...
...
Next Story

Nara Rohith: ఆదర్శ కుటుంబం నుంచి సర్ ప్రైజ్..పవర్‌ఫుల్ పోలీస్‌గా నారా రోహిత్..బర్త్ డే స్పెషల్..త్రివిక్రమ్ ప్లాన్ ఇదే!

Nara Rohith: విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'ఆదర్శ కుటుంబం'. ఈ సినిమా నుంచి ఇవాళ ఓ సర్ ప్రైజ్ వచ్చింది. యంగ్ అండ్ వర్సటైల్ హీరో నారా రోహిత్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. నారా రోహిత్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆ పోస్ట్ వైరల్ గా మారింది.

Published on: Jul 25, 2026, 13:46:23 IST
Advertisement

Nara Rohith: తెలుగు సినీ పరిశ్రమలో విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి ఆల్-టైమ్ క్లాసిక్స్‌కి రచయితగా పనిచేసిన త్రివిక్రమ్.. తొలిసారిగా వెంకటేష్‌ను డైరెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ 'ఆదర్శ కుటుంబం' (AK47). ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా నారా రోహిత్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ మల్టీస్టారర్ రేంజ్ హైప్‌ను సొంతం చేసుకుంది.

పవర్‌ఫుల్ పోలీస్ అవతారంలో నారా రోహిత్

ఆదర్శ కుటుంబం నుంచి సర్ ప్రైజ్..పవర్‌ఫుల్ పోలీస్‌గా నారా రోహిత్..బర్త్ డే స్పెషల్..త్రివిక్రమ్ ప్లాన్ ఇదే! (x/haarikahassine)
ఆదర్శ కుటుంబం నుంచి సర్ ప్రైజ్..పవర్‌ఫుల్ పోలీస్‌గా నారా రోహిత్..బర్త్ డే స్పెషల్..త్రివిక్రమ్ ప్లాన్ ఇదే! (x/haarikahassine)

నారా రోహిత్ కెరీర్‌లో 'రౌడీ ఫెలో', 'అసుర', 'ప్రతినిధి' వంటి చిత్రాలు అతని నటనలోని గంభీరతను, విలక్షణమైన డైలాగ్ డెలివరీని నిరూపించాయి. ఖాకీ డ్రెస్ వేస్తే అతని బాడీ లాంగ్వేజ్‌కు లభించే ఎలివేషనే వేరు. ఇప్పుడు త్రివిక్రమ్ మార్క్ క్యారెక్టరైజేషన్‌లో నారా రోహిత్ ఒక సీరియస్ అండ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనుండటం సినిమాపై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచింది.

ఫస్ట్ లుక్ వైరల్

ఇవాళ (జూలై 25) నారా రోహిత్ బర్త్ డే సందర్భంగా ఆదర్శ కుటుంబం నుంచి అతని లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నోట్లో సిగరేట్ తో రోహిత్ సీరియస్ లుక్ లో కనిపించాడు. హీరోగా చేస్తూనే, కథాబలం ఉన్న ప్రత్యేకమైన పాత్రలు ఎంచుకోవడంలో రోహిత్ రూటే వేరు.

వెంకటేష్‌తో కలిసి అతను పంచుకోబోయే స్క్రీన్ స్పేస్, వారిద్దరి నడుమ వచ్చే సీన్లు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి. ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించేందుకు త్రివిక్రమ్ వేసిన ప్లాన్ ఇదే అని అంటున్నారు.

అక్టోబర్ 2న థియేటర్లలో రచ్చ

త్రివిక్రమ్ శ్రీనివాస్ గత చిత్రాలను పరిశీలిస్తే ప్రధాన కథానాయకుడితో పాటు అంతే ప్రాధాన్యత ఉన్న మరో బలమైన పాత్రను (ఉదాహరణకు: 'భీమ్లా నాయక్'లో రానా, 'అరవింద సమేత'లో జగపతి బాబు) అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దడంలో ఆయన సిద్ధహస్తుడు.

'ఆదర్శ కుటుంబం'లో నారా రోహిత్‌ను పోలీస్ ఆఫీసర్‌గా దించడం కేవలం ప్రచార ఆర్భాటమే కాదు. కథలో కీలకమైన మలుపు తెచ్చే ఇన్వెస్టిగేటివ్ లేదా కాంఫ్లిక్ట్ ఎలిమెంట్‌కు ఈ పాత్రే వెన్నెముక అని ట్రేడ్ టాక్. 'వెంకీ77'గా వస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాకు నారా రోహిత్ కలయిక మాస్ అండ్ మల్టీస్టారర్ ఇమేజ్‌ను తెచ్చిపెడుతోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe