SS Rajamouli: వర్సటైల్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై దర్శకధీర ఎస్ఎస్ రాజమౌళి తనయుడు, ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయ రివ్యూ ఇచ్చారు. సినిమా చాలా హృద్యంగా, కూల్‌గా ఉందంటూ ఎక్స్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. దీనికి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ రీ-ట్వీట్ చేస్తూ.. "దయచేసి ఈ సినిమాను రాజమౌళి గారికి చూపించి ఆయన ఓపినియన్ చెప్పు బ్రో" అని కోరడం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
"సూర్య ఆ పాత్ర కోసమే పుట్టారు".. కార్తికేయ ట్వీట్ వైరల్

సూర్య నటనపై ఎస్ఎస్ కార్తికేయ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. "విశ్వనాథ్ అండ్ సన్స్ చాలా బ్యూటిఫుల్‌గా, మనసుకు హత్తుకునేలా ఉంది. ఇంత హాయిగా, మనసును మైమరిపించే ఎంటర్‌టైనర్ చూసి చాలా కాలమైంది" అని కార్తికేయ కొనియాడారు.
మనం ఎంతో ఇష్టపడే ఆ పాత వింటేజ్ జోన్‌లో సూర్యను మళ్లీ చూడటం అద్భుతంగా ఉందని కార్తికేయ తెలిపారు. "ఈ రోల్ కోసం సూర్య సర్ పుట్టినట్లు ఉన్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మైండ్ బ్లాకింగ్" అంటూ ప్రశంసించారు. 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజును ఎనర్జీ బాంబ్ అని అభివర్ణిస్తూ, ప్రతీ ఫ్రేమ్‌లో ఆమె ఎనర్జీ సినిమాకు బిగ్గెస్ట్ హైలైట్ అని పేర్కొన్నారు. ముఖ్యంగా సినిమాలో వచ్చే ఒక ఇంటర్వ్యూ సీన్ ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ సీన్స్‌లో ఒకటని చెప్పారు.
"జక్కన్నకు సినిమా చూపించవా బ్రో!".. నాగవంశీ స్పెషల్ రిక్వెస్ట్
కార్తికేయ చేసిన ఈ బ్యూటిఫుల్ ట్వీట్‌కు ప్రొడ్యూసర్ నాగవంశీ వెంటనే థ్యాంక్స్ చెబుతూ రిప్లై ఇచ్చారు. "థ్యాంక్యూ కార్తి.. ప్లీజ్ రాజమౌళి గారిని కూడా ఈ సినిమా చూడమని అడుగు. ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది" అంటూ పోస్ట్ చేశారు.
తెలుగు సినిమా స్థాయిని గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లిన దర్శకధీర రాజమౌళి ప్రశంసలు దక్కితే ఆ సినిమాకు వచ్చే హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. అందుకే నాగవంశీ తన సినిమాను జక్కన్నకు ప్రత్యేకంగా చూపించాలని కార్తికేయను కోరారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
వెంకీ అట్లూరి మార్క్ మ్యాజిక్.. సూర్య కెరీర్‌లో మరో మైలురాయి
{{/usCountry}}తెలుగు సినిమా స్థాయిని గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లిన దర్శకధీర రాజమౌళి ప్రశంసలు దక్కితే ఆ సినిమాకు వచ్చే హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. అందుకే నాగవంశీ తన సినిమాను జక్కన్నకు ప్రత్యేకంగా చూపించాలని కార్తికేయను కోరారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
వెంకీ అట్లూరి మార్క్ మ్యాజిక్.. సూర్య కెరీర్‌లో మరో మైలురాయి
{{/usCountry}}'తొలిప్రేమ', 'సార్', 'లక్కీ భాస్కర్' లాంటి కమర్షియల్ బ్లాక్‌బస్టర్స్ అందించిన డైరెక్టర్ వెంకీ అట్లూరి.. ఈ సారి సూర్యతో కలిసి 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. తనదైన మార్క్ క్లాసిక్ ఎమోషన్స్, క్యూట్ లవ్ స్టోరీతో ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు కార్తికేయ ట్వీట్ ద్వారా స్పష్టమవుతోంది.
సూర్య కెరీర్‌లో 'గజినీ', '24', 'ఆకాశం నీ హద్దురా' లాంటి ఇంటెన్స్ రోల్స్ ఉన్నప్పటికీ, ఆయనలోని ఫీల్-గుడ్ అండ్ రొమాంటిక్ టైమింగ్‌ను చూడటానికి ఆడియన్స్ ఎప్పుడూ ఆసక్తి చూపుతారు. మలయాళ బ్యూటీ మమితా బైజు జోడీగా నటిస్తుండటం, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోవడంతో ఈ సినిమా సుదీర్ఘ కాలం ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మూవీ ఇప్పటికే రూ.200 కోట్లకుపైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.