ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వెబ్ సిరీస్ గురించి నెటిజన్లు తెగ డిస్కస్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ వెబ్ సిరీస్ పేరు కనిపిస్తోంది. సస్పెన్స్ అదిరిపోయిందని, ట్విస్ట్ లో అదుర్స్ అంటూ పోస్ట్ లు వస్తున్నాయి. ఆ సీరీస్ ఏదో కాదు.. కానిస్టేబుల్ కనకం సీజన్ 2. ఈ తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కానిస్టేబుల్ కనకం సీజన్ 2

తెలుగు మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ఈ సిరీస్ సీజన్ గతేడాది ఓటీటీలోకి వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు సీజన్ 2 కూడా అదరగొడుతోంది. ఈ సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో జనవరి 8 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో వర్ష బొల్లమ్మ లీడ్ రోల్ ప్లే చేసింది.
సీజన్ 1 స్టోరీ
కానిస్టేబుల్ కనకం సీజన్ 1లో టైటిల్ రోల్ ప్లే చేసింది వర్ష బొల్లమ్మ. కనక మహాలక్ష్మి ఓ స్టేషన్ కు కానిస్టేబుల్ గా వెళ్తుంది. అక్కడ అడవి గుట్ట ప్రమాదకరంగా ఉంటుంది. అటు వైపు వెళ్లిన అమ్మాయిలు కనిపించకుండా పోతారు. ఇలాగే కనకం ఫ్రెండ్ చంద్రిక మిస్ అవుతుంది. పై అధికారులను ఎదురించి మరీ చంద్రిక కోసం వెతుకుతుంది కనకం.
అమ్మ ఆత్మ కోసం
అయితే ఆ ఊరి ప్రెసిడెంట్ తన అమ్మ ఆత్మతో మాట్లాడాలని క్షుద్ర పూజలు చేస్తుంటాడు. ఆ ఊరి అమ్మాయిలను అతనే బలి తీసుకుంటాడు. ఈ విషయాన్ని కనకం కనిపెడుతుంది. అప్పటికే ముగ్గురు అమ్మాయిలు చనిపోతారు. కానీ చంద్రిక ఆచూకీ మాత్రం దొరకదు. మరి చంద్రిక ఎక్కడుంది? అనే సస్పెన్స్ తో కానిస్టేబుల్ కనకం సీజన్ 1 ముగిసింది.
అదే ఉత్కంఠ
కానిస్టేబుల్ కనకం సీజన్ 2లోనూ మేకర్స్ సస్పెన్స్, ఉత్కంఠ కొనసాగించారు. ఇందులో చంద్రిక ఆచూకీ కోసం కనకం ప్రయత్నిస్తూనే ఉంటుంది. అప్పుడే చంద్రిక బతికే ఉందని తెలుస్తుంది. కథలో ఊహించని వాళ్లు విలన్లుగా మారతారు. మళ్లీ సహస్ర అనే క్యారెక్టర్ ఎవరు? అనేది మరింత థ్రిల్ పంచుతుంది.
{{/usCountry}}కానిస్టేబుల్ కనకం సీజన్ 2లోనూ మేకర్స్ సస్పెన్స్, ఉత్కంఠ కొనసాగించారు. ఇందులో చంద్రిక ఆచూకీ కోసం కనకం ప్రయత్నిస్తూనే ఉంటుంది. అప్పుడే చంద్రిక బతికే ఉందని తెలుస్తుంది. కథలో ఊహించని వాళ్లు విలన్లుగా మారతారు. మళ్లీ సహస్ర అనే క్యారెక్టర్ ఎవరు? అనేది మరింత థ్రిల్ పంచుతుంది.
{{/usCountry}}నెటిజన్ల రియాక్షన్
కానిస్టేబుల్ కనకం సీజన్ 2లో నాలుగు ఎపిసోడ్లు ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఈ సీజన్ చూసిన నెటిజన్ల రియాక్షన్ వైరల్ గా మారింది. సిరీస్ లో కొత్త సస్పెన్స్ అని ఒక యూజర్ పోస్ట్ పెట్టాడు. స్టోరీ, ట్విస్ట్స్, పర్ఫార్మెన్స్, నెక్ట్స్ లెవల్ స్టోరీ సెలక్షన్ అంటూ మరో అకౌంట్ లో పోస్టు చేశారు.
ఇంకో లెవల్
సీజన్ 1 కంటే సీజన్ 2 బెటర్ గా ఉందని, ముఖ్యంగా ట్విస్ట్ లు అదిరిపోయాయని మరో ఎక్స్ యూజర్ పోస్టు చేశాడు. సీజన్ 2 ఇంకో లెవల్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఈ పండగకు మంచి థ్రిల్లర్ కావాలనుకుంటే ఓటీటీలో కానిస్టేబుల్ కనకం సిరీస్ చూసేయండి.