Nagarjuna: కింగ్ అక్కినేని నాగార్జున టాలీవుడ్ ఫిల్మ్ మేకర్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇండస్ట్రీలో ఒక పెద్ద డిబేట్‌కు తెరలేపారు. తన కొడుకు అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'లెనిన్' సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమాలు అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్లను మార్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. హాలీవుడ్ లెజెండ్ క్రిస్టోఫర్ నోలన్ కొత్త సినిమా 'ది ఒడిస్సీ' ప్లానింగ్‌ను ఎగ్జాంపుల్‌గా చూపిస్తూ టాలీవుడ్‌ను కడిగిపారేశారు.
అది మనమెందుకు చేయలేకపోతున్నాం

హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన 'ది ఒడిస్సీ' రిలీజ్ డేట్‌ను ఏడాది ముందే అనౌన్స్ చేశారని నాగార్జున గుర్తుచేశారు. ఆ టైమ్‌కే ఆ సినిమాను పక్కాగా థియేటర్లలోకి తెచ్చారని, మరి మన తెలుగు ఇండస్ట్రీలో ముందే డేట్లు చెప్పి ఎందుకు వాయిదా వేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో తప్పు తన వైపు కూడా ఉందని, రీసెంట్ గా వచ్చిన 'లెనిన్' సినిమాను కూడా తాము పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చిందని నిజాయితీగా ఒప్పుకున్నారు.
'నిన్నే పెళ్లాడుతా', 'అన్నమయ్య' రోజుల్లో అలా ఉండేది
టెక్నికల్ వర్క్ పూర్తి కాకపోవడం వల్లే తాము 'లెనిన్' మూవీని వాయిదా వేయాల్సి వచ్చిందని నాగ్ క్లారిటీ ఇచ్చారు. గతంలో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచిన 'నిన్నే పెళ్లాడుతా', 'అన్నమయ్య' సినిమాల రోజులను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల్లో సినిమా రిలీజ్‌కు ఒక నెల ముందే ఫైనల్ కాపీలు చేతిలో రెడీగా ఉండేవని, ఇప్పుడు టెక్నాలజీ పెరిగినా ఎందుకు లాస్ట్ మినిట్ వరకు కంగారు పడుతున్నామో అర్థం కావడం లేదన్నారు.
ఈ ప్రశ్నను తాను ఇండస్ట్రీతో పాటు తనను తాను కూడా అడుగుతున్నానని కింగ్ చెప్పారు. సినిమా బాగుండాలన్నా, ఇండస్ట్రీ సేఫ్‌గా ఉండాలన్నా రిలీజ్ డేట్ కంటే ముందే ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకునే పద్ధతిని మళ్లీ తీసుకురావాలని రిక్వెస్ట్ చేశారు. ఈ క్రేజీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాలీవుడ్ సర్కిల్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
అఖిల్ 'లెనిన్' సక్సెస్.. ఎమోషనల్ అయిన కింగ్
{{/usCountry}}ఈ ప్రశ్నను తాను ఇండస్ట్రీతో పాటు తనను తాను కూడా అడుగుతున్నానని కింగ్ చెప్పారు. సినిమా బాగుండాలన్నా, ఇండస్ట్రీ సేఫ్‌గా ఉండాలన్నా రిలీజ్ డేట్ కంటే ముందే ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకునే పద్ధతిని మళ్లీ తీసుకురావాలని రిక్వెస్ట్ చేశారు. ఈ క్రేజీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాలీవుడ్ సర్కిల్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
అఖిల్ 'లెనిన్' సక్సెస్.. ఎమోషనల్ అయిన కింగ్
{{/usCountry}}అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్స్ ప్లే చేసిన 'లెనిన్' సినిమాను డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాను నాగార్జునతో పాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ కలిసి గ్రాండ్‌గా నిర్మించారు. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ అఖిల్‌కు మంచి కంబ్యాక్ ఇవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
సక్సెస్ ఈవెంట్‌లో నాగార్జున తన కొడుకు అఖిల్ కెరీర్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. గతంలో అఖిల్ కు జరిగిన ప్రమాదం, ఆ తర్వాత తను కోలుకుని ఈ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం చూసి ఒక తండ్రిగా గర్వపడుతున్నట్లు చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ అయిందని థాంక్స్ చెప్పారు. ఎస్ తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయని ప్రశంసించారు.