...
...
Next Story

Netflix Release: ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో పండగ.. కచ్చితంగా చూడాల్సిన సినిమాలు, సిరీస్‌లు ఇవే.. థ్రిల్ గ్యారెంటీ!

Netflix Release: ఈ వారం ఓటీటీ ప్రియులకు నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే ట్రీట్ ఇస్తోంది. యాక్షన్, క్రైమ్, హారర్, కామెడీ ఇలా అన్ని రకాల జానర్స్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లను తీసుకువస్తోంది. విజయ్ సేతుపతి, కీర్తి సురేష్, రాధికా ఆప్టే, సందీప్ కిషన్ లాంటి స్టార్స్ నటించిన క్రేజీ ప్రాజెక్ట్స్ ఈ జాబితాలో ఉన్నాయి.

Published on: Oct 26, 2026, 12:48:48 IST
Advertisement

Netflix Release: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, లిజోమోల్ జోస్ నటించిన బ్లాక్ బస్టర్ కామెడీ డ్రామా 'బత్తా'. 1986 మద్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో విజయ్ సేతుపతి 'బచ్చలమ్' అనే లోకల్ గ్యాంగ్‌స్టర్‌గా నటించారు. అందరూ భయపడే ఒక డాన్.. అనుకోకుండా స్కూల్ బాత్‌రూమ్‌లో లాక్ అయితే ఏం జరుగుతుంది? అనే ఆసక్తికరమైన పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం అక్టోబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

అక్క (Akka)

ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో పండగ.. కచ్చితంగా చూడాల్సిన సినిమాలు, సిరీస్‌లు ఇవే.. థ్రిల్ గ్యారెంటీ!
ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో పండగ.. కచ్చితంగా చూడాల్సిన సినిమాలు, సిరీస్‌లు ఇవే.. థ్రిల్ గ్యారెంటీ!

కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ అండ్ క్రైమ్ వెబ్ సిరీస్ 'అక్క'. మహిళల చేతుల్లో నడిచే ఒక సామ్రాజ్యంలో ఆధిపత్య పోరు, గ్యాంగ్‌వార్స్ నేపథ్యంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ఈ సిరీస్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మించింది. అక్టోబర్ 30 నుంచి ఈ పవర్‌ఫుల్ లేడీ ఓరియంటెడ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది.

సిగ్మా (Sigma)

దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా తెరకెక్కించిన ఫస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ 'సిగ్మా'. టాలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ హీస్ట్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. అక్టోబర్ 30 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.

ఎస్సై యుగంధర్ (Sub-Inspector Yugandhar)

ఆది సాయికుమార్ లేటెస్ట్ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'ఎస్సై యుగంధర్'. పోలీస్ కస్టడీలో ఉన్న ఒక శవం మాయం కావడం, ఆ మిస్టరీని ఛేదించే క్రమంలో ఎస్సై యుగంధర్‌కు ఎదురయ్యే సవాళ్ల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఇదొక బెస్ట్ ఆప్షన్. అక్టోబర్ 30 నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

అవరాచన్ అండ్ సన్స్ (Avarachan & Sons)

కే-డ్రామాలను (K-Dramas) విపరీతంగా ఇష్టపడేవారి కోసం 'డెడ్-ఎండ్ జాబ్' అనే హారర్ కామెడీ సిరీస్ అక్టోబర్ 30న రిలీజ్ అవుతోంది. 50 రెట్లు ఎక్కువ జీతం వస్తుందని ఒక మిస్టీరియస్ జాబ్‌లో చేరిన యువకుడికి ఎదురయ్యే భయంకరమైన పరిస్థితుల చుట్టూ ఈ సిరీస్ ఉత్కంఠభరితంగా సాగుతుంది.

హాలీవుడ్ అండ్ స్పానిష్ థ్రిల్లర్స్

వీటితో పాటు జర్మన్ కామెడీ మూవీ 'ది బర్త్‌డే గిఫ్ట్' (The Birthday Gift), బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో సాగే స్పానిష్ హీస్ట్ థ్రిల్లర్ సిరీస్ 'కొలిజన్ కోర్స్' (Collision Course) కూడా అక్టోబర్ 30నే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.

యానిమేటెడ్ సిరీస్‌లు

రెగ్యులర్ సినిమాలే కాకుండా యానిమే లవర్స్ కోసం అక్టోబర్ 29న 'ది రాంపార్ట్స్ ఆఫ్ ఐస్ ఎపిసోడ్ 19' (The Ramparts of Ice E19), అక్టోబర్ 30న 'స్టీల్ బాల్ రన్ ఎపిసోడ్ 7' (Steel Ball Run E7), అలాగే అక్టోబర్ 31న 'డీమన్స్ ఆఫ్ ది షాడో రియల్మ్ ఎపిసోడ్ 18' (Daemons of the Shadow Realm E18) ఎపిసోడ్స్ నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks