నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ సినిమా ‘ది ప్యారడైజ్’ (The Paradise). నాని పుట్టినరోజు సందర్భంగా ది ప్యారడైజ్ సినిమా నుంచి ‘ఆయా షేర్’ వంటి ఊర మాస్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
నాని మాస్ స్టెప్పులు

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ది పారడైజ్ సినిమాలో నాని మాస్ స్టెప్పులు చూసి అభిమానులు ఫిదా అవుతుంటే, మరోవైపు ఈ పాట కాపీ వివాదంలో చిక్కుకుంది. ఆయా షేర్ పాటలోని వైరల్ హుక్ స్టెప్పు తనదేనని, దానిని కాపీ చేశారని ప్రముఖ డ్యాన్సర్ బాబా జాక్సన్ ఆరోపిస్తున్నారు.
ఆధారాలతో సహా బాబా జాక్సన్ పోస్ట్
'రొమేనియాస్ గాట్ టాలెంట్' వంటి అంతర్జాతీయ వేదికలపై తన డ్యాన్స్‌తో మెప్పించిన బాబా జాక్సన్ (యువరాజ్ సింగ్), తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు.
ఇది నా ప్రతిభ
2024లో తాను ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు వేసిన ఒక సంక్లిష్టమైన స్టెప్పును, ఇప్పుడు నాని వేసిన స్టెప్పును పక్కపక్కన పెట్టి ఇది ముమ్మాటికీ ‘కాపీ’ అని పేర్కొన్నారు. "జల్వా హై హమారా" (ఇది నా ప్రతిభ) అంటూ బాబా జాక్సన్ ఘాటుగా స్పందించారు.
మరింత అప్‌గ్రేడ్ చేస్తా
దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ "నీ డ్యాన్స్ అంతా మైఖేల్ జాక్సన్ నుంచి కాపీ చేసిందే కదా" అని విమర్శించగా, బాబా జాక్సన్ తనదైన శైలిలో బదులిచ్చారు. "నేను కాపీ చేయను.. ఉన్నదానిని మరింత అప్‌గ్రేడ్ చేస్తాను" అని బాబా జాక్సన్ స్పష్టం చేశారు. బాబా జాక్సన్ ప్రతిభను గతంలో అంతర్జాతీయ రాపర్ స్నూప్ డాగ్ సైతం మెచ్చుకోవడం విశేషం.
అనిరుధ్ మ్యూజిక్.. సుధాన్ మాస్టర్ కొరియోగ్రఫీ
ఇదిలా ఉంటే, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఆయా షేర్ పాటకు సుధాన్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. సాధారణంగా నాని సినిమాల్లో డ్యాన్స్‌కు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ, ఈ సినిమాలో నాని ఒక స్లమ్ ఏరియాలో విందు ఇచ్చిన తర్వాత వేసే ఈ స్టెప్పులు చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
{{/usCountry}}ఇదిలా ఉంటే, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఆయా షేర్ పాటకు సుధాన్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. సాధారణంగా నాని సినిమాల్లో డ్యాన్స్‌కు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ, ఈ సినిమాలో నాని ఒక స్లమ్ ఏరియాలో విందు ఇచ్చిన తర్వాత వేసే ఈ స్టెప్పులు చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
{{/usCountry}}సాంగ్ రిలీజ్ అయి కొద్దీ క్షణాల్లోనే ఆయా షేర్ హుక్ స్టెప్ డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇప్పుడు కాపీ వివాదం రావడంతో ఆ స్టెప్పుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది 'పీక్ నాని' అని పొగుడుతుంటే, మరికొందరు "ఇది మాస్ స్టెప్పా లేక కామెడీనా?" అని పెదవి విరుస్తున్నారు.
కాపీ కాంట్రవర్సీపై మీమ్స్
అలాగే, కాపీ కాంట్రవర్సీపై మీమ్స్ కూడా వేస్తున్నారు నెటిజన్స్. ఇదిలా ఉంటే, కాసార్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఆయా షేర్ పాటను అద్దుల జంగిరెడ్డి, అర్జున్ చాందీ ఆలపించారు. ఇక భారీ అంచనాలున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ కాపీ ఆరోపణలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.