Nayyi Navelli Trailer: దెయ్యమా? గృహలక్ష్మా? చేయి పడితే నొప్పి మాయం- హారర్ కామెడీతో యామీ గౌతమ్ రచ్చ- రజనీకాంత్‌తో పోటీ!

Yami Gautam Nayyi Navelli Trailer Released: జాతీయ ఉత్తమ నటి అవార్డ్ అందుకున్న యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త హారర్ ఫాంటసీ ఫ్యామిలీ కామెడీ చిత్రం నయ్యి నవెల్లి ట్రైలర్ తాజాగా విడుదలైంది. కొత్త కోడలిగా అడుగుపెట్టిన యువతి చుట్టూ తిరిగే ఈ మిస్టరీ కథనం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Published on: Oct 1, 2026, 06:25:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Yami Gautam Nayyi Navelli Trailer Released: జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుని మంచి ఫామ్‌లో ఉన్న బాలీవుడ్ భామ యామీ గౌతమ్ మరో విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మిస్టరీ ఫ్యామిలీ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ 'నయ్యి నవెల్లి' ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

దెయ్యమా? గృహలక్ష్మా? చేయి పడితే నొప్పి మాయం- హారర్ కామెడీతో యామీ గౌతమ్ రచ్చ- రజనీకాంత్‌తో పోటీ!
దెయ్యమా? గృహలక్ష్మా? చేయి పడితే నొప్పి మాయం- హారర్ కామెడీతో యామీ గౌతమ్ రచ్చ- రజనీకాంత్‌తో పోటీ!

కథేంటంటే?

ఇప్పటివరకు గంభీరమైన, సీరియస్ పాత్రలతో మెప్పించిన బ్యూటిఫుల్ యామీ గౌతమ్ ఈసారి కామెడీ, భయం కలగలిపిన సరికొత్త అవతారంలో అలరించేందుకు వస్తున్నారు. నయ్యి నవెల్లి ట్రైలర్ పరిశీలిస్తే, అవాస్థి కుటుంబంలోకి మోహిని (యామీ గౌతమ్) కొత్త కోడలిగా అడుగుపెట్టడంతో కథ ప్రారంభమవుతుంది.

కొత్త కోడలి రూపంలో వింత ప్రవర్తన..

ఇంట్లోని వారంతా కొత్త కోడలికి ఆనందంగా ఘన స్వాగతం పలుకుతారు. చూడటానికి ఎంతో పద్ధతిగా, అమాయకంగా కనిపించే ఆ కొత్త కోడలి ప్రవర్తనలో మెల్లమెల్లగా వింత మార్పులు మొదలవుతాయి. ఆమె సాధారణ మనిషి కాదని, ఏదో చేతబడి చేసే దెయ్యం (డాకిని) లేదా మంత్రగత్తె అయి ఉంటుందనే అనుమానాలు కుటుంబ సభ్యుల్లో వ్యక్తమవుతాయి.

కుటుంబ బంధాలు, వినోదం మధ్య సాగే ఈ కథలో మోహిని అసలు నిజరూపం ఏమిటి? ఆమె చుట్టూ అల్లుకున్న రహస్యాలేంటి? అనే ఆసక్తికర అంశాలతో ట్రైలర్‌ను కట్ చేశారు. సీనియర్ నటీనటులు సునీతా రాజ్‌వర్, మీతా వసిష్ఠ్, సుస్మితా ముఖర్జీ, ఆదినాథ్ ఎం కోఠారే, అనురాగ్ ఠాకూర్, ఆదిత్య కులశ్రేష్ఠ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

హైలెట్ సీన్స్

ఇంట్లోని బామ్మ కాలికి మోహిని చేయి తగలగానే నయం కావడం, క్షణాల్లో ఇంటి సభ్యులందరికి భారీగా విందు రెడీ చేయడం వంటివి ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. అలాగే, మోహిని అసలు స్వరూపం ఎలా ఉంటుందో చూపించే సీన్ కామెడీతోపాటు భయపెట్టేలా ఉంది. రావణాసూరుడితో జరిగే ఫైట్ సీన్ హైలెట్‌గా నిలిచింది.

"నా కెరీర్‌లో ఇదొక ప్రత్యేకమైన పాత్ర" - యామీ గౌతమ్

ఈ సినిమాలో తాను పోషించిన మోహిని పాత్ర గురించి యామీ గౌతమ్ స్పందిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "మనం ఊహించిన దానికి పూర్తి భిన్నంగా మోహిని పాత్ర ఉంటుంది. పైకి ఎంతో ఆప్యాయంగా కనిపిస్తూనే, తనలో ఒక విచిత్రమైన రహస్య గుణాన్ని దాచుకుంటుంది. కుటుంబ బంధాలు, హాస్యం, భావోద్వేగాలు, ఫాంటసీ, యాక్షన్.. ఇలా అన్ని రకాల వేరియేషన్లు ప్రదర్శించే అవకాశం 'నయ్యి నవెల్లి' ద్వారా నాకు దక్కింది" అని యామీ గౌతమ్ తెలిపారు.

దసరా బరిలో భారీ పోటీ.. అక్టోబర్ 16న విడుదల

ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ సంయుక్తంగా నిర్మించిన నయి నవెల్లి చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. హిమాన్షు శర్మ, దివ్య నిధి శర్మ అందించిన స్క్రీన్‌ప్లే ఈ హారర్ డ్రామాకు ప్రధాన బలంగా నిలవనుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అజయ్ దేవగన్, రజనీకాంత్‌తో పోటీ

అయితే ఈ దసరా సీజన్‌లో అజయ్ దేవగన్ 'దృశ్యం: ది కన్‌క్లూజన్', రజనీకాంత్ 'జైలర్ 2' వంటి భారీ చిత్రాలు కూడా బాక్సాఫీస్ బరిలో దిగే అవకాశం ఉండటంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. అయినప్పటికీ, వినూత్నమైన కాన్సెప్ట్ కావడంతో నయీ నవేలి సినిమాపై హిందీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More