...
...
Next Story

Nari Nari Naduma Murari: టీవీలోకి సంక్రాంతి బ్లాక్ బస్టర్.. నారీ నారీ నడుమ మురారీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఎప్పుడంటే?

Nari Nari Naduma Murari: శర్వానంద్ హీరోగా నటించిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ నారీ నారీ నడుమ మురారి మూవీ టీవీలోకి రాబోతోంది. థియేటర్లో, ఓటీటీలో అదరగొట్టిన ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది.

Published on: Apr 19, 2026, 21:52:28 IST
Advertisement

Nari Nari Naduma Murari: సంక్రాంతి 2026 బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ టీవీలోకి వచ్చేస్తోంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఓటీటీలోనూ అదరగొట్టింది. ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది.

టీవీలో నారీ నారీ నడుమ మురారి

టీవీలోకి వస్తున్న నారీ నారీ నడుమ మురారి (x/ImSharwanand)
టీవీలోకి వస్తున్న నారీ నారీ నడుమ మురారి (x/ImSharwanand)

నారీ నారీ నడుమ మురారి మూవీ టీవీ ప్రీమియర్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఈటీవీ ఛానెల్ లో స్ట్రీమింగ్ కు రానుంది. వచ్చే ఆదివారం అంటే ఏప్రిల్ 26 సాయంత్రం 6 గంటలకు ఈటీవీలో నారీ నారీ నడుమ మురారి మూవీ ప్రీమియర్ కానుంది.

బ్లాక్ బస్టర్

2026 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న నారీ నారీ నడుమ మురారి సినిమా రిలీజైంది. పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కలెక్షన్ల దుమ్ము రేపింది. కామెడీ ఎంటర్ టైనర్ గా ఫ్యామిలీస్ ను అలరించింది. ఈ మూవీకి రామ్ అబ్బరాజు డైరెక్టర్. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు.

ఓటీటీలోనూ అదుర్స్

నారీ నారీ నడుమ మురారి సినిమా ఓటీటీలోనూ అదుర్స్ అనిపించింది. ఫిబ్రవరి 4న ప్రైమ్ వీడియోలో ఈ బ్లాక్ బస్టర్ డిజిటల్ డెబ్యూ చేసింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నారీ నారీ నడుమ మురారి స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోకి రిలీజైన వెంటనే ఈ మూవీ ట్రెండింగ్ లోకి దూసుకెళ్లింది.

నారీ నారీ నడుమ మురారి స్టోరీ

ప్రేమించిన అమ్మాయి నిత్యతో గౌతమ్ పెళ్లి జరుగుతుండగా.. మాజీ గర్ల్‌ఫ్రెండ్ దియా (సంయుక్త మీనన్) వచ్చి అడ్డుపడుతుంది. ఆ తర్వాత ఏమైంది? అసలు గౌతమ్ పెళ్లికి దియా ఎందుకు అడ్డు పడింది?, గౌతమ్ తండ్రి కార్తీక్ (వీకే నరేష్) లేటు వయసులో పల్లవి (సిరి హనుమంత్)ని పెళ్లి చేసుకోడానికి కారణం ఏంటీ?

గౌతమ్ దియాకు ఎందుకు బ్రేకప్ అయింది? రామలింగం పెట్టిన కండిషన్ ఏంటీ? చివరికి నిత్యతో గౌతమ్ పెళ్లి జరిగిందా? లేదా? అనేది తెలియాలంటే నారీ నారీ నడుమ మురారి సినిమాను చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe