...
...
Next Story

Nani Promise: అలియాస్ రుక్మిణి చూసి ఆ ఫీల్ రాకపోతే సినిమాలు తీయడం మానేస్తా.. సుమ యాంకరింగ్ మానేస్తారు: నాని ప్రామిస్

Nani Promise: అలియాస్ రుక్మిణి సినిమాపై ఉన్న నమ్మకంతో తెలుగు ఆడియన్స్ కు నేచురల్ స్టార్ నాని ఓ ప్రామిస్ ఇచ్చారు. తను మాట ఇవ్వడమే కాకుండా ఇందులోకి స్టార్ యాంకర్ సుమను కూడా లాగారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Published on: Nov 29, 2026, 14:43:18 IST
Advertisement

Nani Promise: ఓ వైపు హీరోగా దూసుకెళ్తూనే మరోవైపు ప్రొడ్యూసర్ గానూ వరుసగా సినిమాలు తీస్తున్నారు నేచురల్ స్టార్ నాని. ఆయన సమర్ఫణలో వస్తున్న అప్ కమింగ్ మూవీ ‘అలియాస్ రుక్మిణీ’. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్లో నాని ఇచ్చిన ఓ ప్రామిస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

నాని ప్రామిస్

అలియాస్ రుక్మిణి చూసి ఆ ఫీల్ రాకపోతే సినిమాలు తీయడం మానేస్తా.. సుమ యాంకరింగ్ మానేస్తారు: నాని ప్రామిస్
అలియాస్ రుక్మిణి చూసి ఆ ఫీల్ రాకపోతే సినిమాలు తీయడం మానేస్తా.. సుమ యాంకరింగ్ మానేస్తారు: నాని ప్రామిస్

అలియాస్ రుక్మిణి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని కామెంట్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ‘‘డిసెంబర్ 4న అలియాస్ రుక్మిణికి వెళ్లి.. థియేటర్ల నుంచి బయటకొస్తూ మీరొక బ్యూటీఫుల్ సినిమాను చూశామనే ఫీలింగ్ మీకు కలగకపోతే నేను ఇక నుంచి సినిమాలు తీయడం మానేస్తాను. సుమగారు యాంకరింగ్ మానేస్తారు. ఇది ఉమ్మడి హామీ’’ అని నాని చెప్పారు.

వీడియో వైరల్

ఈ మాటలు చెప్పగానే పక్కనే ఉన్న సుమ షాక్ అయింది. తన మీద చేయి పెట్టారు కాబట్టి ఇది కంబైన్డ్ ప్రామిస్ అని నాని చెప్పారు. అప్పుడే స్టేజీపై ఉన్న వాళ్లతో పాటు అక్కడున్న ఆడియన్స్ అందరూ గట్టిగా అరిచారు. చప్పట్లు కొట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సుమను భలే ఇరికించారే అని నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో

ప్రొడ్యూసర్ గా నాని డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఎంకరేజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నితిన్ తో కొత్త ప్రయోగం చేస్తున్నారని చెప్పొచ్చు. కోర్టులో పని చేసే స్టెనో అమ్మాయి పేరుతో సెక్స్ నవలలు రాసే నేపథ్యంలో అలియాస్ రుక్మిణీ మూవీ కథ సాగనుంది. ట్రైలర్ తో దీనిపై క్లారిటీ వచ్చింది. ఇక ఇదో హార్ట్ టచింగ్ ఫీల్ గుడ్ మూవీగా మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు.

అలియాస్ రుక్మిణి రిలీజ్ డేట్

అలియాస్ రుక్మిణీ, వృష‌క‌ర్మ‌ రెండూ డిఫరెంట్ మూవీస్. వేర్వేరు జోనర్లలో ఇవి తెరకెక్కాయి. ఈ నేపథ్యంలో రెండు సినిమాలపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈ బాక్సాఫీస్ ఫైట్ లో ఏ మూవీ గెలుస్తుంది? రెండు సినిమాలు ఎలాంటి బాక్సాఫీస్ ప్రదర్శన చేస్తాయన్నది వేచి చూడాల్సిందే.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks