...
...
Next Story

Nani: ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు నాని వ‌స్తారా లేదా? సీఎం ట్వీట్ ఇదే.. అల్లు అర్జున్ కేసును గుర్తుచేసిన డీజీపీ!

Nani: నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’ స్క్రీనింగ్ కు మరికొన్ని గంటలే ఉంది. ఇవాళ రాత్రి స్పెషల్ ప్రీమియర్ షోలు వేయనున్నారు. అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఫ్యాన్స్ తో కలిసి ప్రీమియర్ చూడాలని నాని ఆశపడుతున్నారు. ఈ రిక్వెస్ట్ పై సీఎం, డీజీపీ రియాక్షన్లు వైరల్ గా మారాయి.

Published on: Sep 23, 2026, 13:43:53 IST
Advertisement

Nani: ది ప్యారడైజ్ ప్రీమియర్ కోసం నాని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కు వస్తారా లేదా? అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఒక ఐకానిక్ థియేటర్‌లో ఈ రోజు (సెప్టెంబర్ 23) రాత్రి 'ది ప్యారడైజ్' ప్రీమియర్ షోను అభిమానులతో కలిసి చూడాలని నేచురల్ స్టార్ నాని భావించారు. దీనికోసం ప్రత్యేక అనుమతి ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

సీఎం రేవంత్ రియాక్షన్

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు నాని వ‌స్తారా లేదా? సీఎం ట్వీట్ ఇదే.. అల్లు అర్జున్ కేసును గుర్తుచేసిన డీజీపీ! (x/THE PARADISE)
ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు నాని వ‌స్తారా లేదా? సీఎం ట్వీట్ ఇదే.. అల్లు అర్జున్ కేసును గుర్తుచేసిన డీజీపీ! (x/THE PARADISE)

నాని అభ్యర్థనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ అప్లికేషన్ ను, పరిస్థితిని బట్టి పోలీసులు నిర్ణయం తీసుకుంటారని రేవంత్ ట్వీట్ చేశారు.

డీజీపీ ఎమన్నారంటే?

సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిన తర్వాత తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కూడా ఎక్స్ లో రియాక్టయ్యారు. ‘‘నాని, ఓదెల.. గణేష్ నిమజ్జనాలు జోరు మీద సాగుతున్నాయి. పదో రోజు కాబట్టి ఇవాళ హుస్సేన్ సాగర్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వేలాది విగ్రహాలు నిమజ్జనమవుతాయి. హుస్సేన్ సాగర్ కు దగ్గరగా ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఈ నిమజ్జన వాహనాలు, జనాలతో కిక్కిరిసిపోతుంది.

మీ కోరిక ప్రకారం ఓ హైదరాబాద్ సిటీ పోలీసులను భద్రత ఏర్పాటు చేయగలరో లేదో అడిగి కనుక్కుంటా. ముఖ్యంగా రెండేళ్ల క్రితం జరిగిన సంఘటన (సంధ్య థియేటర్ తొక్కిసలాట)ను గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు తొక్కిసలాటలో ఓ మహిళ మరణించింది. ఓ పిల్లాడు తీవ్రంగా గాయపడ్డాడు’’ అని డీజీపీ ఆనంద్ పోస్టు చేశారు.

భద్రతే ముఖ్యం

ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ప్రీమియర్ షో చూసేందుకు నాని రాకపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత పరిణామాల ప్రకారం అతను రాడనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా నేటి రాత్రి 9:30 గంటల నుంచి ప్రారంభం కానున్న 'ది ప్యారడైజ్' ప్రీమియర్ షోలపై అందరి దృష్టి నెలకొంది.

స్టార్ పవర్ వర్సెస్ పబ్లిక్ సేఫ్టీ

సాధారణంగా పెద్ద సినిమాల ప్రీమియర్ల సమయంలో స్టార్ హీరోలు, నిర్మాతలు పబ్లిసిటీ కోసం రద్దీని పట్టించుకోకుండా థియేటర్ల వద్ద హడావుడి చేస్తుంటారు. కానీ, హైదరాబాద్‌లో కీలకమైన గణేష్ నిమజ్జనాల సమయంలో నాని మెచ్యూర్డ్ గా ఆలోచించారనే టాక్ వినిపిస్తోంది.

నగర పోలీసులకు ఇబ్బంది కలగకుండా, సీఎం సూచనకు గౌరవమిస్తూ నాని వెనక్కి తగ్గడం ఆయన బాధ్యతాయుతమైన ప్రవర్తనకు నిదర్శనమని నెటిజన్లు అంటున్నారు.

అప్పుడు అల్లు అర్జున్

పుష్ప 2 ప్రీమియర్ కోసం 2024 డిసెంబర్ 4న రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్లో ప్రీమియర్ కోసం అల్లు అర్జున్ సడెన్ గా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. 35 ఏళ్ల రేవతి అనే మహిళ మరణించారు. ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో అల్లు అర్జున్ రిమాండ్ మీద జైలుకు వెళ్లి, బెయిల్ పై రిలీజ్ అయ్యారు. ఇంకా ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks