...
...
Next Story

Netflix Thriller: 9000 సినిమాలను దాటేసి.. నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియన్ మూవీ రికార్డు.. పేషెంట్లను లొంగదీసుకునే లేడీ డాక్టర్

Netflix Thriller: నెట్‌ఫ్లిక్స్ లో ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమాగా కొంకణా సేన్ శర్మ నటించిన హిందీ థ్రిల్లర్ మూవీ అక్యూజ్డ్ (Accused) నిలిచింది. సుమారు 2 కోట్ల వ్యూస్ తో నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ లలో తొలి స్థానంలో ఉండటం విశేషం.

Published on: Jul 18, 2026 10:34 AM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Netflix Thriller: నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్స్‌ని సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ 'అక్యూజ్డ్' (Accused) వణికించేస్తోంది. బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్ డిజిటల్ వింగ్ ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ థ్రిల్లర్ 2026లో అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ ఒరిజినల్ టైటిల్‌గా నిలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. థియేట్రికల్ రిలీజ్ లేకుండా డైరెక్ట్‌గా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చిన ఈ మూవీ సృష్టించిన ఇంపాక్ట్ ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

ఓటీటీని షేక్ చేస్తున్న వ్యూయర్ షిప్ డేటా

Netflix Thriller: 9000 సినిమాలను దాటేసి.. నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియన్ మూవీ రికార్డు.. పేషెంట్లను లొంగదీసుకునే లేడీ డాక్టర్
Netflix Thriller: 9000 సినిమాలను దాటేసి.. నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియన్ మూవీ రికార్డు.. పేషెంట్లను లొంగదీసుకునే లేడీ డాక్టర్

నెట్‌ఫ్లిక్స్ రీసెంట్‌గా రిలీజ్ చేసిన హాఫ్ ఇయర్లీ వరల్డ్‌వైడ్ ఎంగేజ్‌మెంట్ రిపోర్ట్‌లో ఈ సినిమా సంచలనాలు బయటపడ్డాయి. కేవలం నాలుగున్నర నెలల టైమ్‌లోనే ఈ అక్యూజ్డ్ మూవీ ఏకంగా 19.4 మిలియన్ల (1.94 కోట్లు) వ్యూస్ సొంతం చేసుకుంది.

ఈ రేంజ్ వ్యూస్‌తో నెట్‌ఫ్లిక్స్ హిస్టరీలోనే టాప్ 10 మోస్ట్ వాచ్‌డ్ ఇండియన్ ఒరిజినల్ సినిమాల లిస్ట్‌లోకి దూసుకెళ్లింది. గ్లోబల్ లెవెల్లో అందుబాటులో ఉన్న దాదాపు 9 వేల సినిమాల్లో ఈ చిత్రం 67వ ర్యాంక్ సాధించడం ఇండియన్ సినిమా సత్తా ఏంటో నిరూపిస్తోంది.

అనుభూతి కశ్యప్ డైరెక్షన్.. అదిరిపోయే టెక్నికల్ వాల్యూస్

ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ అనుభూతి కశ్యప్ ఎంతో గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు. గతంలో 'డాక్టర్ జి' సినిమాతో మెప్పించిన ఈమె.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సోదరి కావడం విశేషం.

అన్న తరహాలోనే డార్క్ ఎలిమెంట్స్, హ్యూమన్ సైకాలజీని ఇందులోని ప్రతి సీన్ లోనూ ఎంతో ఇంటెన్స్‌గా ప్రెజెంట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. సిచువేషనల్ విజువల్స్ థ్రిల్లర్ లవర్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి.

కొంకణా సేన్ శర్మ, ప్రతిభా రాంటా పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్

ఈ సినిమాలో ఆమెది ఓ లెస్బియన్ రోల్ కావడం గమనార్హం. తన దగ్గరికి వచ్చే పేషెంట్లను ఆమె లొంగదీసుకుంటోందన్న ఆరోపణలు ఎదుర్కొంటుంది. అది కాస్తా కోర్టు వరకూ వెళ్తుంది. తన పార్ట్‌నర్ కూ దూరమవుతుంది. అలాంటి పాత్రలో కొంకణా నటన అద్భుతమనే చెప్పాలి.

రాణించిన 'లాపాతా లేడీస్' బ్యూటీ

'లాపాతా లేడీస్' సినిమాతో దేశవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ ప్రతిభా రాంటా.. ఇందులో ఒక చాలెంజింగ్ క్యారెక్టర్‌లో కనిపించి అందరినీ షాక్‌కి గురిచేసింది. అమాయకత్వంతో పాటు మైండ్ గేమ్స్ ఆడే పాత్రలో ఆమె చూపించిన వేరియేషన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.

కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రాలతో కలసి వ్యాక్సిన్ కింగ్ అదార్ పూనావాలా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మించడం ఇండస్ట్రీలో ఒక మైల్ స్టోన్ గా మారింది. హిందీతో పాటు సౌత్ భాషల్లోనూ ఈ మూవీకి లాంగ్ రన్ లో భారీ వ్యూస్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe