బాలీవుడ్ విలక్షణ నటుడు, సైంధవ్ మూవీ విలన్ నవాజుద్దీన్ సిద్ధిఖీ మరోసారి నిక్కచ్చిగా మాట్లాడే తత్వంతో ఇండస్ట్రీలో చర్చకు తెరలేపారు. హిందీ సినిమాల్లో నిజాయితీ తగ్గిపోయిందని, అంతా ‘నకిలీ’ మయం అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఒక బహిరంగ చర్చా వేదికపై నవాజుద్దీన్ సిద్ధిఖీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
సమాజాన్ని తప్పుదోవ పట్టించకండి!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. సమాజాన్ని చైతన్యపరచడంలో సినిమాల పాత్రపై నవాజుద్దీన్‌కు ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ, కథల్లో నిజాయితీ ఉండటం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు.
తప్పుదోవ పట్టించాల్సిన అవసరం లేదు
"సమాజాన్ని తప్పుదోవ పట్టించాల్సిన అవసరం లేదు. నిజం అనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం వస్తున్న సినిమాల వెనుక ఉన్న అసలు సత్యం ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ, చాలామంది ఆ విషయాన్ని బయటకు చెప్పడానికి ఇష్టపడరు" అని నవాజుద్దీన్ సిద్దిఖీ పేర్కొన్నారు.
అన్నీ ‘ఫేక్’ సినిమాలే!
ప్రస్తుతం నడుస్తున్న కథనాల (Narratives) గురించి ప్రస్తావిస్తూ నవాజుద్దీన్ సిద్ధిఖీ మరింత ఘాటుగా స్పందించారు. "మన దగ్గర అన్నీ అబద్ధపు సినిమాలే తయారవుతున్నాయి. నకిలీ సినిమాలు తీస్తున్నారు. ప్రపంచంలో ఏం జరుగుతోంది, అసలు నిజం ఏంటి అనేది అందరికీ తెలుసు. ఎలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, ఏ రకమైన కథనాలను ప్రజలపై రుద్దుతున్నారు అనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది" అని నవాజుద్దీన్ సిద్ధిఖీ విమర్శించారు.
ఆ రెండు సినిమాలనేనా
నవాజుద్దీన్ ఏ సినిమా పేరునూ నేరుగా ప్రస్తావించనప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. ‘ది కేరళ స్టోరీ’, ‘ధురంధర్’ వంటి సినిమాలను ఉద్దేశించే ఆయన ఈ ‘ప్రచార చిత్రాల’ (Propaganda films) వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని నెటిజన్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చర్చిస్తున్నారు.
‘తుంబాడ్ 2’లో నవాజ్ మాస్ ఎంట్రీ!
ఇక సినిమాల విషయానికి వస్తే, నవాజుద్దీన్ సిద్ధిఖీ అభిమానులకు ఒక తీపి కబురు చెప్పారు. 2018లో సంచలనం సృష్టించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం ‘తుంబాడ్’ సీక్వెల్‌లో నవాజుద్దీన్ నటించబోతున్నారు. సోహమ్ షా నిర్మిస్తున్న ఈ ‘తుంబాడ్ 2’లో నవాజుద్దీన్ ఒక సంక్లిష్టమైన, కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.
{{/usCountry}}ఇక సినిమాల విషయానికి వస్తే, నవాజుద్దీన్ సిద్ధిఖీ అభిమానులకు ఒక తీపి కబురు చెప్పారు. 2018లో సంచలనం సృష్టించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం ‘తుంబాడ్’ సీక్వెల్‌లో నవాజుద్దీన్ నటించబోతున్నారు. సోహమ్ షా నిర్మిస్తున్న ఈ ‘తుంబాడ్ 2’లో నవాజుద్దీన్ ఒక సంక్లిష్టమైన, కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.
{{/usCountry}}టాలీవుడ్ ఎంట్రీ
ఒరిజినల్ సినిమాలోని మేకింగ్ స్టైల్ తనకు ఎంతో ఇష్టమని, ఈ సీక్వెల్‌లో భాగమవ్వడం ఉత్సాహంగా ఉందని ఆయన తెలిపారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే, విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన సైంధవ్ మూవీలో విలన్‌గా నటించిన నవాజుద్దీన్ సిద్ధిఖీ టాలీవుడ్‌లో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు.