OTT Horror Comedy: ఓటీటీలోకి న్యూ హారర్ కామెడీ థ్రిల్లర్- కోడలు మంత్రగెత్తె అయితే- నవ్వులతోపాటు భయపెట్టే ట్విస్టులు!

Yami Gautam Nayyi Navelli OTT Streaming: యామీ గౌతమ్ హీరోయిన్‌గా తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం 'నయ్యి నవెల్లి' థియేటర్లలో విడుదలై ఆకట్టుకుంటోంది. దీంతో నయ్యి నవెల్లి ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. కొత్త పెళ్లికూతురు మంత్రగత్తె అయితే ఎలా ఉంటుందని కాన్సెప్టుతో తెరకెక్కించారు.

Published on: Oct 19, 2026, 10:55:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Yami Gautam Nayyi Navelli OTT Release: బాలీవుడ్‌లో విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ యామీ గౌతమ్. తెలుగులో కూడా హీరోయిన్‌గా అలరించిన యామీ గౌతమ్ హిందీలో వరుసపెట్టి సినిమాలతో ఆకట్టుకుంటోంది.

ఓటీటీలోకి న్యూ హారర్ కామెడీ థ్రిల్లర్- కోడలు మంత్రగెత్తె అయితే- నవ్వులతోపాటు భయపెట్టే ట్విస్టులు!
ఓటీటీలోకి న్యూ హారర్ కామెడీ థ్రిల్లర్- కోడలు మంత్రగెత్తె అయితే- నవ్వులతోపాటు భయపెట్టే ట్విస్టులు!

నయ్యి నవెల్లి ఓటీటీ స్ట్రీమింగ్

యామీ గౌతమ్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ'నయ్యి నవెల్లి'. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన నయ్యి నవేలి మంచి టాక్ సొంతం చేసుకుంటోంది. నవ్వులతో పాటు భయపెట్టే వినోదాన్ని అందిస్తున్న నయ్యి నవెల్లి ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ఇంట్రెస్ట్ నెలకొంది.

ఆసక్తికరంగా సాగే అత్తారింటి కథాంశం

క్రేజీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 'నయ్యి నవెల్లి' కథ మొత్తం ఒక ఇంటికి కోడలిగా వచ్చిన కొత్త వధువు చుట్టూ తిరుగుతుంది. కార్పొరేట్ ఉద్యోగి అయిన మోహిని (యామీ గౌతమ్) రాజా అవస్థీ (ఆదినాథ్ ఎం కోఠారే) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెడుతుంది.

మోహిని మంత్రగత్తె

అయితే మోహిని ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి వింత సంఘటనలు జరుగుతుంటాయి. దాంతో మోహిని సాధారణ మనిషి కాదని, ఆమె ఒక దెయ్యమని, మంత్రగత్తె అని బావమరిది బంటూ అనుమానించడం ప్రారంభిస్తాడు. తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొడుతూ తాను మామూలు అమ్మాయినేనని నిరూపించుకోవడానికి మోహిని తీవ్రంగా ప్రయత్నిస్తుంది.

కోడలు మంత్రగత్తె అయితే?

రోజురోజుకూ పరిస్థితులు చేజారిపోవడంతో అసలు నిజం బయటపడుతుంది. అత్తారింటికి వచ్చిన కొత్త కోడలు నిజంగానే దెయ్యమా? లేక ఆమెపై కావాలనే నిందలు వేశారా? చివరికి ఆమెను ఆ కుటుంబం అంగీకరించిందా లేదా అన్నది థ్రిల్లింగ్, కామెడీ అంశాలతో దర్శకుడు ఆసక్తికరంగా మలిచారు.

స్త్రీ, ముంజ్యా తరహాలోనే

'స్త్రీ', 'ముంజ్యా' వంటి హారర్ కామెడీ చిత్రాలకు ఉత్తరాదినే కాక దక్షిణాదిలోనూ మంచి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో 'నయ్యి నవెల్లి' కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?

ఇలా క్రేజీ కాన్సెప్టుతో ఆకట్టుకుంటోన్న నయ్యి నవెల్లి ఓటీటీ రిలీజ్‌పై తాజాగా స్పష్టత వచ్చింది. నయ్యి నవెల్లి ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' దక్కించుకుంది. సినిమా పోస్టర్లలో ప్రైమ్ వీడియో భాగస్వామ్యానికి సంబంధించిన వివరాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

రెంటల్ విధానం తర్వాత

సాధారణంగా సినిమాలు థియేటర్లలో విడుదలైన 4 నుంచి 8 వారాల వ్యవధిలో డిజిటల్ వేదికలపైకి వస్తుంటాయి. అయితే, నవంబర్ 27న రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్‌లో నయ్యి నవెల్లి ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారం. అనంతరం డిసెంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్స్ ఎలాంటి అద్దె విధానం లేకుండా నయ్యి నవెల్లి సినిమాను ఓటీటీలో చూడొచ్చని తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More