...
...
Next Story

Nayanthara: రాకీ భాయ్ సామ్రాజ్యంలోకి.. యశ్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన నయనతార.. లేడీ సూపర్ స్టార్ షాకింగ్ కామెంట్స్

Nayanthara: సాధారణంగా సినిమాల ప్రమోషన్ ఈవెంట్లకు దూరంగా ఉండే లేడీ సూపర్ స్టార్ నయనతార.. రాకింగ్ స్టార్ యశ్ కోసం తన రూల్స్ ను పక్కనబెట్టి ‘టాక్సిక్’ ట్రైలర్ లాంచ్‌కు అటెండ్ అయింది. ఈ ఈవెంట్లో యశ్ ను కొనియాడుతూ నయన్ చేసిన ఎమోషనల్ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర సంచలనంగా మారాయి.

Published on: Aug 9, 2026, 11:34:37 IST
Advertisement

Nayanthara: రాకింగ్ స్టార్ యశ్ అప్ కమింగ్ మూవీ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic: A Fairytale for Grown-Ups) ట్రైలర్ లాంచ్ వేడుక బెంగుళూరులో అత్యంత ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు ఊహించని విధంగా హాజరైన లేడీ సూపర్ స్టార్ నయనతార మైక్ పట్టుకుని మాట్లాడటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

యశ్ ఫోన్ చేయగానే

రాకీ భాయ్ సామ్రాజ్యంలోకి.. యశ్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన నయనతార.. లేడీ సూపర్ స్టార్ షాకింగ్ కామెంట్స్
రాకీ భాయ్ సామ్రాజ్యంలోకి.. యశ్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన నయనతార.. లేడీ సూపర్ స్టార్ షాకింగ్ కామెంట్స్

తాను వేదికపైకి రావడం గురించి నయనతార స్పందిస్తూ.. "నేను సినిమాల ప్రమోషనల్ ఈవెంట్లకు హాజరుకాకపోవడానికి పెద్దగా మాట్లాడలేకపోవడమే కారణం. అందుకే వీలైనంత వరకు వాటికి దూరంగా ఉంటాను. కానీ 'టాక్సిక్' వేడుకకు రావడానికి చాలా ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది యశ్. ఆయన నన్ను ఈవెంట్‌కు రమ్మని ఒకే ఒక్క ఫోన్ కాల్ చేశారు. ఆయన అడగ్గానే కాదనలేక ఇక్కడికి వచ్చాను" అని స్పష్టం చేశారు.

రాకీ భాయ్ కింగ్‌డమ్‌లోకి

చిత్రసీమలో ఎంతోమంది అగ్ర కథానాయకులతో పనిచేసిన అనుభవం ఉన్న నయనతార.. యశ్‌తో తన ఫస్ట్ మీటింగ్ ను గుర్తుచేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"నేను చాలామంది సూపర్‌స్టార్లతో కలిసి పనిచేశాను. కానీ యశ్‌ను మొదటిసారి కలిసినప్పుడు ఆయనకున్న ఆ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ పర్సనల్‌గానూ కనిపించింది. ఆయనను చూడగానే 'నేను నిజంగానే రాకీ భాయ్ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టానా?' అనే భావన కలిగింది. ట్రైలర్‌లో ఆయన ఎంత పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారో, నిజ జీవితంలోనూ ఆయన వ్యక్తిత్వం అలాగే ఉంటుంది" అని నయన్ కొనియాడారు.

పని రాక్షసుడు

దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన టాక్సిక్ భారీ పాన్ వరల్డ్ చిత్రానికి యశ్, గీతూ మోహన్ దాస్ సంయుక్తంగా కథను అందించారు. ఈ చిత్రంలో నయనతారతో పాటు కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి నిర్మితమైన ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe