...
...
Next Story

OTT Today: ఫస్ట్ నైట్ రోజు వచ్చిన ఆ లెటర్ ఏంటి? ఓటీటీలోకి వచ్చేసిన అనగనగా ఒక రాజు.. నవ్వుల విందు గ్యారెంటీ

థియేటర్లలో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తెలుగు మూవీ అనగనగా ఒక రాజు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. నవీన్ పొలిశెట్టి కెరీర్ లో ఇదే ఫస్ట్ రూ.100 కోట్ల సినిమా.

Published on: Feb 11, 2026, 06:07:28 IST
Advertisement

ఓటీటీ లవర్స్ అలర్ట్. ఇంట్లో కూర్చుని, ఫ్యామిలీతో కలిసి, కడుపుబ్బా నవ్వే సినిమాను చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు లేటు.. ఈ రోజే ఓటీటీలోకి వచ్చిన అనగనగా ఒక రాజు సినిమాపై ఓ లుక్కేయండి. సంక్రాంతి 2026కు థియేటర్లలో రిలీజైన సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఇవాళ (ఫిబ్రవరి 11) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

అనగనగా ఒక రాజు ఓటీటీ

ఓటీటీలోకి అనగనగా ఒక రాజు (x/SitharaEnts)
ఓటీటీలోకి అనగనగా ఒక రాజు (x/SitharaEnts)

సంక్రాంతి 2026కు థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీలోకి వస్తున్నాయి. అలా ఈ రోజు డిజిటల్ డెబ్యూ చేసిన మూవీ అనగనగా ఒక రాజు. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. బుధవారం నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

100 కోట్ల సినిమా

యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కెరీర్ లో అనగనగా ఒక రాజు మూవీ ఓ గ్రేట్ మైల్ స్టోన్ సెట్ చేసింది. అతని కెరీర్ లో రూ.100 కోట్ల కలెక్షన్లు అందుకున్న ఫస్ట్ సినిమా ఇదే. సంక్రాంతి 2026 సందర్భంగా జనవరి 14న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా ఆడియన్స్ ను అలరించింది.

కెమిస్ట్రీ అదుర్స్

అనగనగా ఒక రాజు సినిమాలో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. మూవీలో వీళ్ల కెమిస్ట్రీ అదిరిపోయింది. ఓ వైపు వన్ లైన్ పంచ్ లతో అరదగొట్టిన నవీన్.. మీనాక్షితో కలిసి కెమిస్ట్రీని కూడా బాగా పండించాడు. అనగనగా ఒక రాజు సినిమాకు మారి డైరెక్టర్. ఈ మూవీ ఇవాళ నుంచి నెట్‌ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

అనగనగా ఒక రాజు స్టోరీ

అప్పుడే పెద్దిపాలెం భూపతి రాజు (రావు రమేష్) కూతురు చారు (మీనాక్షి చౌదరి)ను చూస్తాడు. ఆమెకు కోట్ల ఆస్తి ఉందని తెలుసుకుంటాడు. ఎలాగైనా చారును పడేయాలని ‘ఆపరేషన్ చారు’ స్టార్ట్ చేస్తాడు. దాని కోసం ఎన్నో తంటాలు పడతాడు. చివరకు చారుతో పెళ్లి జరుగుతుంది. కానీ ఫస్ట్ నైట్ రోజు రాజుకు ఓ లెటర్ వస్తుంది. దీంతో కథ మలుపు తిరుగుతుంది.

అసలు ఆ లెటర్ ఎవరు రాశారు? అందులో ఏముంది? పెద్దిపాలెం ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎర్రిబాబు (తారక్ పొన్నప్ప)కు పోటీగా రాజు ఎందుకు నిలబడ్డాడు? అన్నది సినిమాలో చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks