి కథేంటో ఇక్కడ చూసేయండి.

Published on: Nov 28, 2026, 18:23:44 IST
Advertisement

Thriller Web Series: ఓటీటీలో వెబ్ సిరీస్ లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఇందులో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్లకు ఉండే డిమాండ్ వేరు. ఇప్పుడు అలాంటి ఓ రెండు వెబ్ సిరీస్ లు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీలోకి వచ్చేశాయి. అవే.. ‘రాతిరి’, ‘ఆక్టోపస్’.

హారర్ థ్రిల్లర్ రాతిరి

ఈ వీకెండ్ మిస్ కాకూడని 2 కొత్త తమిళ వెబ్ సిరీస్‌లు.. ఒకటి హారర్, మరొకటి సస్పెన్స్ థ్రిల్లర్!
ఈ వీకెండ్ మిస్ కాకూడని 2 కొత్త తమిళ వెబ్ సిరీస్‌లు.. ఒకటి హారర్, మరొకటి సస్పెన్స్ థ్రిల్లర్!

హారర్ ఆంథాలజీ థ్రిల్లర్ సిరీస్ గా తెరకెక్కింది ‘రాతిరి’. జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ కీలక పాత్ర పోషించిన ఈ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో తమిళ్, తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హారర్ థ్రిల్లర్ ను ఆహా తమ సరికొత్త ఒరిజినల్ వెబ్ సిరీస్ గా ఓటీటీలో రిలీజ్ చేసింది. ఇందులో నాలుగు వేర్వేరు కథలుంటాయి.

భయపెట్టే రష్మి గౌతమ్

తెలుగు బుల్లితెరపై గ్లామర్, కామెడీ టైమింగ్ తో ఎంటర్ టైన్ చేస్తున్న రష్మి గౌతమ్.. ఈ రాతిరి వెబ్ సిరీస్ లో భయపెడుతోంది. ఆమె వణికించే కీలక పాత్రలో నటించడం విశేషం. ఇక ఈ వెబ్ సిరీస్ లో రష్మి గౌతమ్ తో పాటు సినిమాటోగ్రాఫర్ నట్టి ఓ కీలక పాత్రలో నటించాడు. దివ్య గణేష్ కూడా కీ రోల్ ప్లే చేసింది. హారర్ థ్రిల్లర్ లవర్స్ కు ఈ వెబ్ సిరీస్ మంచి ఆప్షన్.

సస్పెన్స్ థ్రిల్లర్ ఆక్టోపస్

వరుణ్, నికితకు కొత్తగా పెళ్లి అవుతుంది. ఈ కొత్త దంపతులు ఓ కొత్త ఇంట్లోకి వస్తారు. అంతా బాగానే ఉందే సమయంలో అనుకోని ట్విస్ట్ కథను మలుపు తిప్పుతుంది. నికిత కనిపించకుండా పోతుంది. ఆమె మాయం కావడం ఆ కాలనీలో కలకలం రేపుతోంది.

అంతకుముందు ప్రతి రోజు నికితను వరుణ్ కొట్టడాన్ని కాలనీవాళ్లు చూస్తారు. అందుకే వరుణ్ పై ఆ కాలనీవాళ్లే కలిసి కేసు పెడతారు. ఈ నేపథ్యంలో నికిత మిస్సింగ్ కేసును ఎంక్వైరీ చేస్తున్న కొద్దీ అక్కడి మనుషుల్లోని సీక్రెట్లు బయటపడతాయి.

27 రోజుల్లోనే షూటింగ్

అక్టోబస్ వెబ్ సిరీస్ సీజన్ 1 షూటింగ్ ను కేవలం 27 రోజుల్లోనే కంప్లీట్ చేశారు. దీనికి జయచంద్ర హష్మీ డైరెక్టర్. ఈ వెబ్ సిరీస్ లో అశ్విన్ కుమార్, సిద్ధు కుమరేశన్, అర్చన రవిచంద్రన్, వినోద్ కిషన్, కలైవాణి భాస్కర్ తదితరులు నటించారు.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks